For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Rambha: జేడీ చక్రవర్తి పెద్ద నాటకాలోడు.. ఫ్రెండ్షిప్ లో అలా అంటూ రంభ షాకింగ్ కామెంట్స్!

  |

  నట కిరిటీ రాజేంద్ర ప్రసాద్- దివంగత డైరెక్టర్ ఈవీవీ సత్య నారాయణ కాంబినేషన్ లో వచ్చిన ఆ ఒక్కటీ అడక్కు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది బ్యూటిఫుల్ రంభ. సుమారు వందకుపైగా సినిమాల్లో రంభ అలరించింది. తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో నటించి ఆకట్టుకున్న గ్లామర్ క్వీన్ అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ లోనూ అలరించింది.

  ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న రంభ.. నటుడు, హీరో జేడీ చక్రవర్తితో బొంబాయి ప్రియుడు అనే సూపర్ హిట్ మూవీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జేడీ చక్రవర్తి గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది రంభ.

  స్టార్ హీరోయిన్ గా..

  స్టార్ హీరోయిన్ గా..

  నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ హీరోగా కామెడీ అండ్ సెంటిమెంట్ చిత్రాల డైరెక్టర్ గా పేరున్న ఈవీవీ సత్య నారాయణ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ఆ ఒక్కటీ అడక్కు. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటి రంభ. ఆ తర్వాత బావగారు బాగున్నారా, అల్లుడా మజకా, బొంబాయ్ ప్రియుడు, హిట్లర్, బొంబాయి ప్రియుడు తదితర చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

  అసలు పేరు విజయ లక్ష్మి..

  అసలు పేరు విజయ లక్ష్మి..

  టాలీవుడ్ లో చాలాకాలంపాటు తన అందచందాలతో సత్తా చాటిన బ్యూటిఫుల్ ముద్దుగుమ్మ రంభ అసలు పేరు విజయ లక్ష్మి. సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే శ్రీలంకకు చెందిన తమిళ బిజినెస్ మ్యాన్ ఇంద్రన్ పద్మనాథన్ ను 2010 ఏప్రిల్ 10న వివాహం చేసుకుంది. ఆ తర్వాత భర్తతో కలిసి కెనడాలో సెటిల్ అయింది ఈ బ్యూటి. ఈ జంటకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. అప్పటి నుంచి తన ఫ్యామిలీతో చెందుతున్న అనుభూతులను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది.

  అప్పటి నుంచి మంచి బాండింగ్..

  అప్పటి నుంచి మంచి బాండింగ్..

  ఇదిలా ఉంటే ఎన్నో చిత్రాల్లో నటించిన రంభకు స్టార్ హీరోలతో మంచి బాండింగ్ ఉంది. ఈ క్రమంలోనే జేడీ చక్రవర్తి, రంభ జోడికి మంచి క్రేజ్ ఉండేది. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన బొంబాయి ప్రియుడు సినిమాతో ఈ జంట ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత కోదండ రాముడు సినిమాలో కూడా వీళ్లిద్దరు కలిసి నటించారు. దీంతో వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. అయితే ఇటీవలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రంభ.. జేడీ చక్రవర్తిపై షాకింగ్ కామెంట్స్ చేసింది.

  తిడతాననే ఎదురుగా రాడు..

  తిడతాననే ఎదురుగా రాడు..

  "నేను అందరితో చాలా క్లోజ్ గా ఉంటాను. పర్టిక్యులర్ ఫ్రెండ్స్ అంటూ, ఓ గ్యాంగ్ అంటూ ఏం లేదు. నాకు జేడీ చక్రవర్తి బొంబాయి ప్రియుడు అప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్. కానీ ఇప్పుడు లేదు. ఎందుకంటే అతను నా పెళ్లికి రాలేదు. నేను చాలా అప్సెట్ అయ్యాను. ఎదురుగా వస్తే కచ్చితంగా తిడతాను. కానీ తిడతాననే రాడు. చాలా నాటకాలు ఆడతాడు. అబద్ధాలకోరు.

  ఒక అమ్మాయి నాటకాలు చేస్తుందని అంటారు. కానీ అబ్బాయిల్లో నాటకాలు చేయాలంటే జేడీ చక్రవర్తి తర్వాతే. కానీ చాలా మంచి వ్యక్తి. గుడ్ హార్టెడ్ పర్సన్. నాకు చాలా మంచి ఫ్రెండ్ అండ్ మంచి వెల్ విషర్ అని చెప్పుకొచ్చింది" రంభ

  త్వరలో రీఎంట్రీ..

  త్వరలో రీఎంట్రీ..

  తర్వాత హీరోయిన్లలో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు.. "నాకు సౌందర్య గారు చాలా ఇష్టం. మంజుల గారి యంగర్ డాటర్ శ్రీదేవి, ఇప్పుడు మహేశ్వరి గుడ్ ఫ్రెండ్స్. కానీ ఎక్కువగా కలిసే రిలేషన్ లేదు. హాయ్ హలో రమ్యకృష్ణ గారు అంతే. అందరితో ఫ్రెండ్లీగా ఉంటా అని తెలిపింది" బ్యూటిఫుల్ రంభ. అలాగే త్వరలో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని రంభ భావిస్తునట్లుగా సమాచారం.

  దేశముదురు సినిమాలో..

  దేశముదురు సినిమాలో..

  చిరంజీవి, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో జత కట్టిన ముద్దుగుమ్మ రంభ హీరోయిన్ గా చేసిన తర్వాత ఐటమ్ సాంగ్స్ లో నర్తించింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో నాగ సినిమాలో నాయుడోరి పిల్ల, యమదొంగ చిత్రంలో నాచోరే.. సాంగ్స్ పేరు తీసుకొచ్చాయి. ఇక డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్-అల్లు అర్జున్ కాంబినేషన్ హిట్ మూవీ దేశ ముదురు లో అట్టాంటోడే.. ఇట్టాంటోడే సాంగ్ తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది గ్లామరస్ బ్యూటి రంభ.

  English summary
  Tollywood Heroine Rambha Shocking Comments On JD Chakravarthy In Latest Interview And Says He Is A Greatest Liar.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X