For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నటిని దారుణమైన ప్రశ్న అడిగిన నెటిజన్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నటి.. జాగ్రత్త బాసూ!

  |

  ఒకప్పుడు సినిమా తారలు అలాగే వారి అభిమానుల మధ్య చాలా గ్యాప్ ఉండేది. ప్ర తిరోజు వార్తా పత్రికలలో వచ్చే వార్తలు తప్ప సినిమా సెలబ్రిటీల గురించి వారి అభిమానులకు పెద్దగా అవగాహన ఉండేది కాదు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు కూతవేటు దూరంలోనే ఉంటున్నారు. చాలా సార్లు అభిమానులతో ప్రత్యక్షంగా మాట్లాడేందుకు సినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో వేదికలుగా మారుతూ ఉండగా ఒక్కోసారి ఈ సోషల్ మీడియా వల్ల వాళ్ళు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతున్నాయి.

  తాజాగా అలాంటి పరిస్థితి ఒక వర్ధమాన నటి కి ఎదురయింది. అయితే ఆ సమయంలో కూడా ఆమె ఏ మాత్రం వెనకడుగు వేయకుండా సదరు నెటిజన్ కి బుద్ధి వచ్చేలా సమాధానం చెప్పింది. ఇంతకీ ఎవరా నటి ? ఏమిటా సమాధానం ? అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  సినిమాలతో బిజీ

  సినిమాలతో బిజీ

  నటి శ్రీవిద్య అంటే సినిమాల పరంగా పెద్దగా పరిచయం లేదు కానీ సోషల్ మీడియా అలాగే యూట్యూబ్ ఎక్కువగా ఫాలో అయ్యే వారికి ఆమె సుపరిచితురాలు.. ఒకప్పుడు చాయ్ బిస్కెట్ అనే ఒక ఛానల్ ద్వారా ఆమె అనేక వీడియోలు చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాయ్ బిస్కెట్, గర్ల్ ఫార్ములా లాంటి కాన్సెప్ట్ లతో ఆమె ప్రేక్షకులకు చాలా దగ్గర అయింది కూడా. ఈ మధ్యకాలంలో సుహాస్, చాందిని చౌదరి హీరోహీరోయిన్లుగా వచ్చిన కలర్ ఫోటో సినిమాలో సునీల్ భార్య పాత్రలో నటించి శ్రీదివ్య మెప్పించింది. అలాగే ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి లాంటి మరి కొన్ని సినిమాల్లో కూడా శ్రీవిద్య తనదైన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది.

  మల్టీ టాలెంటెడ్

  మల్టీ టాలెంటెడ్

  అలాగే చాయ్ బిస్కెట్, గర్ల్ ఫార్ములా లాంటి అనేక వీడియోలలో కనిపించిన ఆమె షణ్ముఖ్, వైష్ణవి లీడ్ రోల్స్ లో వచ్చిన సాఫ్ట్వేర్ డెవ్ లవ్ పర్ సిరీస్లో హెచ్ఆర్ మేనేజర్ పాత్రలో కూడా నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. వృత్తిరీత్యా జర్నలిస్టు అయిన శ్రీ విద్య ఉస్మానియా యూనివర్సిటీలో తన చదువు పూర్తి చేసుకుని ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి అనేక సంస్థలకు పని చేశారు.

  ప్రస్తుతం ఆమె ఒక ప్రముఖ సంస్థ లో కంటెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. కేవలం నటనకే పరిమితం కాకుండా ఆమె రచనల్లో కూడా ముందుంటారు. చాయ్ బిస్కెట్, గర్ల్ ఫార్ములా లాంటి వీడియోలు కి చాలా వీడియోలకు ఆమె కంటెంట్ అందించారు. అలాగే ఆమె మంచి గాయని కూడా, సిద్ధు జొన్నలగడ్డ, రష్మి ప్రధాన పాత్రలలో వచ్చిన గుంటూరు టాకీస్ సినిమా లో ఓ సువర్ణ పాట పాడి ప్రేక్షకులందరినీ మెప్పించారు ఆమె.

