For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎంగేజ్మెంట్ పై కుండబద్దలు కొట్టిన నయనతార.. కాబోయే భర్త కోసం ఏకంగా టీవీ షోలోనే గుట్టురట్టు

  |

  సినిమా ప్రపంచంలో ఎంతో మంది హీరోయిన్స్ వస్తుంటారు పోతుంటారు. అయితే కొందరు మాత్రమే ప్రేక్షకుల మదిలో చాలా బలంగా పాతుకుపోతారు. ఎన్నేళ్లయినా కూడా ప్రేక్షకులు వారిని అంత ఈజీగా మర్చిపోరు. ఈ రోజులల్లో స్టార్ హీరోయిన్ గా ఐదేళ్లు కొనసాగడం అంటేనే ఒక గొప్ప రికార్డు అని చెప్పవచ్చు. స్టార్ హోదా ను కాపాడుకోవడం అంటే ఎవరికీ అంత ఈజీ కాదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలోకి బ్యూటిఫుల్ హీరోయిన్స్ భారీ స్థాయిలో పోటీని ఇస్తుంటారు. ఇక ఆ విధంగా ఎంత మంది పోటీ ఇచ్చిన కూడా ఏమాత్రం వెనక్కి తగ్గని హీరోయిన్లలో నయనతార ఒకరు. ఆమె ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 17 ఏళ్లకు పైగానే అవుతుంది. సినిమాల రిజల్ట్ ను పక్కన పెడితే ఎక్కువగా తన నటనతో అందంతోని అవకాశాలు అందుకుంది. ఇక ఇటీవల ఒక టెలివిజన్ షోలో పాల్గొన్న నయనతార తన ప్రస్తుత ప్రేమ గురించి అసలైన క్లారిటీ ఇచ్చేసింది. ఎంగేజ్మెంట్ పై కొనసాగుతున్న సస్పెన్స్ కు కూడా ఆమె తెర దించింది.

  ఏ మాత్రం తేడా లేకుండా

  ఏ మాత్రం తేడా లేకుండా

  2003లో ఒక మలయాళం సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన నయనతార అనంతరం 2005లో తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇక ఎప్పుడైతే గజిని సినిమాతో బాక్సాఫీసు హిట్ అందుకుందో అప్పటినుంచి కూడా ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసుకుంటూ వచ్చింది. ఇప్పటివరకు కూడా నయనతార ఎక్కువగా వెండితెరకు గ్యాప్ ఇచ్చినట్లు లేదు. సరైన ఫిట్నెస్ తోనే కాకుండా గ్లామర్ ను కూడా అదే తరహాలో మెయింటైన్ చేస్తూ వస్తోంది. టాలీవుడ్ కోలీవుడ్ అని తేడా లేకుండా హిందీ భాషల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంది.

  దాదాపు స్టార్ హీరోలందరితో..

  దాదాపు స్టార్ హీరోలందరితో..


  తెలుగు తమిళ్ లో దాదాపు స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ నటి నేటితరం యువ హీరోలతో కూడా రొమాన్స్ చేసి వయసుకు గ్లామర్ కు సంబంధం లేదని చెప్పకనే చెప్పింది. నయనతార రిజెక్ట్ చేస్తే తప్ప ఆమెకు ఖాళీ సమయం దొరకదు. నిత్యం ఏదో ఒక ఆఫర్ వస్తూనే ఉంటుంది. ఎక్కువగా స్టార్ హీరోల నుంచే ఆమెకు ఆఫర్స్ వస్తుంటాయి. ఇక నయనతార పర్సనల్ లైఫ్ లో కొన్ని లవ్ మ్యాటర్స్ ఏ స్థాయిలో వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

  అలాంటి గోడవలతో..

  అలాంటి గోడవలతో..

  మొదట హీరో శింబుతో ఆమె ప్రేమను కొనసాగించి అనంతరం గొడవ కారణంగా విడిపోయినట్లు అప్పట్లో రూమర్స్ గట్టిగానే వచ్చాయి. అనంతరం ప్రభుదేవాతో కూడా ఆల్ మోస్ట్ పెళ్లికి సిద్ధమైందని అనుకుంటున్న సమయంలో మరొకసారి బ్రేకప్ చెప్పేసింది. ఆ విషయం కూడా కోలీవుడ్ మీడియా లోనే కాకుండా నేషనల్ మీడియాలో కూడా అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచింది.

