అలా మరణించే ఛాన్స్ వస్తే అంతకంటే అదృష్టమా? సమంత షాకింగ్ కామెంట్
అక్కినేని నట వారసుడు నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత రుత్ ప్రభుపై సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్ జరుగుతుండటం తెలిసిందే. అయితే తనపై కామెంట్ చేసే నెటిజన్లకు దిమ్మతిరిగే సమాధానం ఇస్తూ సమంత అభిమానులను ఆకట్టుకొంటున్నది. తాజాగా ఓ నెటిజన్ కామెంట్ చేయగా సమంత జవాబు ఇచ్చిన తీరు ఆకట్టుకొంటున్నది. ఈ సమంత ట్వీట్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
పెంపుడు కుక్క సాషా గురించి
పలు సినిమాల షూటింగుల బిజీ మధ్య సమంత రుత్ ప్రభు తన పెంపుడు కుక్కలతో ఆడుకొంటూ ఫోటోను షేర్ చేసింది. తన పెంపుడు కుక్క సాషాను అల్లారుముద్దుగా చూసుకొంటూ కనిపించింది. ఇన్స్‌టాగ్రామ్‌లో చేసిన పోస్టుకు మంచి ఆదరణ లభించింది. అయితే ఓ తింగరి మాత్రం ఆమెను టార్గెట్ చేస్తూ తన నోటిదురుసును మెసేజ్ ద్వారా బయటపెట్టుకొన్నాడు.

నీ జీవితం అలానే ముగిసిపోతుంది అంటూ
తన పెంపుడు కుక్క సాషాతో ఉన్న ఫోటోపై స్పందిస్తూ.. సమంత జీవితం కుక్కలు, పిల్లలతో గడుపుతూ ఒంటరిగానే ముగిసిపోతుంది అని కామెంట్ చేశాడు. అయితే తనను ఉద్దేశించి చేసిన కామెంట్‌పై సమంత తనదైన శైలిలో స్పందించింది. అలా ఒంటరిగా మరణించే ఛాన్స్ వస్తే అంతకంటే అదృష్టం ఏముుంటుంది అని సమంత గట్టిగా బుద్ది చెప్పింది.

మెసేజ్‌ను డిలీట్ చేసిన నెటిజన్
అయితే సమంతను టార్గెట్‌గా చేసుకొని చేసిన కామెంట్‌పై కొందరు నెటిజన్లు విరుచుకుపడ్డారు. దాంతో తాను చేసిన మెసేజ్‌పై వ్యతిరేకత పెరుగుతున్న క్రమంలో ఆ నెటిజన్ తన మెసేజ్‌ను డిలీట్ చేశాడు. అయితే మరో నెటిజన్ డిలీట్ చేసిన మెసేజ్‌ను స్క్రీన్ షాట్ తీసి ట్రోలర్‌ను గట్టిగా బుద్ది చెప్పాడు.

సమంత పరిణతి భేష్..
తనను ట్రోల్ చేసిన నెటిజన్‌పై కోపం ప్రదర్శించకుండా సహనం చూపడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మా అభిమాన నటిలో చాలా పరిణతి కనిపిస్తున్నది. సంయమనం విషయంలో గొప్ప స్థాయికి చేరుకొన్నది. తన గురించి దుష్ప్రచారం చేయడంపై మండిపడ కుండా ఉండటం ఆమె గొప్ప లక్షణం అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

అప్పటి సమంత వేరు..
నాగచైతన్యతో విడాకుల తర్వాత సోషల్ మీడియాలో చాలా సహనంతో కనిపిస్తున్నారు. వివాదాస్పద అంశాలకు తావివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. 2012లో చూసిన సమంత వేరు.. 2022లో చూసే సమంత డిఫరెంట్. ఆకాశానికి నేలకు ఉన్న అంతరం ఆమెలో కనిపిస్తున్నది అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

సమంత రుత్ ప్రభు కెరీర్ ఇలా...
సమంత రుత్ ప్రభు కెరీర్ విషయానికి వస్తే.. ఆమె నటించిన కథువాకులా రెండు కాదల్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమె నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. యశోద, ఖుషీ షూటింగులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నది.


Click it and Unblock the Notifications











