Don't Miss!
- Sports PBKS vs MI: నిప్పులు చెరిగిన బుమ్రా.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన ముంబై ఇండియన్స్!
- News పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
చాలా కాలం తరువాత బిజీగా మారనున్న తరుణ్.. వరుసగా మూడు ప్రాజెక్టులు
ఇరవై ఏళ్ళ క్రితం ఇదే సమయానికి ఒక హీరో పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అతని పేరే తరుణ్. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ అందుకున్న తరుణ్ నువ్వే కావాలి సినిమాతో హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా 20ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఇటీవల ఆ సినిమాకు పనిచేసిన కొందరు యూనిట్ సభ్యులు ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆ సినిమాకు త్రివిక్రమ్ రచయితగా వర్క్ చేసిన విషయం తెలిసిందే.
అసలు మ్యాటర్ లోకి వెళితే హీరోగా ఆ సినిమాతోనే బాక్సాఫీస్ హిట్ అందుకున్న యువ హీరో తరుణ్ కొన్నాళ్లకు సైలెంట్ అయిన విషయం తెలిసిందే. వరుసగా సినిమాలు డిజాస్టర్ కావడంతో తరుణ్ కూడా ఇతర బిజినెస్ లపై దృష్టి పెట్టి పర్సనల్ కెరీర్ ని ఒక ట్రాక్ లో సెట్ చేసుకున్నాడు. రెగ్యులర్ గా ఇండస్ట్రీలో స్నేహితులతో సన్నిహితంగా ఉండే తరుణ్ ఇటీవల కొందరితో ఒక సినిమా గురించి చర్చించినట్లు తెలుస్తోంది. సొంతంగా ఆ సినిమాను నిర్మించాలని అనుకుంటున్నాడట.
అదే విధంగా డిజిటల్ మీడియాలో కూడా తన హోమ్ ప్రొడక్షన్ లోనే రెండు వెబ్ సిరీస్ లను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. వీలైనంత వరకు ఎక్కువగా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ పై వెబ్ సిరిస్ లని ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నాడట. టాలెంట్ ఉన్న యువ దర్శకులతో ఇప్పటికే మూడు స్క్రిప్ట్ లను కూడా ఓకే చేసినట్లు సమాచారం. ఒక సినిమాను మాత్రం వెండితెరపై భారీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడట. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.