twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఊర్లో ఉంటే నేనూ నా బర్రెలు... కేటీఆర్‌ ఫ్రెండ్ అనుకుంటే నా తప్పే: విజయ్ దేవరకొండ

    |

    పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ త్వరలో 'నోటా' అనే పొలిటికల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అక్టోబర్ 5న సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లలో బిజీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఓ ఛానల్ ఇంటర్వ్యూలో అమ్మాయిల ఫాలోయింగ్, తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో ఉన్న ఫ్రెండ్షిప్ గురించి అడిగిన ప్రశ్నలకు తనదైన రీతిలో రియాక్ట్ అయ్యారు.

    అమ్మాయిలు ఫాలోయింగ్ ఉంటుంది

    అమ్మాయిలు ఫాలోయింగ్ ఉంటుంది

    మీకు చాలా మంది అమ్మాయిల ఫాలోయింగ్ ఉందంటున్నారు. మీపై మనసులు పారేసుకుంటున్న అమ్మాయిలు ఉన్నారా? అనే ప్రశ్నకు విజయ్ దేవరకొండ రియాక్ట్ అవుతూ... ఉండే ఉంటరు. మీరు ఇలా అడిగితే ఏం చెప్పను. ఇట్స్ నైస్. ఇది జీవితంలో అనే కంటే ఈ ప్రొఫెషన్లో ఒక భాగం.... అని విజయ్ చెప్పుకొచ్చారు.

    ఊర్లో ఉంటే నేను నా బర్రెలే...

    ఊర్లో ఉంటే నేను నా బర్రెలే...

    ఇదే నేను ఒక బ్యాంకులో పని చేస్తే అక్కడ ఉన్న ఇద్దరు ముగ్గురు కొలీగ్స్‌కు నేను నచ్చేవాడినేమో? ఇపుడు ఒక యాక్టర్‌గా ఉన్నాను. ఇంత పెద్ద స్క్రీన్ మీద ప్రపంచం మొత్తం చూస్తున్నారు కాబట్టి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. అదే నేను ఊర్లో ఉండి పొలం చూసుకుంటే నేనూ నా బర్రెలు ఇదే ఉండేది. నేను ఒక యాక్టర్ ను, మాట్లాడే ప్రతీది వారికి రీచ్ అవుతుంది. నన్ను రోజూ చూస్తారు కాబట్టి ఇష్టపడి ఉండొచ్చు... అని విజయ్ సమాధానం ఇచ్చారు.

    కేటీఆర్‌తో ఉన్నది ఫ్రెండ్షిప్ అనుకుంటే తప్పే

    కేటీఆర్‌తో ఉన్నది ఫ్రెండ్షిప్ అనుకుంటే తప్పే

    చాలా మంది మీరు మినిస్టర్ కేటీఆర్‌కు చాలా క్లోజ్ అని అంటున్నారు. మీ సినిమాలను ఆయన ఓపెన్‌గా అప్రిషియేట్ చేస్తున్నారు. ఏమిటి విషయం? అనే ప్రశ్నకు విజయ్ రియాక్ట్ అవుతూ... నాకు రామ్ అన్న(కేటీఆర్)తో ఉన్నది ఫ్రెండ్షిప్ అని అనుకోవద్దు. ఆయనంటే నాకు రెస్పెక్ట్ ఉంది. ఒక హానరబుల్ మినిస్టర్. ఒక లీడర్. ఆయన వైపు నుండి నన్ను నటుడిగా ఆరాధిస్తారు. నేను చేసేవి ఆయనకు ఇష్టముండి, నాకు ఆయన ఒక లీడర్‌గా ఇష్టం ఉండి దాని వల్ల వచ్చిన ఒక రిలేషన్. దాన్ని ప్రెండ్షిప్ అని నేను అనుకోవడం తప్పు.

    మన స్టేట్ నుండి ఒకడొచ్చాడనే అభిమానం

    మన స్టేట్ నుండి ఒకడొచ్చాడనే అభిమానం

    నేను ఆయన్ను ఎప్పుడూ ఏదీ అడగను. ఏ విషయాలు మాట్లాడను. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ స్టేట్‌కు ఇచ్చేద్దాం అనుకున్నపుడు ఆయనకు నచ్చి... మన స్టేట్ నుండి వచ్చినవాడు ఏదో ఒకటి చేస్తున్నాడు మనకి అనుకున్నారు. ఒక సిటిజెన్‌గా మనమందరం ఇది చేయడం లేదు, అది చేయడం లేదు అని కంప్లయింట్ చేస్తుంటాం. మన వైపు నుండి మాత్రం ఏమీ చేయం. నేను నా వైపు నుండి చేస్తుండటంతో ఆయనకు నచ్చి ఎంకరేజ్ చేశారు... అని విజయ్ చెప్పుకొచ్చారు.

    అందుకే కేటీఆర్ అంటే ఇష్టం

    అందుకే కేటీఆర్ అంటే ఇష్టం

    సాధారణంగా పొలిటీషియన్స్ కెమెరాలు ఉంటేనే మనం చెట్లు నాటుదాం అని ఒక ఫోటో దిగి తర్వాత దాని గురించి మరిచిపోయి వారి పని చూసుకుంటారు. కానీ కేటీఆర్ అలా కాదు. మా ఇంట్లో నేను ఆయన ఉన్నపుడు ఏ కెమెరా లేదు. ప్రైవేట్ కాన్వర్జేషన్లో కూడా మన సిటీని గ్రీన్ సిటీ మార్చాలని అంటుంటారు. ఎక్కడకు వెళ్లినా వీవర్స్ గురించి మాట్లాడుతుంటారు. హాండ్లూమ్స్ వేసుకోవాలని చెబుతారు, విజయ్ నువ్వు కూడా వేసుకోవాలి, నిన్ను ఇంత మంది ఫాలో అవుతున్నారు... ప్రతి బుధవారం చేనేత వస్త్రాలు వేసుకో అని చెప్పారు. ఆయన కూడా వారంలో ఒక రోజు వేసుకుంటారంట. తన చుట్టూ కెమెరాలు లేకున్నా ఫ్యూచర్ గురించి చాలా విశాలంగా ఆలోచనలు చేస్తారు. అందుకనే ఆయనంటే ఇష్టం.... అని విజయ్ దేవరకొండ చెప్పారు.

    English summary
    Vijay Devarakonda interesting comments on Telangana minister KTR. "I'm a fan of him, Because he is a great leader." Vijay said in NOTA movie pramotions. NOTA is an upcoming Indian political thriller film directed by Anand Shankar, made in both Tamil and Telugu languages. It stars Vijay Deverakonda debuting in Tamil cinema and Mehreen Pirzada, in the lead roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X