అమీర్ ఖాన్‌కు హ్యాండిచ్చి.. షారుక్‌తో విజయ్ సేతుపతి బాలీవుడ్ ఎంట్రీ
విలక్షణ నటుడు విజయ్ సేతుపతి మరోసారి బాలీవుడ్ ఎంట్రీకి ప్రయత్నిస్తున్నారు. గతంలో అమీర్ ఖాన్ రూపొందించిన లాల్ సింగ్ చద్దా సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేశారు. అయితే కరోనావైరస్ కారణంగా, తన సినిమాలు వాయిదా పడటం, తిరిగి ప్రారంభం కావడంతో డేట్స్ అడ్జస్ట్ చేసుకోలేక ఆ ప్రాజెక్టు నుంచి ఒప్పుకోవడంతో బాలీవుడ్ ఎంట్రీ తృటిలో తప్పిపోయింది. అయితే మరోసారి బాలీవుడ్ అవకాశం తలుపుతట్టింది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ నటిస్తున్న జవాన్ చిత్రంలో విలన్‌గా నటించే అవకాశం లభించింది. ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
అయితే ఉప్పెన, మాస్టర్ సినిమాల తర్వాత విజయ్ సేతుపతి క్రేజ్ ప్యాన్ ఇండియా స్థాయికి వెళ్లింది. సంచలన విజయం సాధించిన పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న పుష్ప: ది రూల్ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారనే వార్త వైరల్ అయింది. ఈ వార్త వేడి ఇంకా సద్దుమణగుకుండానే మరోసారి విజయ్ సేతుపతి జాతీయ మీడియాలో స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యారు.
అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న జవాన్ సినిమాలోని ఓ కీలక పాత్రలో నటించడానికి సిద్దం అవుతున్నారనే విసయం మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. షారుక్ సినిమాలో విలన్‌గా నటించేందుకు రెడీ అవుతున్నారు. ఆయన ఈ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ముంబైలో జరిగే షూటింగుకు విజయ్ సేతుపతి హాజరుకానున్నారు. త్వరలోనే మూవీ యూనిట్ అధికారిక ప్రకటన కూడా చేయనున్నది అని కథనంలో పేర్కొన్నారు.
జవాన్ చిత్రం హిందీ, తమిళ్, హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో రూపొందుతుంది. ఈ చిత్రంలో షారుక్ ఖాన్, నయనతార, సన్యా మల్హోత్రా, విజయ్ సేతుపతి, ప్రియమణి, యోగిబాబు, సిమర్జిత్ సింగ్, సునీల్ గ్రోవర్, మన్‌హర్ కుమార్ కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమాకు జీకే విష్ణు సినిమాటోగ్రాఫర్‌గా, అనిరుధ్ రవిచందర్ సంగీతం, శుక్రాచార్య ఘోష్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఇక విజయ్ సేతుపతి విషయానికి వస్తే.. ఇటీవల కమల్ హాసన్‌తో కలిసి ఆయన నటించిన విక్రమ్ చిత్రం భారీ విజయాన్ని అందుకొన్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