  ప్రేమ - పెళ్లి

  ప్రేమ - పెళ్లి

  ఇక ఆర్కుట్ లో పరిచయమైన అభిషేక్ మహర్షి అనే నటుడు కం డైరెక్టర్ ని శ్రీవిద్య ప్రేమించి పెళ్లాడారు. అభిషేక్ మహర్షి మహర్షి లాంటి అనేక సినిమాల్లో కనిపించగా ఇప్పుడు ఒక సినిమాతో దర్శకుడిగా కూడా మారుతున్నారు. తెలుగులో నందు హీరోగా వచ్చిన బెస్ట్ యాక్టర్ అనే సినిమా ద్వారా నటుడిగా పరిచయమైన ఆయన తర్వాత నాని హీరోగా వచ్చిన భలే భలే మగాడివోయ్, తను నేను, పైరేట్స్ 1.0, ఆ తర్వాత అజ్ఞాతవాసి, పేపర్ బాయ్, జెస్సి, మహేష్ బాబు మహర్షి సినిమాలలో సైతం నటించాడు. అయితే గత కొన్ని ఏళ్లుగా దర్శకత్వం చేయాలని ప్రయత్నాలు చేస్తున్న అభిషేక మహర్షికి ఎట్టకేలకు కాలం కలిసి రావడంతో ఆయన దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

  సంచలనం

  సంచలనం

  ఈ విషయాన్ని పక్కన పెడితే శ్రీవిద్య తాజాగా తన సోషల్ మీడియా వేదికగా చేసిన కొన్ని కామెంట్లు సంచలనంగా మారాయి. సాధారణంగా సెలబ్రిటీలు ఇంస్టాగ్రామ్ లేదా ట్విట్టర్ లో ఫ్యాన్ సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఆ ఫ్యాన్ సెషన్స్ నిర్వహిస్తూ ఉన్న సమయంలో చాలామంది తమ అభిమాన నటీనటుల పర్సనల్ విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తూ ఉంటారు.

  తస్మాత్ జాగ్రత్త

  తస్మాత్ జాగ్రత్త

  అయితే సదరు సెలబ్రిటీలు కూడా శృతి మించే అంత వరకు బాగానే సమాధానాలు ఇస్తూ ఉంటారు.. ఇక పరిస్థితి శృతి మించుతోంది అని వారికి అనిపించిన సమయంలో ఘాటుగా సమాధానం ఇవ్వడానికి కూడా ఏమాత్రం వెనుకాడరు. తాజాగా శ్రీవిద్య పరిస్థితి కూడా అలాగే తయారైంది.

  ఒక అభిమాని ఆమెను అడగకూడని ప్రశ్న అడిగి ఇబ్బంది పెట్టాడు. సాధారణంగా వేరే వాళ్ళు అయితే ఈ విషయాన్ని చాలా లైట్ తీసుకుని వదిలే వేసే వాళ్ళు ఏమో కానీ ఇలాంటి వ్యక్తులకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో శ్రీవిద్య చెప్పిన సమాధానం సదరు నెటిజన్ నోరు మూయించడమే కాక మరోసారి ఎవరూ ఇలాంటి సాహసం చేయడానికి కూడా భయపడే విధంగా ఆమె సమాధానం ఇచ్చింది.

  ఇక్కడ పేర్కొనలేని విధంగా సదరు నెటిజన్ ఆమెను ప్రశ్నించగా ఆమె కూడా అతను తల ఎత్త లేని విధంగా సమాధానం ఇచ్చింది. సో సెలబ్రిటీలు చాట్ సెషన్స్ నిర్వహిస్తున్నారు కదా అని ఏది పడితే అది మాట్లాడితే అందరూ సైలెంట్ గా తీసుకుని వదిలేయరు. కొందరు ఇలా సమాధానం చెప్పడమే కాక ఐడీలను సైతం బహిర్గతం చేస్తే పరువులు పోగొట్టుకోక తప్పని పరిస్థితులు ఏర్పడతాయి జాగ్రత్త.

  English summary
  srividya p appeared in Telugu film color photo, On a fan-interaction session on Instagram An abuser asked actress and abusing question, the actress gave a stunning reply.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X