For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  16వ ఏటనే డేటింగ్ చేశా.. కొందరు డైరెక్టర్లు ఒత్తిడి చేసినా ఒప్పుకోలేదు: రాశీ ఖన్నా

  By Manoj Kumar P
  |

  రాశీ ఖన్నా.. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న నటి. అవసరాల శ్రీనివాస్ - నాగశౌర్య కాంబినేషన్‌లో వచ్చిన 'ఊహలు గుసగుసలాడే' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈమె.. ఆ తర్వాత చాలా మంచి అవకాశాలను దక్కించుకుంది. అందంతో పాటు అభినయం కనబరిచే నటి కావడంతో ఈమెకు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. అందుకే రాశీ ఖన్నా బడా హీరోల సరసన కూడా అవకాశాలు దక్కించుకుంటోంది. దీంతో ఈమె స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. తాజాగా రాశీ తన అఫైర్ల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. వివరాల్లోకి వెళితే..

  ఎక్కడ చూసినా రాశీనే

  ఎక్కడ చూసినా రాశీనే

  ‘మద్రాస్ కేఫ్' అనే హిందీ సినిమాతో వెండితెరపై కనిపించింది రాశీ ఖన్నా. ఆ తర్వాత ఆమె తెలుగు, కన్నడం, తమిళం భాషా చిత్రాల్లో నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తోంది. ఒక పక్క తెలుగులో సినిమాలు చేస్తూనే.. మరోవైపు, మిగిలిన దక్షిణాది ఇండస్ట్రీల్లోనూ మెరుస్తోంది. దీంతో రాశీ ఖన్నా పాపులర్ హీరోయిన్ అయిపోయింది.

  క్రికెటర్‌తో డేటింగ్.. క్లారిటీ ఇచ్చేసింది

  క్రికెటర్‌తో డేటింగ్.. క్లారిటీ ఇచ్చేసింది

  రాశీ ఖన్నా.. భారత క్రికెట్ జట్టు సభ్యుడు జస్ప్రీత్ బూమ్రాతో డేటింగ్ చేస్తుందని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనికి కారణం రాశీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఆ యంగ్ బౌలర్ ఫాలో అవడమే. అప్పట్లో ఇది పెద్ద సంచలనం అయిపోయింది. దీనిపై రాశీ కూడా క్లారిటీ ఇచ్చేసింది. ‘బూమ్రా, నేను స్నేహితులం మాత్రమే' అని ఓ కామెంట్ చేసి పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టింది.

  ఆ ముగ్గురు హీరోలతో రొమాన్స్

  ఆ ముగ్గురు హీరోలతో రొమాన్స్

  ప్రస్తుతం రాశీ ఖన్నా తెలుగులో మూడు సినిమాల్లో నటిస్తోంది. అందులో ఒకటి నాగ చైతన్య - విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో వస్తున్న ‘వెంకీ మామ' కాగా.. విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్' మరొకటి. ఇక, మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో కలిసి ‘ప్రతి రోజూ పండగే' చేస్తోంది. ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

  కొందరు దర్శకులు ఒత్తిడి చేశారు

  కొందరు దర్శకులు ఒత్తిడి చేశారు

  వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న రాశీ ఖన్నా ఇటీవల ఓ ఇంగ్లీష్ మేగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఎన్నో విషయాలు వెల్లడించింది. ‘గ్లామరస్ పాత్రలు చేయాలని చాలా మంది దర్శకులు ఒత్తిడి చేశారు. కానీ, నాకు మాత్రం ప్రాముఖ్యత ఉన్న పాత్రలు మాత్రమే చేయాలని ఉంటుంది. అదీ కాక నా గ్లామర్ విషయంలో కొన్ని బౌండరీస్ ఉన్నాయి' అని చెప్పింది.

  #CineBox : Allu Arjun Is taking Huge Remuneration For Trivikram Srinivas's 'Ala Vaikuntapuramlo'?
  16వ ఏటనే డేటింగ్ చేశా

  16వ ఏటనే డేటింగ్ చేశా

  అలాగే, తన లవ్ ఎఫైర్ల గురించి కూడా స్పందించింది. ‘నేను ఏ ఇంటర్వ్యూకు వెళ్లినా డేటింగ్ పైన ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఎక్కడా చెప్పలేదు. కానీ, నేను నా పదహారవ ఏటనే ఓ అబ్బాయితో డేటింగ్ చేశాను. అతడు నా క్లాస్‌మేట్. మా ఇద్దరి వయసు ఒకటే. తర్వాత ఇద్దరం దూరమయ్యాం' అని ఆమె వెల్లడించింది.

  English summary
  Raashi Khanna is an Indian actress, and model who predominantly works in the Telugu and Tamil film industries. She debuted as an actress with the Hindi film Madras Cafe and made her debut in Telugu with the film Oohalu Gusagusalade (2014), in Tamil with the film Imaikkaa Nodigal (2018).
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X