»   » మీ టూ: కోరిక తీర్చమన్న అతడికి అదితి రావు హైదరి షాక్!

మీ టూ: కోరిక తీర్చమన్న అతడికి అదితి రావు హైదరి షాక్!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  #మీ టూ ఉద్యమం బాలీవుడ్ చిత్ర సీమను కుదిపేస్తోంది. పలువురు నటీమణులు, సినిమాల్లో ఇతర విభాగాల్లో పని చేసే మహిళలు తమకు ఎదురైన లైంగిక వేధింపుల సంఘటనల గురించి గుర్తు చేసుకుంటూ సంచలనాలకు తెరలేపుతున్నారు. నానా పాటేకర్ మీద తనుశ్రీ దత్తా ఆరోపణల పర్వం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో చాలా మంది ధైర్యంగా ముందుకు వచ్చి నోరు విప్పుతున్నారు. తాజాగా హీరోయిన్ అదితి రావు హైదరి తనకు ఎదురైన లైంగిక వేధింపుల సందర్భం గురించి వెల్లడించారు.

   బాలీవుడ్లో స్ట్రగల్ అవుతున్న రోజుల్లో

  బాలీవుడ్లో స్ట్రగల్ అవుతున్న రోజుల్లో

  బాలీవుడ్లో సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ స్ట్రగుల్ అవుతున్న రోజుల్లో తాను కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని, కాస్టింగ్ కౌచ్ లాంటి సంఘటనలు ఫేస్ చేశానని అదితి రావు హైదరి తెలిపారు.

  వాటిని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు

  వాటిని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు

  స్టార్ కిడ్స్ కంటే బయటి నుండి వచ్చిన వారికి కాస్టింగ్ కౌచ్ లాంటి సంఘటనలు ఎక్కువ ఎదురవుతాయా? అనే ప్రశ్నకు అదితి రావు స్పందిస్తూ... ‘నేను నా గురించి, నా అనుభవాల గురించి మాత్రమే మాట్లాడతాను. కొత్త వారు ఇక్కడ ఎదగడం చాలా కష్టం... అలా అని అసాధ్యం అయితే కాదు. అందుకు నేనే ఒక ఉదాహరణ. ఇక్కడ ఎదురయ్యే పరిస్థితులను ఎలా డీల్ చేశామన్నదానిపైనే మన కెరీర్ ఆధారపడి ఉంటుందని అదితి రావు తెలిపారు.

  కోరిక తీర్చమన్నాడు, మూడు వదిలేశా

  కోరిక తీర్చమన్నాడు, మూడు వదిలేశా


  బాలీవుడ్ ఇండస్ట్రీలో స్ట్రగుల్ అవుతున్న రోజుల్లో ఓసారి బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఎదురైంది. కోరిక తీరిస్తే మూడు సినిమాల్లో అవకాశం ఇస్తామన్నారు. వెంటనే వద్దనుకుని వచ్చేశాను. నేను ఇండస్ట్రీకి కొత్తే కానీ, అలాంటి వాటికి కాంప్రమైజ్ అయ్యేలా నేను పెరగలేదు. దేనికీ లొంగకుండా సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకుంటూ ముందుకు వెళ్లాను అని అదితి రావు తెలిపారు.

  మహిళలకు సినిమా ఇండస్ట్రీ సేప్ కాదు అనేది నిజం కాదు

  మహిళలకు సినిమా ఇండస్ట్రీ సేప్ కాదు అనేది నిజం కాదు

  సినిమా ఇండస్ట్రీ మహిళలకు సేఫ్ కాదు అనే అపోహ తొలగిపోవాలి. సినిమా ఇండస్ట్రీ అయినా, మరే ఇండస్ట్రీ అయినా డిఫరెంట్ మైండ్‌సెట్ ఉన్న మనుషులు ఉంటారు. అందులో మంచి వారు ఉంటారు, చెడ్డ వారు ఉంటారు అని అదితి రావు హైదరి తెలిపారు.

  అదితి రావు హైదరి

  అదితి రావు హైదరి

  అదితి రావు హైదరి సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది ఆమె నాలుగు చిత్రాల్లో నటించారు. హిందీలో పద్మావత్, దాస్ దేవ్‌తో పాటు తెలుగులో ‘సమ్మోహనం' చిత్రం ద్వారా తెరంగ్రేటం చేశారు. తమిళంలో ఆమె నటించిన మరో చిత్రం తెలుగులో ‘నవాబ్' పేరుతో విడుదలైంది.

  English summary
  Recalling her days as a struggler in the film industry, Aditi Rao Hydari said: "I had one bad experience and I stepped out from that, though I had a three-film deal. I was new and naive, but I have been brought up in a way where I know how to stand for my dignity. So I let go of an opportunity if it requires me to do anything to compromise on my dignity." Aditi refused to generalise the film industry as an unsafe place for women.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more