వైష్ణవ్ తేజ్‌ను టార్గెట్ చేసిన మరో బడా బ్యానర్..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ అందుకున్న హీరో వైష్ణవ్ తేజ్ అని అందరికి తెలిసిన విషయమే. ఉప్పెన సినిమాతో ఉప్పెన లాంటి కలెక్షన్స్ అందుకున్న ఈ మెగా మేనల్లుడు నెక్స్ట్ సినిమాలతో కూడా అంతే పవర్ఫుల్ గా రెడీ అవుతున్నాడు. రెగ్యులర్ ఫార్మాట్ ను పక్కన పెట్టి కాస్త విభిన్నమైన సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.
ఉప్పెన సినిమా రాకముందే క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా కూడా పూర్తి చేశాడు. జంగిల్ బుక్ అనే ఆ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకి రావచ్చు. అలాగే BVSN ప్రసాద్ ప్రొడక్షన్ లో కూడా ఇప్పటికే ఒక సినిమాను లాంచ్ చేశారు. ఆ సినిమా తరువాత ఇప్పుడు మరొక సినిమాను కూడా సెట్స్ పైకి తెచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. మజిలీ, టక్ జగదీష్ సినిమాలను నిర్మించిన సాహు గరాపాటి, హరీష్ పెద్ది ఇటీవల వైష్ణవ్ తో చర్చలు జరిపినట్లు సమాచారం.

కొత్త క్సర్శకుడితో కథను చెప్పించగా వైష్ణవ్ కూడా పాజిటివ్ గా స్పందించినట్లు సమాచారం. త్వరలోనే అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు వైష్ణవ్ కోసం మైత్రి మూవీ మేకర్స్ కూడా మరో కథను రెడీ చేయిస్తోంది. కథ నచ్చితే వైష్ణవ్ ఆ సినిమా విషయంలో పెద్దగా అభ్యంతరం చెప్పకపోవచ్చు. మొదటి సినిమా హిట్టవ్వడంతో రోజుకో ఆఫర్ రావడం అనేది కామన్. అయితే వైష్ణవ్ రెమ్యునరేషన్ కు ఏ మాత్రం టెంప్ట్ అవ్వకుండా కేవలం తనకు నచ్చిన కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











