For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Hansika Motwani Marriage: కాబోయే భర్తను రొమాంటిక్ గా చూపించిన హన్సిక.. ఫొటోస్ వైరల్

  |

  చైల్డ్ ఆర్టిస్ట్ గానే సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టిన హన్సిక మోత్వాని ఆ తర్వాత 16 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా మరో సరికొత్త కెరీర్ ను స్టార్ట్ చేసింది. ఇక తర్వాత ఈ బ్యూటీ టాలీవుడ్ బాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో కూడా హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇక ఇప్పుడు ఆమె తన జీవితంలో మధురమైన ఘట్టాన్ని చూడబోతోంది. ఎప్పటినుంచో ఆమె పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మొత్తానికి ఆ విషయంపై అమ్మడు క్లారిటీ ఇచ్చింది. కాబోయే వరుడుకి సంబంధించిన ఫోటోలను కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

  అప్పట్లోనే పెళ్లి వార్తలు

  అప్పట్లోనే పెళ్లి వార్తలు

  కొన్నేళ్ళ క్రితం హన్సిక హీరోయిన్ గా బిజీగా ఉన్న సమయంలోనే పెళ్లికి సంబంధించిన వార్తలు చాలానే వచ్చాయి. గతంలోనే ఆమె ఒక తమిళ హీరోతో ప్రేమలో ఉంది అని అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. దాదాపు నిశ్చితార్థం కూడా అయిపోయింది అని ఇక పెళ్లి చేసుకోవడమే తర్వాత ఎపిసోడ్ అని కూడా అనుకున్నారు. కానీ ఆ తరువాత బ్రేకప్ అయినట్లు కూడా టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు ఊహించిన విధంగా ఆమె ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.

   అతను ఎవరంటే?

  అతను ఎవరంటే?

  ఇటీవల హన్సిక చెప్పే వరకు కూడా ఆమె పెళ్లిపై ఒక క్లారిటీ అయితే రాలేదు. డిసెంబర్లో తాను పెళ్లి చేసుకోబోతున్నాను అని హన్సిక ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఎప్పటినుంచో తనతో సన్నిహితంగా ఉన్న క్లోజ్ ఫ్రెండ్ సోహైల్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా ఆమె వివరణ ఇచ్చింది. అతను తన చిన్ననాటి స్నేహితుడు అని అలాగే బిజినెస్ పాట్నార్ కూడా అని ఆమె తెలుపడంతో ఆ విషయం ఒక్కసారిగా వైరల్ అయిపోయింది.

   ఫొటోలు రిలీజ్

  ఫొటోలు రిలీజ్

  ఇక హన్సిక భర్తకు సంబంధించిన ఫోటోలు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్న సమయంలో ఆమె చాలా గ్రాండ్ గా తనకు కాబోయే భర్తను ఫ్యాన్స్ కు చూపించేసింది. అది కూడా ప్యారిస్ లోనే ఈఫిల్ టవర్ దగ్గర దిగిన ఫోటోలను షేర్ చేసుకుంది. అంతేకాకుండా ఆ ఫోటోలకు ఆమె అందమైన క్యాప్షన్ కూడా ఇచ్చింది.

   రొమాంటిక్ క్యాప్షన్

  రొమాంటిక్ క్యాప్షన్

  ఎప్పుడైనా ఎంతకాలమైనా సరే నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అంటూ హన్సిక ఆ ఫోటోలకు రొమాంటిక్ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఆమెకు కాబోయే భర్త నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ స్టైల్ గా మోకాళ్ళ మీద నిల్చుని అడగడంతో ఆమె వెంటనే ఒప్పుకున్నట్లు ఉన్న ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇక వీరిద్దరూ కౌగిలించుకున్న స్టిల్ కూడా హైలెట్ అవుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో హన్సిక పేరు కూడా ట్రెండింగ్ లిస్టులోకి వెళ్లిపోయింది.

  పెళ్లి ఎప్పుడంటే?

  పెళ్లి ఎప్పుడంటే?

  ఇక హన్సిక మ్యారేజ్ ఎప్పుడు జరగబోతోంది అనే విషయంలో కూడా ఒక టాక్ అయితే గట్టిగా వినిపిస్తోంది. రాజస్థాన్ జైపూర్ లోని ఒక ప్యాలెస్ లో వీరి వివాహం జరగబోతున్నట్లు టాక్. ఇరు కుటుంబాల సభ్యులు ఇప్పటికే ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. డిసెంబర్ 4న అతి కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో సాంప్రదాయాల ప్రకారం పెళ్లి జరగబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే కొంతమంది సినీ ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం ఉందట.

  English summary
  Actress Hansika Motwani and Sohail Kathuria wedding official announcement
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X