  ఎంగేజ్మెంట్ పై క్లారిటీ

  ఎంగేజ్మెంట్ పై క్లారిటీ


  రెండు ప్రేమ వ్యవహారాల అనంతరం ఆమె డైరెక్టర్ విగ్నేష్ వన్ తో ప్రేమలో పడింది. దాదాపు అతనితో పెళ్లి కి సిద్ధమైనట్లు గత ఏడాది నుంచి అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి కానీ నిన్నటివరకు నయనతార ఆ విషయాన్ని బయట లీక్ చేయలేదు. డైరెక్టర్ విగ్నేష్ శివన్ కూడా ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఒకనొక సమయంలో అయితే మీడియా ప్రశ్నలకు కోపం తట్టుకోలేక తమకు ఇష్టం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటామని కూడా అన్నాడు. ఇక రీసెంట్ గా నయనతార తన ఎంగేజ్మెంట్ పై ఫైనల్ గా ఒక క్లారిటీ అయితే వచ్చేసింది.

  ఎంగేజ్మెంట్ రింగును చూపిస్తూ

  ఎంగేజ్మెంట్ రింగును చూపిస్తూ

  ప్రస్తుతం ఆమె విగ్నేష్ శివన్ సంయుక్తంగా నిర్మిస్తున్న తన తదుపరి 'నేత్రికన్' కోసం ప్రమోషన్ అయితే స్టార్ట్ చేసింది. ఈ మూవీ ఆగస్టు 13 నుండి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ఇక ఇటీవల విడుదలైన ప్రమోషనల్ ప్రోమో వీడియోలో ఆమె చేతికి ఉన్న ఎంగేజ్మెంట్ రింగును కూడా చూపించింది. నయనతార ఎక్కువగా సినిమాల ప్రచార కార్యక్రమాలకు హాజరుకాకూడదనే కఠినమైన నిర్ణయాన్ని ఫాలో అవుతుంది. ఇక చాలా సంవత్సరాల తరువాత నయన్ 'లేడీ సూపర్ స్టార్ నయనతార' అనే స్పెషల్ షో కోసం టెలివిజన్‌లో కనిపించడానికి అంగీకరించింది, ఇది ఆగస్టు 15 ఆదివారం ఉదయం 10.30 గంటలకు విజయ్ టివిలో టెలికాస్ట్ అవుతుంది.

  చాలా ఏళ్ల తరువాత ప్రమోషన్స్

  చాలా ఏళ్ల తరువాత ప్రమోషన్స్

  ప్రోమోలో నయనతార చాలా అందంగా కనిపిస్తూ అభిమానులతో ముచ్చట్లు కూడా పెట్టింది. అలాగే ఆమె తన రొమాంటిక్ పార్టనర్ విఘ్నేష్ శివన్ పై ఎదురైన ప్రశ్నలకు కూడా ఇష్టపూర్వకంగానే సమాధానం చ్చింది. అసలైతే నయనతార ఒక సినిమాను ఓకే చేసే ముందే ప్రమోషన్లో ఏమాత్రం పాల్గొనను అని అగ్రిమెంట్ పైన సంతకం కూడా చేస్తుంది. ఇక సినీ నిర్మాతలు దర్శకులు కూడా ఆ విషయం అంగీకరించిన తర్వాతనే నయనతార నుంచి డేట్స్ తీసుకుంటారు. ప్రమోషన్ విషయంలో అయితే ఆమెను ఎవరు ఇబ్బంది పెట్టారు.

  Vihari tweets about Pspk rana movie | Filmibeat Telugu

  కాబోయే భర్త సినిమా కోసం స్పెషల్ ప్రమోషన్స్

  ఎందుకంటే ముందుగానే ఆమె ఆ విషయంలో క్లారిటీ వచ్చేలా మాట్లాడుతుందట. ఆమె అప్పుడప్పుడు కొన్ని సినిమాలకు ఇష్టపూర్వకంగానే ప్రమోషన్స్ లో పాల్గొంది. నయనతార చివరిసారిగా 2013 లో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన 'రాజా రాణి' సినిమా కోసం ప్రమోషన్ చేసింది. ఆ సినిమాలో ఆర్య, జై మరియు నజ్రియా నజీమ్‌ల లతో కలిసి ఒక టెలివిజన్‌లో ప్రమోషన్‌లు చేసింది. ఇక ఇప్పుడు తన కాబోయే భర్త సహా నిర్మాతగా వ్యవహరించిన నేత్రికణ్ సినిమా కోసం ప్రమోషన్ మొదలు పెట్టింది. ఇక కొరియన్ చిత్రం 'బ్లైండ్' యొక్క అధికారిక రీమేక్ అయిన నేత్రికణ్ సినిమాకు మిలింద్ రావు దర్శకత్వం వహించగా నయనతార, అజ్మల్, మణికందన్ మరియు శరణ్ శక్తి ఈ సినిమాలో నటించారు. సంగీతం గిరీష్ గోపాలకృష్ణన్, సినిమాటోగ్రఫీ ఆర్‌డి రాజశేఖర్, మరియు నిర్మాణం రౌడీ పిక్చర్స్ అండ్ క్రాస్ పిక్చర్స్.

  English summary
  Kollywood lady superstar Nayantarais in the news several days later. And she is revealed her engagement ring matter Promo viral,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X