Renu Desai: హాస్పిటల్ బెడ్ పై రేణూ దేశాయ్.. అసలు ఏమైంది?
Renu Desai: రేణు దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రేణు.. ఆ తరువాత కాలంలో కాస్ట్యూమ్ డిజైనర్ గా, ఎడిటర్ గా, నిర్మాతగా, డైరెక్టర్ గా చేసి మల్టీటాలెంటెడ్ అని నిరూపించుకుంది. అయితే.. గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఈ హీరోయిన్ సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్ నిత్యం టచ్ లోనే ఉంటుంది. రెగ్యులర్ గా తన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా రేణూ దేశాయ్ హాస్పిటల్ బెడ్ పై ఉన్నా ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ రేణు దేశాయ్ కి ఏమైంది ?
టాలీవుడ్‌లో హీరోయిన్ రేణూ దేశాయ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన "బద్రి" సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకుంది. తన మల్టీటాలెంట్‌తో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కొత్తకాలం సినిమాలకు దూరంగా ఉంది. ఆ తరువాత 2023 లో టైగర్ నాగేశ్వర రావు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. మరో సినిమాలో నటించలేదీ అందాల తార. అదే సమయంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంది. సోషల్ మీడియాలో మాత్రం రేణూ దేశాయ్ చురుకుగా ఉంటుంది. తరచూ తన జీవితంలోని ఆసక్తికర క్షణాలను, ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ వారితో టచ్‌లో ఉంటుంది.

తాజాగా రేణూ దేశాయ్ హాస్పిటల్ బెడ్ పై కూర్చుని ఉన్న వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఆమె రేబిస్ టీకా తీసుకుంటున్నట్లు కనిపించింది. దీంతో అభిమానులు ఒక్కసారిగా ఆందోళన చెందారు "ఏమైంది రేణూకి?", "ఆసుపత్రిలో ఎందుకుందో?" అంటూ కామెంట్లు పెట్టారు. కానీ కొద్దిసేపటికే ఆమె స్పష్టత ఇచ్చింది. టీకా తీసుకోవడం వెనుక కారణాన్ని స్వయంగా వీడియోలో వివరించింది.
రేణూ దేశాయ్ మాట్లాడుతూ "నేను రేబిస్ టీకా తీసుకుంటున్న వీడియో ఇదే మొదటిసారి. సాధారణంగా ఎలాంటి వ్యాక్సిన్ తీసుకున్నా వీడియో రికార్డ్ చేయను. కానీ ఈసారి మాత్రం అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో చేశాను. జంతువులను పెంచుకునే వారు, పశువైద్యులు తప్పనిసరిగా టీకాలు సమయానికి తీసుకోవాలి. రేబిస్ వంటి వ్యాధులు నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరమవుతాయి. అందుకే నేను ఈ వీడియోను షేర్ చేస్తున్నాను" అని తెలిపింది. ఆమె ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రేణూ దేశాయ్ ఎప్పుడూ సామాజిక అంశాలపై సున్నితంగా స్పందిస్తుంది. గత కొంతకాలంగా మహిళలు, చిన్నారులు, మూగజీవాల సంక్షేమం కోసం పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఇందుకోసం ఆమె ఒక స్వచ్ఛంద సంస్థ (NGO)ను కూడా ప్రారంభించింది. రేణూ ఎప్పుడూ "సెలబ్రిటీగా ఉన్నా, మన బాధ్యతలు మానవతా విలువలపైనే ఉండాలి" అనే దృక్కోణంతో ముందుకు సాగుతోంది.
మరోవైపు రేణూ కుమారుడు అకీరా నందన్ త్వరలోనే సినిమాల్లో అడుగు పెట్టబోతున్నాడనే ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో నడుస్తోంది. పవన్ కళ్యాణ్ నటించిన "ఓజీ" సినిమాలో అకీరా కీలక పాత్రలో నటించాడని వార్తలు వచ్చినా, అది రూమర్‌గానే మిగిలిపోయింది. అయితే అభిమానులు అకీరా సిల్వర్ స్క్రీన్‌పై ఎప్పుడూ కనిపిస్తాడని మెగా అండ్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











