TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
బాక్సింగ్ పంచ్‌లు మొదలుపెట్టిన వరుణ్ తేజ్!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుసగా ప్రయోగాలు చేస్తున్నాడు. వరుణ్ తేజ్ ప్రయోగాల బాట కంచె చిత్రంతోనే మొదలైంది. ఇటీవల అంతరిక్షం చిత్రంలో వ్యోమగామిగా నటించి మెప్పించాడు. ఆ తర్వాత ఎఫ్2 చిత్రంలో వెంకటేష్ తో కలసి కామెడీ పండించాడు. ఇటీవలే హరీష్ శంకర్ దర్శత్వంలో వాల్మీకి చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. తమిళ సూపర్ హిట్ చిత్రం జిగర్తాండకు ఇది రీమేక్.
ఈ చిత్రంలో వరుణ్ తేజ్ పాత్ర హైలైట్ అయ్యేలా దర్శకుడు హరీష్ శంకర్ కథలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ గ్యాప్ లో వరుణ్ తేజ్ మరో క్రేజీ చిత్రానికి రెడీ అయిపోతున్నాడు. డెబ్యూ దర్శకుడు కిరణ్ కొర్రపాటి డైరెక్షన్ బాక్సింగ్ నేపథ్యంలో సాగె చిత్రానికి వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
వైరల్ అవుతున్న లేడీ సింగర్ ఫోటోస్.. బిత్తరపోతున్న అనుష్క ఫ్యాన్స్

ఈ చిత్రం కోసం వరుణ్ తేజ్ బాక్సింగ్ మెళుకువలు నేర్చుకునేందుకు లాస్ ఏంజెల్స్ వెళ్ళాడు. బాక్సింగ్ శిక్షణ పొందుతున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వరుణ్ తేజ్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా కిరణ్ ఈ చిత్ర కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.