For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  స్కూల్ లోనే ప్రేమ వ్యవహారాలు.. విషయం తెలియడంతో నన్ను చితకొట్టేశారు: సాయి పల్లవి

  |

  టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా విభిన్నమైన ప్రయోగాత్మకమైన కథలను ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఆమె ఏదైనా సినిమా చేయడానికి ఒప్పుకుంది అంటే తప్పకుండా అందులో ఎవరు చూపించని ఒక కొత్త తరహా పాయింట్ ఉంటుంది అనే నమ్మకం కూడా ప్రేక్షకుల్లో కలిగింది.

  ఇటీవల వచ్చిన విరాటపర్వం సినిమా కూడా విమర్శకుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. అయితే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి ఎవరు ఊహించిన విధంగా తన స్కూల్ డేస్ లోని ఒక లవ్ మేటర్ గురించి ఓపెన్ గానే తెలియజేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

   ప్రేక్షకులకు నచ్చే విధంగా..

  ప్రేక్షకులకు నచ్చే విధంగా..

  సాయి పల్లవి తన పర్సనల్ లైఫ్ లో చాలా సింపుల్ గా ఉంటుంది అనేది నడవడికను చూస్తేనే చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఎలాంటి ఇంటర్వ్యూలు ఇచ్చిన కూడా అందులో చాలా సింపుల్ గా సాధారణమైన అమ్మాయిలా కనిపించే విధంగా మాట్లాడుతూ ఉంటుంది. ఒక విధంగా అభిమానుల్లో సాయిపల్లవికి మంచి రెస్పెక్ట్ ఉంది అనే చెప్పాలి. అదేవిధంగా సాయి పల్లవి ప్రేక్షకులకు వచ్చే విధంగా చాలా మంచి పాత్రలు సెలెక్ట్ చేసుకుంటుంది.

  ఆ వివాదంలో సాయి పల్లవి

  ఆ వివాదంలో సాయి పల్లవి

  ఎక్కడ కూడా నెగిటివ్ కామెంట్స్ అందుకోకుండా చాలా జాగ్రత్తగా కెరియర్ ను ప్లాన్ చేసుకుంటూ వస్తున్న సాయి పల్లవి ఇటీవల మాత్రం ఒక వివాదంతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అనుకోకుండా ఆమె గో సంరక్షకుల దాడిపై ఒక కామెంట్ చేయడంతో ఒక్కసారిగా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదురయ్యాయి. అయితే అది మానవత్వం గురించి మాట్లాడే క్రమంలో ఒక విషయం గురించి చెప్పాలనుకున్నాను అంటూ చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారుని చెప్పింది. ఒకవేళ ఎవరైనా తన మాటల వలన బాధపడి ఉంటే క్షమించాలని కూడా ఆమె ఒక వివరణ ఇచ్చింది.

  మంచి స్నేహితులతో..

  మంచి స్నేహితులతో..

  సాయి పల్లవి సినిమాలు ఫ్యామిలీ తప్పితే మరే ఇతర విషయాల పై పెద్దగా మాట్లాడింది లేదు. చాలావరకు ఆమె తన అతికొద్ది మందు స్నేహితుల సమక్షంలోనే హాలిడేస్ లలో కాలక్షేపం చేస్తూ ఉంటుంది. అంతే కాకుండా ప్రకృతిని ఆస్వాదించే ప్రదేశాలను కూడా ఆమె ఎక్కువగా సందర్శిస్తూ ఉంటుంది. స్నేహితులకు కూడా ఆమె ఎంతో ప్రాధాన్యత ఇస్తారట. ప్రస్తుతం ఆమెకు ఉన్న స్నేహితులలో కొంతమంది మధ్యతరగతి వారే.

  గంగవ్వతో ఇంటర్వ్యూ

  గంగవ్వతో ఇంటర్వ్యూ

  అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి తన చిన్ననాటి కొన్ని అల్లరి పనులను కూడా గుర్తు చేసుకుంది. విరాటపర్వం సినిమా ఈనెల ఒకటి నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే సినిమా ఓటీటీలో విడుదలవుతున్న సందర్భంగా ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. ఆ ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో గంగవ్వ సమక్షంలో నిర్వహించారు.

  స్కూల్ లో లవ్ లెటర్

  స్కూల్ లో లవ్ లెటర్

  అయితే సినిమాలో ఎన్నో లేఖలు రాసిన నువ్వు నిజ జీవితంలో ఏవైనా ప్రేమలేఖలు రాసావా అని గంగవ్వ అడిగినప్పుడు సాయి పల్లవి చాలా ఓపెన్ గా తన చిన్ననాటి ప్రేమ గురించి తెలియజేసింది. ఏడవ తరగతిలో ఒక అబ్బాయికి నేను లవ్ లెటర్ రాసినప్పుడు ఇంట్లో దొరికిపోయాను అని.. ఆ లెటర్ చూసిన తర్వాత ఇంట్లో వాళ్ళు నన్ను చితకబాదినట్లుగా ఆమె నవ్వుకుంటూ ఆ విషయాన్ని తెలియజేసింది. ఇక సాయి పల్లవి మనసును దోచేసిన ఆ పిల్లవాడు ఎవరో కానీ చాలా అదృష్టవంతుడు అని నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

  English summary
  Actress Sai pallavi about her first love issue in family..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X