అవకాశాల కోసం.. వాళ్లకు లొంగిపోతున్నారు.. కానీ..

Actress Poojitha: హాలీవుడ్‌లో ప్రారంభమైన క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమం ఇప్పుడు భారత్‌లోని అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలకు పాకింది. అవకాశాల కోసం లైంగిక వేధింపులకు గురయ్యారని కొన్ని హీరోయిన్లు బహిరంగంగా ప్రకటించడం, సోషల్ మీడియా ద్వారా 'మీటూ'ఉద్యమం ప్రారంభమవడం వల్ల ఇండస్ట్రీలోని ఎన్నో తెలియని చీకటి కోణాలు వెలికి వచ్చాయి. బాలీవుడ్‌లో తను శ్రీ దత్తా ఉద్యమాన్ని ముందడుగు పెట్టగా, టాలీవుడ్‌లో నటి శ్రీరెడ్డి ఈ ఉద్యమానికి ఊతమిచ్చారు. అప్పట్లో ఈ ఉద్యమం తారస్థాయిలో నడిచిన కొంతకాలంగా చల్లారినప్పటికీ, ఇప్పటికీ ఎక్కడో ఒకచోట చాపకింద నీరులా కొనసాగుతోంది. తాజాగా సీనియర్ నటి సీనియర్ నటి పూజిత ఇండస్ట్రీ జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ కథానాయికగా రాణించింది హీరోయిన్ పూజిత. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగాను బిజీ లైఫ్ ను చూశారు. వివిధ భాషలలో దాదాపు 140 సినిమాలు చేశారు. తాజాగా ఆమె ఓఇంటర్వ్యూలో మాట్లాడుతూ, క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. అలాగే.. తన కెరీర్ మొదటి రోజుల్లో ఎదురైన చేదు అనుభావాలను పంచుకుంది. " కాలేజ్ రోజుల నుంచి నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. అందువల్లనే సినిమాల వైపు వచ్చాను. మా నాన్నకు ఇష్టం లేకపోయినా, ఆయన ఒప్పుకోవలసి వచ్చింది" అని అన్నారు.

Actress Poojitha Opens Up About Casting Couch Experience and Industry Reality

నటి పూజిత ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభ రోజుల అనుభవాలను బహిరంగ పరిచింది. చాలా ఘోరమైన ఒక ఘటన వివరించారు. కాలేజ్ నుంచి యాక్టింగ్ ఆసక్తి పెరిగి ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు అడుగుపెట్టిన ఆమె తన మొదటి రోజులలో ఒక పెద్ద హీరో తన పట్ల దారుణంగా వ్యవహరించారని వివరించింది. ఆ నటుడు ఆమె పక్కన కూర్చొని ఆమె తొడపై చేయి పెట్టి రుద్దిపోయిన సంఘటన, ఆమె నిరాకరించగా కూడా ఆ అతడు మాటిమాటికి ఇబ్బంది కలిగించిన తీరును పూజిత చెబుతున్నారు.

ఆ తర్వాత ఆమె వెంటనే ఆ విషయం తన తండ్రికి చెప్పారు. తన తండ్రి ఆ విషయం గురించి చర్చించకుండా .. " సరేలే స్నానం చేసి తినిపించి పడుకో" అని బదులిచ్చారట. పొద్దున చూసేవరకు షాక్.. ఆయన ఎవరి కాళ్లు పట్టుకున్నారో ఏం చేశారో తెలియదు కానీ ఇంటి ముందు కారు ఉంది. 'ఇకపై నీకు సొంత కార్ నీ పక్కన ఎవరు ఉండరు. నీ కారులో ఎవరు ఎక్కరు' ఇదే నా బహుమతి అని తన నాన్న కారును గిఫ్ట్ గా ఇచ్చారని చెప్పింది. అదే పాలసీని ఇప్పటికి పాటిస్తున్ననీ, తన కారులో ఇప్పటివరకు వేరే వాళ్ళు ఎక్కరు ఎక్కించుకోననీ, తనకు ఇష్టం ఉండదనీ, తన కారులో తాను, తన బాబు, కుక్క పిల్ల మాత్రమే ఉంటాయి చెప్పింది. ఎవరూ లిఫ్ట్ అడిగినా.. ముఖం మీదే నో అని చెప్పేస్తా. ఇప్పుడు కూడా అదే నా పాలసీ అని చెప్పుకొచ్చింది.

మొత్తానికి మీరు కూడా కాస్టింగ్ కౌచ్ ను ఫేస్ చేసినా వారేగా అని యాంకర్ అనగా.. ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో కాస్ట్ ను ఫేస్ చేసిన వాళ్లే.. ప్రతి ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది కామన్. కానీ కానీ, ఇది రంగుల ప్రపంచం. అందుకే ఇందులో ఏం జరిగినా ఇట్టే బయటకు వస్తాయి. అందరూ సినీ విషయాలను ఫోకస్ చేసి మాట్లాడడం వల్ల హైప్ క్రియేట్ అవుతుంది అని కామెంట్స్ చేశారు. కాస్టింగ్ కౌచ్ అనే దాని గురించి ఇంత పెద్దగా మాట్లాడుకుంటున్నాం.. దీనికి కారణం లేడీ ఆర్టిస్టులే అనే టాక్ ఉంది దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని యాంకర్ ప్రశ్నించారు.

ఆ ప్రశ్నకు ఆమె బదిలిస్తూ..'సినిమా ఇండస్ట్రీలో అవకాశం కోసం తెగబడి పోతున్నారు. సినిమా ఇండస్ట్రీలో స్థిరపడడానికి ఎక్కడినుండో వస్తారు, తినడానికి పిండి ఉండదు. ఉండడానికి షెల్టర్ ఉండదు, ఆ సమయంలో ఎవరైనా కనిపిస్తే.. వారిని దేవుడుగా భావిస్తారు. అవకాశాలు ఇప్పిస్తాను. నాకేమీ ఇస్తారు. అనగానే.. ఈ కొత్తగా వచ్చేవాళ్ళు.. అసలు విషయం తెలుసుకోకుండా.. అవకాశం రాగానే నేను పెద్ద హీరోయిన్ ని అయిపోతానని భావిస్తారు. ఈ సమయంలో అవకాశాల కోసం వాళ్లకు లొంగిపోతున్నారు. అయితే ఇందులో కొంత మంది అవకాశాలు పొంగిపోయిన లబ్దిపొందిన వాళ్ళు ఉన్నారు. లొంగిపోయి మోసపోయిన వారు కూడా ఉన్నారు. అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో ఎవరైనా అమ్మాయిలని ఏడిపిస్తే.. ఎంతవాడినైనా కొట్టేస్తా.. అవసరమైతే.. కారులో వాడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పచెపిన రోజులు ఎన్నో ఉన్నాయి. అలా నా మీద ఇండస్ట్రీలో వేరే ఇంప్రెషన్ ఉంది' అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

More from Filmibeat

Read more about: casting couch poojitha tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X