వర్షంలో తడుస్తూ.. ఆ కోరిక తీర్చుకోవాలని ఉంది... సీరత్ కపూర్ మనసులో మాట..
రన్ రాజా రన్ చిత్రంతో గ్లామర్ పంట పండించిన సీరత్ కపూర్ టాలీవుడ్ నంబర్ గేమ్‌లో వెనుకబడినప్పటికీ.. విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకొంటున్నారు. సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటున్న ఈ భామ తన మనసులోని భావాలను భయటపెడుతుంటారు. తన సినిమాలు, ఇతర విషయాలను ఎప్పటికప్పుడూ షేర్ చేస్తుంటారు. తాజాగా వర్షకాలం ముందే రావడంతో సీరత్ కపూర్ తన సంతోషాన్ని వ్యక్తం చేసుకోవడమే కాకుండా వానలో ఎప్పుడెప్పుడూ తడిసి ముద్దవ్వాలా అనేంతగా తన భావాలను పంచుకొన్నారు.
ముంబై వాసులకు వర్షాకాలం వచ్చిందంటే ఎంత సంతోషమో మాటల్లో చెప్పలేం. వర్షాలు పడుతుంటే జీవితాన్ని ఎంతగా ఆస్వాదిస్తారో నాకు తెలుసు. అందరి మాదిరిగానే నేను కూడా వర్షాకాలం కోసం ఎదురు చూస్తున్నాను. వర్షం పడుతుంటే హాట్ హాట్‌గా జింజర్, లెమన్ గ్రాస్ చాయ్ తాగుతుంటే ఆ మజా వేరేలా ఉంటుంది అని తెలిపారు. వర్షపు జల్లలు పలకరిస్తున్నాయి. క్లాసిక్ మ్యూజిక్‌తో వేడి వేడి ఛాయ్ ఎంజాయ్ చేయాలని ఎదురు చూస్తున్నాను. నా మాదిరిగానే నా ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేయాలని కోరుకొంటున్నాను అని సీరత్ కపూర్ పేర్కొన్నారు

సీరత్ కపూర్ కెరీర్ విషయానికి వస్తే.. కోలంబస్, ఒక్కక్షణం, మా వింత గాధ వినుమా, టచ్ చేసి చూడు, రాజు గారి గది 2 చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. నసీరుద్దీన్ షా, తుషార్ కపూర్‌తో కలసిి మారిచ్అనే చిత్రంలో నటిస్తున్నారు. నటుడు తుషార్ కపూర్ తన స్వంత బ్యానర్ తుషార్ ఎంటర్‌టైనర్ హౌస్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











