అనుష్క శెట్టి రెమ్యునరేషన్.. ఘాటి చిత్రానికి ఎన్ని కోట్లు తీసుకుందో తెలుసా?
స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రస్తుతం తన తాజా చిత్రం ఘాటితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్విటీ కొన్నాళ్లుగా పెద్దగా సినిమాలు చేయడం లేదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో వచ్చిన భారీ చిత్రంలో నటించిన అనుష్క శెట్టి పాన్ ఇండియా హీరోయిన్ గా క్రేజ్ దక్కించుకుంది. ఆ తర్వాత నుంచి వరుసగా సినిమాలు చేస్తుందని అనుకుంటే అందుకు భిన్నంగా అనుష్క శెట్టి అసలు సినిమాలే చేయడం లేదు. ఏదో నామ మాత్రంగా సినిమాలకు సైన్ చేస్తోంది. బాహుబలి 2 విడుదలైనప్పటి నుంచి కేవలం 3 చిత్రాలతోనే అలరించింది. భాగమతి, నిశ్శబ్దం, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రాలతో మాత్రమే అలరించింది. ఇక 2 ఏళ్లకు తిరిగి వెండితెరపై మెరిసింది.
అనుష్క శెట్టి తన కెరీర్ ప్రారంభం నుంచే ఫీమేల్ సెంట్రిక్ పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అరుంధతి, భాగమతి అనే చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక అరుంధతితో అనుష్క శెట్టి ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇక బాహుబలితో పాన్ ఇండియా నటిగా మారిపోయింది. దీంతో అనుష్క శెట్టి ఇండియాలో టాప్ హీరోయిన్ గా మారిపోయింది. కాగా తాజాగా యాక్షన్ క్రైమ్ డ్రామా ఘాటి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఫీమేల్ సెంట్రిక్ గా ఉండటం విశేషం. కాగా సెప్టెంబర్ 5న ఘాటి చిత్రం వరల్డ్ వైడ్ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.

తెలుగు భాషలో రూపుదిద్దుకున్న ఘాటి చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గా విడుదలైంది. అయితే ఈ చిత్రానికి అనుష్క శెట్టి ఎన్ని కోట్ల పారితోషికం తీసుకుందనేది ఆసక్తికరంగా మారింది. అనుష్క శెట్టి కేవలం రూ.6 కోట్ల పారితోషికం అందుకున్నారని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి బాహుబలి చిత్రం తర్వాత అనుష్క శెట్టికి వచ్చిన క్రేజ్ కు ఒక్క సినిమాకు రూ.10 నుంచి రూ.20 కోట్ల మధ్య పారితోషికం అందుకునే రేంజ్ ఏర్పడింది.
కానీ స్వీటీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయకపోవడంతో ఇక తన రెమ్యునరేషన్ కూడా పడిపోతూ వచ్చింది. మరోవైపు బహుబలి చిత్రం తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన పలు చిత్రాలు కూడా ఆశించిన మేర ఫలితాన్ని ఇవ్వకపోవడంతో స్వీటీ రెమ్యునరేషన్ పెద్దగా పెరగలేదు. దాంతో కేవలం ఆరు కోట్ల రూపాయలు మాత్రం ఘాటి సినిమాకు ఛార్జ్ చేశారంట అనుష్క శెట్టి. ఇక అనుష్క శెట్టి ఘాటి చిత్రం ప్రమోషన్స్ లోనూ కనిపించకపోవడం గమనార్హం.
మరోవైపు ఘాటి చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లో నిర్మాతలు యేడుగురు రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లముడి కలిసి నిర్మించారు. ఈ చిత్రంలో కాస్తా టాప్ స్టార్స్ ను తీసుకోవడం, టాప్ టెక్నీషియన్లతో పనిచేయించడంతో భారీగానే ఖర్చైందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు రూ.100 కోట్ల వరకు ఖర్చైందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై స్పష్టత లేదు.


Click it and Unblock the Notifications











