Don't Miss!
- News
‘భారత వ్యతిరేకి’ ఇల్హాన్ ఒమర్ శక్తివంతమైన యూఎస్ ఫారెన్ ఎఫైర్స్ ప్యానెల్ నుంచి ఔట్
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Finance
vodafone idea: బకాయిలను ఆ విధంగా కట్టమని వొడాఫోన్ ఐడియాకు ఆదేశం..
- Technology
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Rakul Preet Singh: చొక్కా విప్పేసి చిన్న నిక్కరులో రకుల్ రచ్చ.. బికినీ కంటే అందంగా..
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు గ్లామరస్ బ్యూటీగా స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా మారిపోయింది. తెలుగులో ఈ బ్యూటీ గతకొంతకాలంగా అపజయాలతో చేదు అనుభవాలను ఎదుర్కొంటోంది. అయినప్పటికీ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మళ్ళీ తెలుగులో కూడా అవకాశాలు వస్తే చేయడానికి వెనుకడుగు వేయడం లేదు. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో గ్లామరస్ అందాలతో కూడా షాక్ ఇస్తోంది. ఇటీవల ఆమె పోస్ట్ చేసిన మరొక ఫోటో కూడా ఫాలోవర్స్ ను ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

తెలుగులో స్టార్ హోదా
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపును అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత పెద్ద హీరోలతో వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం కన్నడ చిత్ర పరిశ్రమలో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. ఇక టాలీవుడ్ లో మాత్రం ఆమె ప్రతి ఏడాది ఏదో ఒక సినిమా తో ఆడియన్స్ ను పలకరించే ప్రయత్నం చేస్తోంది.

అప్పట్లో వరుస విజయాలు
ఈ మధ్యకాలంలో రకుల్ ప్రీత్ సింగ్ నాన్నకు ప్రేమతో, సరైనోడు, దృవ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకుని మిగతా హీరోయిన్స్ కు కూడా గట్టి పోటీని ఇచ్చింది. అప్పట్లో ఈ బ్యూటీ పారితోషకం కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే ఆ క్రేజ్ ను రకుల్ ఎక్కువ రోజులు కొనసాగించ లేక పోయింది.

బిగ్గెస్ట్ డిజాస్టర్స్
కొన్ని సార్లు వరుసగా విజయాలను అందుకుంటున్న రకుల్ మరి కొంత కాలం తర్వాత వరుసగా డిజాస్టర్స్ చూడాల్సి వస్తోంది. ముఖ్యంగా ఈ బ్యూటీ కెరీర్ లో చేసిన కొన్ని పెద్ద సినిమాలు ఊహించని విధంగా చేదు అనుభవాలను మిగిల్చాయి అందులో మహేష్ బాబు స్పైడర్, నాగార్జున మన్మధుడు సినిమాలు బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచాయి.

అక్కడ కూడా అపజయాలు!
ఏది ఏమైనా రకుల్ సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా తన కెరీర్ ను ఒక లెవల్ లో జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తోంది. ఇక బాలీవుడ్ లో ప్రస్తుతం చాలా బిజీగా మారిపోయింది. కాకపోతే అక్కడ కూడా మళ్ళీ ఆమె సినిమాలు ప్లాప్ అవుతున్నాయి. రీసెంట్ గా వచ్చిన ఎటాక్, రన్ వే సినిమాలతో ఊహించని విధంగా మరో రెండు డిజాస్టర్స్ ను ఎదుర్కొంది.

చిన్న నిక్కరులో ఫొటో షూట్
ఇక సినిమాల సంగతి పక్కన పెడితే రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం తన గ్లామర్ తో నిత్యం ఏదో ఒక విధంగా ఆకట్టుకుంటూనే ఉంది. రీసెంట్ గా హలో మ్యాగజైన్ కోసం స్పెషల్ ఫోటోషూట్ నిర్వహించిన రకుల్ అందులో చొక్కా గుండెలను తీసేసినట్లుగా అతి చిన్న నిక్కరులో నెటిజన్లకు షాక్ ఇచ్చింది. ఒక విధంగా గతంలో వేసిన బికినీ కంటే కూడా ఇది చాలా అందంగా ఉంది అని పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

రాబోయే సినిమాలు
ఇక ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ఆమె చేతిలో హిందీ తెలుగు తమిళ్ సినిమాలు గట్టిగానే ఉన్నాయి. హిందీలో డాక్టర్ జి సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా తమిళంలో ఇటీవలే ఒక సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. తెలుగు తమిళంలో ఒకేసారి తెరకెక్కుతున్న '31 అక్టోబర్ లేడీస్ నైట్' అనే సినిమా విడుదల కావాల్సి ఉంది. ఇక తమిళంలో చేసిన ఇండియన్ 2 సినిమా షూటింగ్ మధ్యలో ఆగిపోయిన విషయం తెలిసిందే.