»   » ఒక్కోసారి కోపం, ఏడుపొస్తుంది: ‘గీత గోవిందం’ లీకులపై విజయ్ దేవరకొండ

ఒక్కోసారి కోపం, ఏడుపొస్తుంది: ‘గీత గోవిందం’ లీకులపై విజయ్ దేవరకొండ

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  'గీత గోవిందం' సినిమా విడుదల ముందే కొన్ని సీన్లు బయటకు లీక్ అవ్వడంపై ఈ చిత్రంలో హీరోగా నటించిన విజయ్ దేవరకొండ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో తన మనసులోని ఆవేదనను వెల్లగక్కారు. సినిమా పేరును, పైరసీ విషయాన్ని ప్రస్తావించకుండా ఆయన చేసిన వ్యాఖ్యలు తన సినిమా సీన్ల లీక్ గురించే అని స్పష్టమవుతోంది.

  'చాలా భాధేసింది, అసంతృప్తికి గురయ్యాను. ఒక్కోసారి కోపం వస్తుంది, ఇంకోసారి ఏడుపొస్తుంది' అని ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్ ద్వారా విజయ్ దేవరకొండ 'సీన్ల లీక్' ఇష్యూపై ఎంత కోపంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

  విజయ్ దేవరకొండ ట్వీట్

  ఒక సినిమా మన ముందుకు రావడానికి వందల మంది కష్టం, కోట్ల రూపాయల ఖర్చు, కొన్ని నెలల శ్రమ దాగి ఉంటుంది. అంత కష్టపడి తీసిన సినిమాను అక్రమంగా దొంగిలించి లీక్ చేస్తే.... ఇన్నాళ్లు కష్టపడ్డవారు ఎలా రియాక్ట్ అవుతారో విజయ్ ట్వీట్ ద్వారా అర్థం చేసుకోవచ్చు.

  ఇండస్ట్రీలో అలర్ట్

  ఇండస్ట్రీలో అలర్ట్

  ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. సినిమా ఎడిటింగ్ రూమ్ నుండే సీన్లు లీక్ కావడంతో ఇండస్ట్రీలో సైతం ఈ విషయం హాట్ టాపిక్ అయింది. ఇతర సినిమాల ఎడిటింగ్ టీమ్‌లను సైతం అలర్ట్ చేశారు.

   చాలా కాలం తర్వాత మళ్లీ...

  చాలా కాలం తర్వాత మళ్లీ...

  గతంలో ‘అత్తారింటికి దారేది' సినిమా విషయంలో ఇలాంటి లీకులే జరిగాయి. చాలా కాలం తర్వాత ఎడిటింగ్ రూమ్ నుండి ఇలాంటి వ్యవహారం వెలుగు చూడటంతో ఇతర ప్రొడక్షన్ సంస్థలు కూడా ఈ విషయంలో మళ్లీ సీరియస్‌గా ఫోకస్ పెట్టాయి.

   ఆగస్టు 15న విడుదల

  ఆగస్టు 15న విడుదల

  అయితే కొన్ని సీన్లు మాత్రమే లీక్ కావడంతో... ఈ ప్రభావం సినిమాపై ఉండక పోవచ్చని అంటున్నారు. ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం " గీత గోవిందం". బ‌న్నీవాసు నిర్మాణంలో ప్రముఖ నిర్మాత శ్రీ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చర్స్ బ్యాన‌ర్‌లో ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపి సుంద‌ర్ సంగీతం. ఆగస్టు 15న సినిమా విడుదల కానుంది.

  English summary
  "I feel let down, disappointed, hurt. Okka sari kopam osthundi, inko sari edupostundi." vijay devarakonda tweet on Geeta Govindam Leak. Geetha Govindam starring Vijay Devarkonda and Rashmika Mandanna, is slated to on 15th August, got a shocker as scenes of the movie are circulating in social media.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more