Ginna వివాదాస్పద ప్రశ్నలకు ఘాటైన జవాబు.. విష్ణు మంచు ప్రీ లుక్ వైరల్

జిన్నా అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో విష్ణు మంచు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. విలక్షణమైన, విభిన్నమైన కంటెంట్‌తో మంచు వారసుడిని డైనమిక్ డైరెక్టర్ ఇషాన్ సూర్య సరికొత్తగా చూపించడానికి సిద్దమవుతున్నారు. జిన్నా టైటిల్ ప్రకటించగానే వివాదాస్పదంగా మారినప్పటికీ.. అదే టైటిల్‌తో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి మంచు అభిమానుల్లో ఆనందాన్ని పెంచారు. జిన్నా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను జూలై 11వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. ప్రీ లుక్ పోస్టర్‌ అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చేలా కనిపించడం ఫీల్ గుడ్ ఫ్యాక్టర్‌గా మారింది.

ఇక జిన్నా చిత్రంలో సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటించారు. కోన వెంకట్ ఈ సినిమాకు కథను, స్క్రీన్ ప్లేను అందించారు. గతంలో ఢీ, దేనికైనా రెఢీ చిత్రాలకు కోన వెంకట్ స్క్రీప్టును అందించిన సంగతి తెలిసిందే. ఈ క చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం, చోటా కే నాయుడు సినిమాటోగ్రఫిని అందించారు. జిన్నా చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ అందిస్తున్నాయి.

Vishnu Manchu Ginnas Ginna Pre look goes viral

టాలీవుడ్‌లో అభిరుచి ఉన్న నటుడిగా, నిర్మాతగా ఎన్నో విభిన్నమైన చిత్రాలను అందించిన విష్ణు మంచు తండ్రి మోహన్ బాబు వారసత్వాన్ని పుచ్చుకొని ఇప్పుడు సొంత బ్యానర్‌తో విలక్షణమైన చిత్రాలను అందించేందుకు, యువతరాన్ని ప్రోత్సాహించేందుకు AVA ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌తో ముందుకు వస్తున్నాడు. AVA బ్యానర్ ద్వారా సినిమాలే కాకుండా, డిజిటల్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, డాక్యుమెంటరీ సిరీస్ నిర్మించేందుకు సిద్దమయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X