twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మనుషులుగా ప్రవర్తించని వారికి.. మానవ హక్కులా? వదలొద్దు.. విజయ్ దేవరకొండ ఫైర్

    |

    మహిళలపై జరుగుతున్న ఘోరాలు, నేరాలు, దాడులపై టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఆందోళన వ్యక్తం చేశాడు. యువకులు, అబ్బాయిలు మహిళల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ట్విట్టర్‌లో స్పందించారు. ఏదైనా చెడు జరిగితే బాధితులకు అండగా నిలబడాలని అభిమానులకు, నెటిజన్లకు విజయ్ దేవరకొండ సూచించారు. ఇంకా తాను చేసి ట్వీట్‌లో..

     శంషాబాద్, తమిళనాడు ఘటనపై

    శంషాబాద్, తమిళనాడు ఘటనపై

    హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో దిశ ఘటన, తమిళనాడులో దళిత మైనారిటీ బాలికపై జరిగిన అత్యాచారం, హత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. వెటర్నరీ డాక్టర్‌పై లైంగిక దాడి, హత్య ఉదంతం పార్లమెంట్‌ను కూడా కదిపింది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ కూడా స్పందించారు.

    ఆపదలో ఉన్నారని తెలిస్తే

    ఆపదలో ఉన్నారని తెలిస్తే

    శంషాబాద్‌లో జరిగిన దిశ ఘటనపై స్పందిస్తూ.. మన స్నేహితుడు గానీ, కుటుంబ సభ్యులు గానీ ఆపదలో ఉన్నారని తెలిస్తే ఫోన్‌తో టచ్‌లో ఉండాలి. మనుషులుగా ప్రవర్తించని వారికి మానవ హక్కుల ఉండకూడదు. వారెవరైనా సరే అలాంటి నీచానికి పాల్పడితే కఠినంగా శిక్షించాలి. మరో వ్యక్తి ఇలాంటి ఘోరానికి పాల్పడకుండా దోషులకు శిక్ష విధించాలి అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.

     ఎవరైనా తప్పు చేస్తే..

    ఎవరైనా తప్పు చేస్తే..

    మన చుట్టు ఉన్నవాళ్లెవరైనా తప్పుగా ఆలోచించినా.. వ్యవహరించినా వారిని సరిదిద్దాలి. వారి ప్రవర్తనను మార్చుకొనేలా చేయాలి. ఎదుటి వ్యక్తి బాధిస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో వారికి అర్ధమయ్యేలా చెప్పాలి. ప్రతీ పురుషుడు, యువకుడు బాధ్యతగా మెదగాలి అని విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్టులో వెల్లడించారు.

    Recommended Video

    #CineBox : Jabardasth Effect On Nandamuri Balakrishna New Movie
    నా చిత్రాల్లో మహిళలపై హింసకు తావు ఉండదు.

    నా చిత్రాల్లో మహిళలపై హింసకు తావు ఉండదు.


    ఇటీవల ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఓ ప్యానల్ డిస్కషన్‌లో పాల్గొన్న విజయ్ దేవరకొండ.. తన చిత్రాల్లో హింస, నేరాలకు తావు ఉండదనే విషయాన్ని స్పష్టం చేశారు. అర్జున్ రెడ్డి చిత్రంలో కూడా మహిళలపై ఎలాంటి హింస ఉండదనే విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. మహిళలంటే తనకు చాలా గౌరవం అని విజయ్ దేవరకొండ స్పష్టం చేశారు.

    English summary
    Tollywood actor Vijay Deverakonda reacted on Disha incident. He tweeted that “I have had to stay on the phone while a member of the family or friend felt unsafe. How many of us have had to... it’s one of the scariest things to have to do. We all need to take responsibility of the boys/men in our homes, our friends and in our surroundings.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X