HBD Priyamani సోషల్ మీడియాలో మొదటి ఫొటోతోనే షాక్ ఇచ్చేసింది.. ఇప్పుడే ఇలా ఉందంటే..?

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకున్న బ్యూటీలలో ప్రియమణి ఒకరు. ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ తో ఆకట్టుకుంటున్న అమ్మడు ఒకప్పుడు ఘాటైన గ్లామర్ లుక్స్ తో ఎంతగానో షాక్ ఇచ్చింది. ఒకసారి బికినీలో కూడా కనిపించింది. ఇక పెళ్లి అనంతరం గ్లామర్ రోల్స్ ను తగ్గించిన ప్రియమణి అప్పుడప్పుడు హాట్ ఫొటో షూట్స్ తో షాక్ ఇస్తోంది. ఇటీవల ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు చెబుతూ మొదటి ఫొటోతోనే వైరల్ అయ్యింది.

 సరికొత్త ఎంట్రీ

సరికొత్త ఎంట్రీ

నేడు ప్రియమణి 37వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రియమణికి అభిమానులు సినీ తారలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఇన్నాళ్లు సోషల్ మీడియాకు డిస్టెన్స్ మెయింటైన్ చేసిన అమ్మడు ఇప్పుడు అందరిలానే బిజీ అవ్వాలని డిసైడ్ అయ్యింది.

వయసుతో సంబంధం లేకుండా

వయసుతో సంబంధం లేకుండా

ఈ రోజుల్లో కొంతమంది లేడి యాక్టర్స్ కు అవకాశాలు రావడానికి సోషల్ మీడియా అనేది చాలా హెల్ప్ అవుతోంది. వయసుతో సంబంధం లేకుండా గ్లామర్ ఫొటో షూట్స్ తో ఆకట్టుకుంటున్నారు. చూస్తుంటే ప్రియమణి కూడా అదే తరహాలో ఎదో ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది ఎందుకంటే ఆమె లేటెస్ట్ గా ఇచ్చిన స్టిల్ అలాంటి ఆలోచనను కలిగిస్తోంది.

క్లివేజ్ అందాలతో..

క్లివేజ్ అందాలతో..

బ్లాక్ డ్రెస్ లో ఈ సీనియర్ నటి క్లివేజ్ అందాలతో షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఒకప్పుడు ద్రోణా సినిమాలో బికినీలో కనిపించి కుర్రాళ్లను డిస్టర్బ్ చేసిన ప్రియమణి మళ్ళీ చాలా కాలం తరువాత ఆ రేంజ్ లో కాకపోయినా స్టైలిష్ గా ఎట్రాక్ట్ చేస్తున్నట్లు ఓ వర్గం నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Recommended Video

The Family Man 2 Review | Samantha, Screenplay రెండూ సూపర్ !! || Filmibeat Telugu
రాబోయే సినిమాలు...

రాబోయే సినిమాలు...

ఇక ప్రస్తుతం ప్రియమణి సపోర్టింగ్ రోల్స్ తో పాటు హీరోలకు జోడిగా కూడా నటిస్తోంది. రానా - సాయి పల్లవి నటించిన విరాటపర్వం సినిమాలో ఒక నక్సలైట్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ప్రియమణి పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందట. అలాగే నారప్ప సినిమాలో వెంకటేష్ కు జోడిగా ఒక తల్లి పాత్రలో నటించింది. మరి ఆ సినిమాలు ఏ రేంజ్ లో గుర్తింపు తీసుకు వస్తాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X