Ramya Krishnan: రమ్యకృష్ణ ఘాటు కోరికలు.. 55 ఏళ్ల వయసులో కూడా ఆ ఫైర్ తగ్గలేదట!
తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నది నటి రమ్యకృష్ణ (Ramya Krishnan). నలభై ఏళ్లకు పైగా సినీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న ఈ అగ్రనటి, నేటికీ తన నటనతో, గ్లామర్‌తో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టిన రమ్యకృష్ణ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 100పైగా చిత్రాల్లో నటించారు. "నరసింహ","బాహుబలి", "అల్లుడా మజాకా"వంటి చిత్రాలతో ప్రేక్షకుల మదిలో చిరస్మరణీయమైన ముద్ర వేసుకున్నారు. అయితే.. . తాజాగా 55 ఏళ్ల రమ్యకృష్ణ.. లేట్ వయసులో ఘాటు కోరికను బయటపెట్టింది. ఇంతకీ ఆ కోరికేంటీ?
నీలాంబరి నుంచి శివగామి వరకూ ఏ పాత్రలో నటించినా తనదైన ముద్ర వేసుకున్న నటి రమ్యకృష్ణ. ప్రతీ రోల్‌లో కొత్తదనంతో ప్రేక్షకుల మనసు దోచుకుంటున్నారు. ముఖ్యంగా "నరసింహ"లో నీలాంబరి, "బాహుబలి"లో శివగామి పాత్రలు ఆమె కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచాయి. రమ్యకృష్ణ తన కెరీర్‌కు అజరామరమైన గుర్తింపుని తెచ్చుకున్నారు. ఆమె దేవతగా మెప్పించింది, విలన్‌గా భయపెట్టింది, రాజకీయ నాయకురాలిగా ప్రభావం చూపించింది, వేశ్యగా కూడా ప్రేక్షకుల మనసు తాకింది. ప్రతీ పాత్రలోనూ ఆమె నటన, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ అన్నీ ప్రత్యేకం. కమర్షియల్ సినిమాల్లోనూ, లేడీ ఓరియెంటెడ్ కథల్లోనూ మెరిసిన నటి రమ్యకృష్ణ.

ఇకపోతే రమ్యకృష్ణ తన సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. తాజాగా రమ్యకృష్ణ జీ తెలుగు ప్రసారమవుతున్న "జయమ్ము నిశ్చయమ్మురా" కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నారు. ఈ షోను హీరో జగపతిబాబు హోస్ట్ చేస్తున్నారు. ఎప్పటిలాగే కంఫర్ట్‌గా, కాంఫిడెంట్‌గా రమ్యకృష్ణ హాజరై తన మాటలతో, నవ్వుతో, ఉత్సాహంతో సెట్స్‌లో జోష్ నింపారు. ఈ కార్యక్రమంలో జగపతిబాబు అడిగిన ప్రశ్నలకు ఆమె ఇచ్చిన సమాధానాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా, "మీకు రీమేక్ చేయాలనిపించే విషయం ఏదైనా ఉందా?" అని జగపతి బాబు అడిగిన ప్రశ్నకు రమ్యకృష్ణ ఇచ్చిన సమాధానం అందరినీ షాక్‌కి గురిచేసింది. రమ్యకృష్ణ "నాకు నేను చేసిన అన్ని ఐటమ్ సాంగ్స్ మళ్లీ చేయాలని ఉంది" అని ఘాటు సమాధానం ఇచ్చారు. ఈ ఒక్క మాటతో అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. 55 ఏళ్ల వయసులో కూడా "ఐటమ్ సాంగ్స్ మళ్లీ చేయాలనుంది" అని చెప్పిన రమ్యకృష్ణ ధైర్యం, ఆత్మవిశ్వాసం నెటిజన్లను ఆకట్టుకుంది. ఆమె ఈ మాటతో తనలో ఇంకా ఎంత ఎనర్జీ ఉందో చూపించింది.
గతంలో రమ్యకృష్ణ చేసిన స్పెషల్ సాంగ్స్ అన్నీ కూడా బ్లాక్‌బస్టర్ అయ్యాయి. "నరసింహ", "అల్లుడా మజాకా", "బాషా" వంటి చిత్రాల్లో ఆమె చేసిన పాటలు ఆ కాలంలో ట్రెండ్ సెట్ చేశాయి. ఆ సాంగ్స్ ద్వారా ఆమె గ్లామర్, డ్యాన్స్, ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను ఫిదా చేశాయి. అదే కారణంగా ఈమె స్పెషల్ సాంగ్స్ గురించి మాట్లాడిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు "ఈ వయసులోనూ ఇంత ధైర్యంగా మాట్లాడే రమ్యకృష్ణ సూపర్" అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే కొందరు నెటిజన్లు మాత్రం "55 ఏళ్ల వయసులో ఐటమ్ సాంగ్స్ చేయాలనే కోరిక ఏమిటి?" అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఆమె ఒక మాటతోనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయారు.
ఈ ప్రోగ్రామ్‌లో రమ్యకృష్ణ తన కెరీర్‌కి సంబంధించిన మరికొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "బాహుబలి" చిత్రంలో తాను పోషించిన శివగామి పాత్ర గురించి మాట్లాడుతూ, "ఆ సమయంలో నిర్మాత శోభు యార్లగడ్డ నాకు కాల్ చేసి, 40 రోజుల కాల్ షీట్స్ కావాలని చెప్పారు. నేను 'అంత కాలం కుదరదు' అని చెప్పి ఫోన్ కట్ చేశాను. కానీ తర్వాత ఆ పాత్ర స్క్రిప్ట్ విన్నాక, ఆ పాత్రలోని పవర్ గ్రహించాను. నిజంగానే ఆ రోల్ చేస్తున్నప్పుడు నేను రాజమాతలా ఫీల్ అయ్యాను" అని చెప్పారు. అలాగే ప్రోమోలో "ఇది నా మాట... నా మాటే శాసనం" అంటూ బాహుబలి సినిమాలోని ఫేమస్ డైలాగ్‌ను చెబుతూ రమ్యకృష్ణ తన శైలిలో సెట్‌ను ఉత్సాహపరిచారు. ఆమె చెప్పిన ఆ డైలాగ్‌కు ప్రేక్షకులు గట్టిగా చప్పట్లు కొట్టారు.


Click it and Unblock the Notifications











