Don't Miss!
- News
Bengaluru: ఇది బెంగళూరులో పరిస్థితి, జంటను కారులో వెంబడించి. కారు కెమెరాలో చిక్కిపోయారు!
- Sports
IND vs NZ: స్టన్నింగ్ డెలివరీతో షేన్ వార్న్‌ను గుర్తు చేసిన కుల్దీప్ యాదవ్వీడియో
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
మెగా ఫ్యామిలీ క్రిస్మస్ సెలబ్రేషన్స్.. చరణ్, వరుణ్ తేజ్ స్పెషల్ పిక్ వైరల్!
మెగా ఫ్యామిలీలో ఎలాంటి వేడుకలు జరిగినా కూడా అందరూ కూడా ఒక దగ్గర చేరి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఫెస్టివల్ అయినా సరే ఏదైనా శుభకార్యమైనా సరే అందరూ ఆరోజు చేసే అల్లరి సరదాలు అంతా అంతా కాదు. ఇక ముఖ్యంగా ప్రతి ఏడాది మెగా ఫ్యామిలీ లోని కుటుంబ సభ్యులందరూ కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు.
ముఖ్యంగా అల్లు అర్జున్ అలాగే రామ్ చరణ్ తేజ్ కూడా ఈ ఫెస్టివల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటారు. ఇక గత రాత్రి ఉపాసన మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఒక స్పెషల్ ఫోటోను షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక కొద్ది సేపటి క్రితం వరుణ్ తేజ్ కూడా తన అన్నయ్యతో ఉన్న మరొక ఫోటోను షేర్ చేసుకున్నాడు. అందులో సీక్రెట్ శాంటాగా వరుణ్ తేజ్ రామ్ చరణ్ ఇద్దరు కూడా డిఫరెంట్ గెటప్ లో కనిపించారు. ఒకరికొకరు కానుకలు ఇచ్చుకుంటూ ఈ పండగ వాతావరణంలో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ఫెస్టివల్ లో అయితే అల్లు అర్జున్ కూడా తన భార్య స్నేహ రెడ్డితో కలిసి పాల్గొన్నాడు. ఇక మెగా డాటర్స్ శ్రీజ నిహారిక కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. అలాగే మెగా మేనల్లుళ్లు సాయిధరమ్ తేజ్ వరుణ్ తేజ్ కూడా క్రిస్మస్ పార్టీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యంగా అల్లు అర్జున్ వరుణ్ తేజ్ ఇద్దరు కూడా ఒకే ఫ్రేమ్ కనిపించడంతో ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఇక వీరికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం వారి సినిమాలతో చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా క్రిస్మస్ సందర్భంగా అందరూ ఒక చోట చేరి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు. అలాగే న్యూ ఇయర్ కూడా ఇదే తరహాలో సెలబ్రేట్ చేసుకోవాలి అని మెగా కుటుంబ సభ్యులు ఆలోచిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ కూడా ఈ పార్టీలో పాల్గొని ఉంటే బాగుండేది అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.