twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా ఇష్టం.. నా డాష్.. ఎదవలని లైట్ తీస్కోండి.. నన్ను ఫోర్స్ చేసే మగాడు ఎవరు: మంచు మనోజ్

    |

    సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మంచు మనోజ్ కేవలం సినిమాల గురించే కాదు... సమాజంలో జరిగే విషయాలపై, ప్రజలకు సంబంధించిన అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కియా మోటార్స్ అనే కార్ల తయారీ సంస్థ ఏర్పాటు కావడంపై స్పందించారు.

    కియా మోటార్స్ సంస్థ ఏర్పాటు వల్ల అనంతపురం ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, మన రాష్ట్రంలో కియా మోటార్స్ మొదటి కారు తయారైన విషయం తెలిసి గర్వంగా ఫీలైనట్లు తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వంపై ప్రశంసలు గుప్పించారు. రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడుస్తుందంటూ వ్యాఖ్యానించారు. అయితే కొంతసేపటి తర్వాత మనోజ్ ట్వీట్ డిలీట్ కావడంతో పెద్ద రచ్చ మొదలైంది.

    మంచు మనోజ్ మీద ఎవరైనా ఒత్తిడి తెచ్చారా? అంటూ...

    మంచు మనోజ్ మీద ఎవరైనా ఒత్తిడి తెచ్చారా? అంటూ...

    అయితే మంచు మనోజ్ కొద్ది సేపటి తర్వాత ఈ ట్వీట్ డిలీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ డిలీట్ చేయడంతో పలువురు ఫ్యాన్స్ ఆయన్ను ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఈ ట్వీట్ డిలీట్ చేయాలని మిమ్మల్ని ఎవరు ఒత్తిడి చేశారు? అంటూ ప్రశించారు.

    నన్ను ఫోర్స్ చేసే మగాడు ఎవరు? డాష్ పగిలిపోద్ది

    నన్ను ఫోర్స్ చేసే మగాడు ఎవరు? డాష్ పగిలిపోద్ది

    దీనికి మనోజ్ రిప్లై ఇస్తూ.. ఈ ట్వీట్ డిలీటైన విషయం ఇప్పుడే చూశాను. ఎలా అయిందో తెలియదు. అయినా నన్ను ఫోర్స్ చేసే మగాడు ఎవరు బ్రదర్? డాష్ పగిలిపోద్ది అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ రిప్లై ఇచ్చిన ట్వీట్ కూడా మనోజ్ డిలీట్ చేశారు.

    నా ప్రెండ్స్ బూతులు వాడొద్దు అన్నారు అందుకే...

    నా ప్రెండ్స్ బూతులు వాడొద్దు అన్నారు అందుకే...

    దీన్ని కూడా ఎందుకు డిలీట్ చేశారు? అని మరో వ్యక్తి దాని స్క్రీన్ షాట్ షేర్ చేస్తూ మనోజ్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ... నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి బూతులు వాడకు అన్నారు. అందుకే దాన్ని ఫ్రెండ్షిప్ కోటాలో డిలీట్ చేశానని చెప్పుకొచ్చారు.

    నా ఇస్టం.. నా డాష్.. ఎదవలని లైట్ తీస్కోండి

    నా ఇస్టం.. నా డాష్.. ఎదవలని లైట్ తీస్కోండి

    అయితే తను ట్వీట్ డిలీట్ చేయడంపై చాలా మంది ప్రశ్నిస్తుండం, కొందరు తనకు డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయనే విధంగా విమర్శలు చేస్తుండటంతో మనోజ్ సీరియస్ అయ్యారు. నేను ట్వీట్ కావాలని డిలీట్ చేశాను అని భావించే వారికి నా సమాధానం... ‘నా ఇష్టం', నేను ఎవరి వల్లనో ఇన్‌ఫ్లూయెన్స్ అయి ట్వీట్ డిలీట్ చేశానని భావించిన వారికి నా సమాధానం.. ‘నా డాష్' (ఎవడీకి అంత బొమ్మ లేదు), నేను చెప్పింది నిజం అని నమ్మే వారికి నా సమాధానం.. ‘ఎదవలని లైట్ తీస్కోండి' ఎందుకంటే వారు మన భారతీయులే అని చెప్పుకొచ్చారు.

    జోక్స్ వేయడంపై మనోజ్ ఆగ్రహం

    జోక్స్ వేయడంపై మనోజ్ ఆగ్రహం

    ఈ విషయంలో తనమీద జోక్స్ వేస్తున్న వారిపై మంచు మనోజ్ సీరియస్ అయ్యారు. జోక్స్ బావుంటే నవ్వుకో... లేకుంటే తప్పుకో అంటూ కాస్త ఘాటుగానే రిప్లై ఇచ్చారు.

    ఎందుకు గ్యాప్ ఇచ్చారు

    ఎందుకు గ్యాప్ ఇచ్చారు

    మంచు మనోజ్ సినిమాలకు గ్యాప్ ఇవ్వడంపై కూడా కొందరు అభిమానులు ప్రశ్నించారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నామంటూ చెప్పుకొచ్చారు. వారందరికీ త్వరలోనే అన్ని విషయాలు చెబుతానని మనోజ్ వెల్లడించారు.

    English summary
    "Well for everyone who thought I deleted the tweet, ‘Na istam’ ..... for everyone who thought I got influenced to delete the tweet, ‘Na dash’ ( yevadiki antha bomma ledhu ) .... for everyone who thought I was true, ‘yedhavalani lite theesukondi’ papam vallu mana bharathiyuleee :)" Manchu Manoj tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X