Don't Miss!
- Finance
pmay: ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? ఇది మీ కోసమే..
- Sports
INDvsNZ : రెండో టీ20 పిచ్ రిపోర్ట్.. డేంజర్లో టీమిండియా రికార్డు!
- News
మా నాన్న జోలికి వస్తే సహించం - తమ్ముడంటే ప్రాణం: రాం చరణ్ వార్నింగ్..!!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
కల్యాణం వచ్చినా.. కక్కొచ్చినా ఆగదు.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నాగశౌర్య
యువ హీరో, హీరోయిన్లు నాగ శౌర్య , రీతు వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్న లవ్ & ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'వరుడు కావలెను' సినిమా ఈ నెల 29న థియేటర్స్ లోకి వస్తోంది. ఈ సందర్భంగా సినిమాలో ఆకాశ్ పాత్రలో నటించిన హీరో నాగశౌర్య తన క్యారెక్టర్ గురించి, సినిమా గురించి కొన్ని విశేషాలు మీడియాతో చెప్పుకొంటూ..

వరుడు కావలెను కథ విన్నప్పుడు బావుంది అనిపించింది. షూట్‌కి వెళ్లాక మనం కరెక్ట్‌గా వెళ్తున్నామా అనిపించింది. ఎడిటింగ్ సూట్‌లో అనుకున్న దాని కన్నా బాగా వచ్చింది అనిపించింది. ఫైనల్ అవుట్‌పుట్ చూశాక.. బ్లాక్‌బస్టర్ అని అర్థమైంది. సినిమాలో ఏదన్నా డౌట్‌గా ఉంటే నా ఫేస్‌లో ఈజీగా తెలిసిపోతుంది. నేను సినిమాల్లోనే యాక్ట్ చేయగలను. బయట యాక్ట్ చేయలేను. నాకు ఈ సినిమా మీద అంతగా నమ్మకం ఉంది. చినబాబుగారు నా కుటుంబ సభ్యులకు సినిమా చూపించమని చెప్పారు. 'సినిమా మీద డౌట్ ఉంటే చూపించొచ్చు. ఇక్కడ ఏ డౌట్ లేనప్పుడు జనాలతో కలిసి చూడటమే బావుంటుంది సర్' అని అమ్మవాళ్లకు సినిమా చూపించలేదు అన్నాను. ఆయన లాంటి నిర్మాతలు పరిశ్రమకు అవసరం. కథకు ఏం కావాలో వారికి తెలుసు అని నాగశౌర్య అన్నారు.
కల్యాణం వచ్చినా.. కక్కు వచ్చినా ఆగదంటారు. నా పెళ్లి విషయంలో నాకు పెద్దగా ప్లాన్స్ ఏమీ లేవు. మనం ఎంత ప్లాన్ చేసిన పెళ్లి విషయంలో రాసి పెట్టిందే జరుగుతుంది. వచ్చిన భార్యను బాగా చూసుకోవాలనుకుంటా. తనకు ప్రైవసీ ఇవ్వాలి. ఆమె ఫ్రొషెషన్‌కు గౌరవం ఇవ్వాలి. ఫైనల్‌గా ఆ అమ్మాయిని బాగా చూసుకోవాలి అంతే! అని నాగశౌర్య తన అభిప్రాయాన్ని చెప్పారు.
నేను ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఒక్కో మెట్టు ఎక్కుతున్నా. ఈ రంగంలో అడుగుపెట్టాక నాకు మంచి సపోర్ట్ దక్కింది. ప్రీ రిలీజ్ వేడుకలో బన్నీ అలా మాట్లాడటం ఆనందంగా అనిపించింది. ఆయన మాటలు ఇంకా కష్టపడాలనేంత స్ఫూర్తినిచ్చింది. బన్నీ అన్న కాంప్లిమెంట్స్‌కి థ్యాంక్స్ అని నాగశౌర్య పేర్కొన్నారు.
అవసరాల శ్రీనివాస్‌తో చేస్తున్న 'ఫలానా అమ్మాయి.. ఫలానా అబ్బాయి' సినిమా నాకు డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిది. ఈ సినిమా పనులు మొదలుపెట్టి 4 ఏళ్లు అవుతుంది. నా కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రమది. అందులో శౌర్యాను ఏడు రకాలుగా చూస్తారు. 'నారీ నారీ నడుమ మురారి' చిత్రం నేను చేయడం లేదు. ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తా. సినిమా హిట్టైనా, ఫ్లాప్ అయినా ఆ బాధ్యత నేనే తీసుకుంటా. ఎందుకంటే అమ్మ సజెషన్ తీసుకుంటే సినిమా అటు ఇటు అయితే నీవల్లే అని మాట వస్తుంది. అది మంచిది కాదు. అమ్మ ఇచ్చిన సలహాలు తీసుకుంటా. నేను ఎప్పుడు కింద పడిపోలేదు. నేను మెల్లగా నిలబడుతున్నా. ఓటీటీకి నేను రెడీగా లేను. నన్ను నేను 70ఎంఎంలో చూసుకోవాలనుకుంటున్నా. నా సినిమాతో విడుదలవుతున్న 'రొమాంటిక్' కూడా బాగా ఆడాలి అని నాగశౌర్య తెలిపారు.