Don't Miss!
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
నన్ను బయటకు తోశాడు, నా లవ్ ఎవరో చెబుతా, త్వరలో పెళ్లి : రాజ్ తరుణ్
'ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్' ఇలా తెరంగ్రేటంలోనే వరుస విజయాలు అందుకున్న రాజ్ తరుణ్ ఒక్కసారిగా ఇండస్ట్రీలో డిమాండ్ ఉన్న హీరోగా మారిపోయాడు. పెద్ద స్టార్ అయ్యే టాలెంట్ ఉన్న కుర్రోడిగా పేరు తెచ్చుకున్నాడు. వరుస సినిమాలకు సైన్ చేశాడు. అయితే కథల ఎంపిక విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోక పోవడంతో వరుస పరాజయాలు తప్పలేదు. త్వరలో 'ఇద్దరి లోకం ఒకటే' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ట్విట్టర్లో అభిమానులతో చాట్ చేసిన యంగ్ హీరో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కొందరు ఫ్యాన్స్ ఆయన పెళ్లి గురించి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు.

నా దృష్టిలో బెస్ట్ డాన్సర్ ఆయనే
మీ దృష్టిలో ఇండస్ట్రీలో బెస్ట్ డాన్సర్ ఎవరు? అనే ప్రశ్నకు రాజ్ తరుణ్ స్పందిస్తూ... ‘ప్రభుదేవా' అని సమాధానం ఇచ్చారు. మరో ప్రశ్నకు బదులిస్తూ బెస్ట్ సింగర్ శ్రేయ ఘోషల్ అన్నారు. తమ నేటివ్ ప్లేస్ విశాఖపట్నం అని వెల్లడించారు.

మేనేజర్ బయటకు తోశాడు
విశాఖలోని గోపాలపట్నం ఏరియాలో మీ ఫేవరెట్ థియేటర్ ఏమిటనే ప్రశ్నకు... ‘సుకన్య' అని సమాధానం ఇచ్చారు. ఆ థియేటర్ మేనేజర్ తనను బయటకు తోసిన విషయం ఇప్పటికీ గుర్తు ఉందని ఈ సందర్భంగా రాజ్ తరుణ్ గుర్తు చేసుకున్నారు.

ఫేవరెట్ హాలిడే డెస్టినేషన్
తన ఫేవరెట్ హాలిడే డెస్టినేషన్ మా ఇల్లు, ఈ ప్రపంచంలో నేను ఎక్కువగా ఆరాధించే వ్యక్తి మా నాన్న, తనకు ఇష్టమైన నటుడు మహేష్ బాబు అని రాజ్ తరుణ్ తెలిపారు. మహేష్ బాబుతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేయాలని ఒక అభిమాని అడగ్గా.... రాజ్ తరుణ్ తర్వాత ఎప్పుడై అంటూ దాట వేశాడు.

డైరెక్టర్ అవ్వాలని ఉంది
సినీ జీవితంలో హీరోగా కాకుండా చేయాలనుకునే మరో రోల్ ఏమిటనే ప్రశ్నకు రాజ్ తరుణ్ స్పందిస్తూ... ‘డైరెక్టర్' అని స్పష్టం చేశారు. దీన్ని బట్టి రాజ్ తరుణ్ భవిష్యత్తులో ఎప్పటికైనా ఓ సినిమా డైరెక్ట్ చేసే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.

అంత ఎప్పుడూ ఆలోచించలేదు
మీరు సినిమాలు చేసే వేగం ఎప్పుడు పెంచుతారు? ఇలా గ్యాప్ రావడం వల్ల మీ కెరీర్ మీద నెగెటివ్ ఇంపాక్ట్ పడుతుందని ఎప్పుడూ ఆలోచించలేదా? అనే ప్రశ్నకు రాజ్ తరుణ్ స్పందిస్తూ.... అంత ఎప్పుడూ ఆలోచించను అని స్పష్టం చేశాడు.

నా లవ్ ఎవరో... పెళ్లి ఎప్పుడో త్వరలో చెబతా
మీరు గతంలో నాది లవ్ మ్యారేజ్ అని అనౌన్స్ చేశారు. మీ లవర్ ఎవరు? ఆ విషయం ఎప్పుడు చెబుతారు చెబుతారు? పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు? అనే ప్రశ్నకు ‘త్వరలోనే అన్ని చెబుతా' అని రాజ్ తరుణ్ స్పష్టం చేశారు.