For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పెళ్లి కోసం రకుల్ ప్రీత్ స్పెషల్ ప్లాన్.. అందుకే అలాంటి కండిషన్?

  |

  గ్లామర్ బ్యూటీ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న ఢిల్లీ భామ రకుల్ ప్రీత్ సింగ్ గత కొంతకాలంగా వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఆమెకు తెలుగు లో ఎన్ని అపజయాలు వస్తున్న కూడా బాలీవుడ్లో మాత్రం ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. తెలుగు లో ఫలితాలతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అనే తేడా లేకుండా డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఒప్పుకుంటోంది. అయితే ఇటీవల రకుల్ ప్రీత్ తన ప్రేమ విషయం పై ఒక క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత నటుడు జాకీ భగ్నానితో డేటింగ్ చేస్తున్నట్లు అధికారికంగా సోషల్ మీడియాలో వివరణ ఇచ్చింది. అందుకు సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి.

   ప్రేమలో ఉన్నట్లు క్లారిటీ

  ప్రేమలో ఉన్నట్లు క్లారిటీ

  సాధారణంగా సినీ నటులు తోటి హీరో హీరోయిన్స్ తో కాస్త క్లోజ్ గా ఉన్నా కూడా రూమర్స్ ఒక రేంజ్ లో వైరల్ అవుతాయి. ఇక అఫీషియల్ గా ప్రేమ విషయాన్ని బయట పెట్టడంతో వారి పెళ్లికి సంబంధించిన అనేక రకాల వార్తలు కూడా మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇప్పటి వరకు కేవలం ప్రేమలో ఉన్నట్లు మాత్రమే క్లారిటీ ఇచ్చిన రకుల్ ఇంకా తన పెళ్లి విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే ఇవ్వలేదు.

  చేతిలో ఉన్నవన్ని మంచి సినిమాలే

  చేతిలో ఉన్నవన్ని మంచి సినిమాలే

  అయితే ఇటీవల రకుల్ తీసుకున్న ఒక నిర్ణయం కారణంగా ఆమె పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉందని మరో టాక్ వైరల్ గా మారుతోంది. ప్రస్తుతం రకుల్ చేతిలో పెద్ద సినిమాలే ఉన్నాయి. తెలుగులో అంతగా ఆఫర్స్ రాకపోయినప్పటికీ బాలీవుడ్ హాలీవుడ్ సినిమాలు మాత్రం బాగానే వస్తున్నాయి. ఇటీవల తెలుగులో కొండపొలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోయింది.

  పెళ్లి పనుల కోసమే..?

  పెళ్లి పనుల కోసమే..?

  ఇక వచ్చేనెల అమ్మడు పెళ్లికి సంబంధించిన పనులను మొదలు పెట్టే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాల కాల్షీట్స్ క్యాన్సల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తొందరగా పూర్తయ్యే సినిమాలను ఈ నెల చివరిలోగా పూర్తి చేసి వచ్చేనెల పూర్తిగా షూటింగ్ లను వాయిదా వేయమని నిర్మాతలను ప్రత్యేకంగా కోరిందట. కొంతమంది నిర్మాతలు ఆమెకు సహకరించగా కొంతమంది తొందరగా ఈ నెలలోనే ఆమెకి సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం.

  సౌత్, నార్త్ లో బిజీగా..

  సౌత్, నార్త్ లో బిజీగా..

  ఏదేమైనా రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు రోజుకు 12 గంటలకు పైగా షూటింగ్ లోనే సమయాన్ని గడుపుతున్నట్లు సమాచారం. వీలైనంత వరకు చేతిలో ఉన్న సినిమాలు అన్నీ కూడా ఈ ఏడాది చివరిలోగా పూర్తి చేసుకోవాలని ఆ తర్వాత మ్యారేజ్ లైఫ్ తో ఎంజాయ్ చేయాలని ఆలోచిస్తోంది. తమిళంలో శివకార్తికేయన్ సైన్స్-ఫిక్షన్ కామెడీ చిత్రం అయలాన్ విడుదలకు సిద్ధమవుతోంది. హిందీలో అజయ్ దేవగన్ మరియు సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నతోస్తోంది.

  Bigg Boss Telugu 5 : అక్కా తొక్కా అని పిలవకండి.. రెచ్చిపోయిన ఆనీ మాస్టర్..! || Filmibeat Telugu
  కాబోయే భర్త ఎవరంటే..?

  కాబోయే భర్త ఎవరంటే..?

  థాంక్ గాడ్ తరువాత ఎక్కువగా మేడే ప్రాజెక్ట్ తో బిజీ కానుందట. అందులో అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగన్ కలిసి నటిస్తున్నారు. ఇక రకుల్ ప్రేమికుడు జాకీ భగ్నాని బాలీవుడ్ నిర్మాత వషు భగ్నాని కుమారుడు. అతను చివరిగా హిందీ చిత్రంలో 2018 రొమాంటిక్ కామెడీ చిత్రం మిట్రాన్‌లో కనిపించాడు. అది తెలుగులో వచ్చిన పెళ్లి చూపులు సినిమాకు రీమేక్. ఆ తర్వాత అతను కూలీ నంబర్ 1, జవానీ జానెమాన్ మరియు బెల్ బాటమ్ వంటి చిత్రాలకు నిర్మాతగా వర్క్ చేశాడు.

  English summary
  Actress Rakul Preet’s wedding plans rumours viral,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X