Just In
Don't Miss!
- News
ప్రముఖ రచయిత వేల్చేరు నారాయణరావుకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం...
- Finance
ఏడాదిన్నరలో రూపాయి దారుణ పతనం, ఏకంగా 104 పైసలు డౌన్
- Sports
'వాళ్లను మాత్రం ఎవరూ అడగరు.. స్పిన్నర్ల విషయంలోనే ప్రశ్నిస్తారు! ఇదెక్కడి న్యాయం'
- Automobiles
సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
- Lifestyle
అందమైన మెరిసే జుట్టు పొందాలనుకుంటున్నారా? కాబట్టి ఈ ఆహారాలలో కొంచెం ఎక్కువ తినండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వివాదాస్పద చిత్రంలో విజయ్ దేవరకొండ.. అందాల నటుడి పాత్రలో క్రేజీ హీరో
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ.. ఈ పేరు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ సంచలనం. 'పెళ్లి చూపులు' అనే సినిమాలో డీసెంట్‌గా కనిపించిన ఈ యంగ్ హీరో.. 'అర్జున్ రెడ్డి'లో మాత్రం ఎంతో వైలెంట్‌గా దర్శనమిచ్చాడు. టాలీవుడ్‌లో ఈ సినిమా అప్పటి వరకు ఉన్న కొన్ని సంప్రదాయాలను మార్చేసింది. అంతేకాదు, మన ఫిల్మ్ మేకర్స్ పెట్టుకున్న సరిహద్దులను చెరిపివేసింది. దీంతో విజయ్ దేవరకొండ కూడా ఎంతో పాపులర్ అయిపోయాడు. అప్పటి నుంచి అతడికి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఈ సినిమా తర్వాత అతడు దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. అదే అతడి మార్కెట్‌ను కూడా పెంచేసింది. తాజాగా అతడికి ఓ అదిరిపోయే ఆఫర్ దక్కింది. ఇంతకీ ఎందులో ఆఫర్ వచ్చింది.? వివరాల్లోకి వెళితే..

ప్రపంచం మొత్తం చెప్పుకునే లవర్‌గా..
విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్'. క్రాంతి మాధవ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజబెల్లె లైట్ హీరోయిన్స్. క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను కేఎస్ రామారావు సమర్పిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ లవర్ బాయ్‌లా కనిపించనున్నాడు.

పూరీతో అన్నారు కానీ క్లారిటీ లేదు
ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే విజయ్ దేవరకొండ మరో సినిమాను ప్రకటించాడు. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు ఆ మధ్య వెల్లడించాడు. ఇందులో అతడు ఫైటర్‌గా కనిపించబోతున్నాడట. దీన్ని పూరీ స్వయంగా నిర్మిస్తాడని చెప్పారు. అయితే, ఇది ఎప్పటి నుంచి పట్టాలెక్కుతుందో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

ముంబైలోనే ఎక్కువగా కనిపిస్తున్నాడు
విజయ్ దేవరకొండ ఇటీవల తరచూ ముంబై వెళ్తున్నాడు. అక్కడ బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లతో కలిసి పార్టీలు చేసుకుంటున్నాడు. టాలీవుడ్‌కు చెందిన యంగ్ హీరో ఇలా తరచూ ముంబైలో కనిపిస్తుండడం ఇక్కడ చర్చనీయాంశం అవుతోంది. దీనికితోడు అక్కడి హీరోలు, హీరోయిన్లు విజయ్ గురించి చేసే కామెంట్లతో అతడు హాట్ టాపిక్ అవుతున్నాడు.

వివాదాస్పద చిత్రంలో శోభన్ బాబు పాత్ర
విజయ్ దేవరకొండ గురించి తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘తలైవి' మూవీలో అతడు నటిస్తున్నాడట. అది కూడా సీనియర్ హీరో శోభన్ బాబు పాత్రలో అని ప్రచారం జరుగుతోంది. జయలలిత.. శోభన్ బాబు ఎన్నో సినిమాల్లో నటించారు. ఒకానొక సందర్భంలో వీళ్లిద్దరికీ పెళ్లైందని కూడా అన్నారు.

ఈ సినిమా గురించి వివరాలు
ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ జయలలితగా తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి'. ఈ సినిమాకు బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథా కథనాలు అందిస్తున్నాడు. ఇందులో ఎంజీఆర్‌గా అరవింద స్వామి, కరుణానిథి పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.