‘ప్రేమించా.. అనుభవిస్తున్నా.. అతని చేతుల్లో శరీరం, మనసు నలిగిపోతున్నాయ్’
సినీరంగంలో ప్రేమలు, ఎఫైర్స్, పెళ్లిళ్లు చాలా కామన్.. కొందరు తమ ప్రేమికులను పెళ్లాడి హ్యాపీగా లైఫ్‌లో సెటిలైతే మరికొందరు మాత్రం బట్టలు మార్చినంత ఈజీగా ప్రేమికులను మార్చేస్తున్నారు. ఇక మరికొందరైతే ప్రేమికుల చేతుల్లో టార్చర్ అనుభవిస్తూ, బాధను పంటి బిగువున భరిస్తూ జీవితాన్ని నెట్టికొస్తున్నారు. టాలీవుడ్ టూ బాలీవుడ్ ఇలాంటి వారెందరో. తాజాగా ఓ హీరోయిన్ ప్రియుడి చేతుల్లో అనుభవిస్తున్న నరకాన్ని బయటపెట్టింది.
మోడలింగ్ టూ హీరోయిన్
ఆ హీరోయిన్ ఎవరో కాదు నైనా గంగూలీ. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన ఈ ముద్దుగుమ్మ.. చదువు పూర్తి చేసిన తర్వాత తన మకాం ముంబైకి మార్చింది. అక్కడ మోడలింగ్‌లోకి దిగిన ఈ ముద్దుగుమ్మ.. పలు టాప్ బ్రాండ్స్‌కు చెందిన వాణిజ్య ప్రకటనల్లో నటించింది. ఈ క్రమంలో సినిమాలలోనూ అవకాశాల కోసం నైనా గంగూలీ ప్రయత్నించారు. తొలుత మేరీ బేటీ సన్నీలియోనీ బన్ నా చాహ్‌తీహై అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించారు. అయితే ఇది విడుదల కావడానికి ఎన్నో అవాంతరాలను ఎదురయ్యాయి.

వంగవీటితో టాలీవుడ్‌లో ఎంట్రీ
80వ దశకంలో విజయవాడలో రక్తపుటేరులు పారించిన వంగవీటి మోహనరంగా- దేవినేని నెహ్రూ వర్గాల గ్యాంగ్‌వార్ నేపథ్యంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వంగవీటి చిత్రంతో తెలుగువారిని పలకరించారు నైనా గంగూలీ. ఈ చిత్రంలో రంగా సతీమణి వంగవీటి రత్నకుమారి పాత్రలో ఆమె నటించారు. తొలి సినిమాతోనే లుక్స్, నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నైనా. ఆ తర్వాత జోహార్, మళ్లీ మొదలైంది, డేంజరస్, తగ్గేదేలే తదితర తెలుగు చిత్రాల్లో నటించినా ఆమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. 2024లో ప్రణయం అనే కన్నడ చిత్రం తర్వాత నైనా గంగూలీ మరే చిత్రంలోనూ నటించలేదు. సినిమాలలో అంతగా అవకాశాలు రాకపోవడంతో ఓటీటీలలో పలు వెబ్ సిరీస్‌లలో నటించారు నైనా గంగూలీ. ఆ తర్వాత ఇక్కడా ఆమెకు అవకాశాలు మూసుకుపోయాయి. ప్రస్తుతం నైనా గంగూలీ ఖాళీగానే ఉన్నారు.
అదే మహిళా సాధికారత
ఏ విషయంపై అయినా మనసులో ఉన్నది ఉన్నట్లు కుండబద్ధలు కొడతారు నైనా గంగూలీ. ఏ అమ్మాయికీ షరతులు పెట్టే తల్లిదండ్రులు ఉండకూడదని, తను ఎంచుకున్న రంగంలో రాణించానికి ఆడపిల్ల ఎవరి అనుమతి తీసుకోకపోవడమే నిజమైన మహిళా సాధికారత అని నైనా గంగూలీ పలుమార్లు చెప్పారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తన సినిమాలు, వ్యక్తిగత విషయాలు, ఇతర సంగతులపై తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా నైనా గంగూలీ తన ప్రేమ జీవితానికి సంబంధించి పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
తగిన శాస్తే జరిగింది
గత కొన్నేళ్లుగా తాను ఎక్కడా ఏ ప్రాజెక్ట్‌లోనూ భాగం కాదు.. అది ఎందుకో చెప్పే సమయం వచ్చింది. కోల్‌కతాకు చెందిన కొరియోగ్రాఫర్‌తో నేను కొన్నాళ్లుగా రిలేషన్‌లో ఉన్నాను.. అయితే ప్రేమిస్తున్నందుకు నాకు తగిన గుణపాఠమే జరిగింది. తొలుత మా ఇద్దరి మధ్య రిలేషన్ బాగానే ఉండేది, కానీ ఇటీవల అతని నిజస్వరూపం బయటపడింది. నా ప్రియుడి చేతుల్లో రోజూ శారీరకంగా, మానసికంగా టార్చర్ అనుభవిస్తున్నా. దీనికి తోడు ఆర్ధిక ఇబ్బందులు కూడా వెంటాడుతున్నాయి, నా ప్రియుడు ఎవరు అనేది త్వరలోనే తెలియజేస్తానని నైనా గంగూలీ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. దీంతో ఆమె అభిమానులు, నెటిజన్లు రగిలిపోతున్నారు. ఆ కొరియోగ్రాఫర్ ఎవరో చెప్పాలంటూ కామెంట్ప్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











