For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Rhea Chakraborthy అమ్మకానికి మహిళలు.. ఆడవాళ్లంటే ఆటబొమ్మాలా? బాలీవుడ్ హీరోయిన్ ఫైర్

  |

  అఫ్ఘనిస్తాన్‌లో చోటుచేసుకొన్న సంక్షోభంతో ఎంతో మంది ప్రజలు నానా ఇక్కట్లకు గురి అవుతున్నారు. కాబూల్ ఎయిర్‌పోర్టులో ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతున్న తీరుకు సంబంధించిన సన్నివేశాలు హృదయాన్ని కలిచి వేస్తున్నాయి. తాలిబాన్ల దాడితో మహిళలు, పిల్లలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. యుద్ధ వాతావరణం నుంచి ప్రజలంతా పారిపోవడానికి ప్రయత్నిస్తుండటంతో అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

  Sushant Singh Rajput : సుశాంత్ కేసు లో Rhea Chakraborty పై కేసు వేసిన Sushant అభిమాని

  టెలివిజన్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఫోటోలు చూసి ప్రజలంతా తల్లడిల్లి పోతున్నారు. ఈ క్రమంలో రియా చక్రవర్తి తన సోషల్ మీడియా అకౌంట్‌లో చేసిన పోస్టు అందర్నీ ఆకట్టుకొంటున్నది. పితృస్వామ్యం, పురుషాధిక్యతపై రియా చక్రవర్తి తన పోస్టులో ఏం చెప్పారంటే..

  సినీ రచయిత తోట ప్రసాద్ కూతురు వివాహం.. హాజరైన సినీ ప్రముఖులు ఎవరంటే?

  అఫ్ఘనిస్థాన్‌లో మహిళలపై దాడులు

  అఫ్ఘనిస్థాన్‌లో మహిళలపై దాడులు

  అఫ్ఘనిస్థాన్‌లో జరుగుతున్న దాడులు, నెలకొన్న భయంకరమైన పరిస్థితుల గురించి బాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తున్నారు. అనురాగ్ కశ్యప్, స్వర భాస్కర్, రిచా చద్దా, సనమ్ పూరి, హన్సల్ మెహతా, కరణ్ థాకర్, శేఖర్ కపూర్ తదితరులు స్పందించారు. మానవత్వంపై జరుగుతున్న దాడిని చూసి సిగ్గుపడాలి అంటూ కరణ్ థాకర్ ఇన్స్‌టాగ్రామ్‌లో పేర్కొన్నారు.

  శేఖర్ కపూర్ ట్వీట్ చేస్తూ.. అఫ్ఘనిస్థాన్ ప్రజల కోసం దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. అఫ్గనిస్థాన్‌లో విధ్వంసానికి గురైంది. ప్రాచీన సంస్కృతికి మారుపేరైన ఆ దేశాన్ని నాశనం చేశారు అంటూ అన్నారు. ఇలాంటి పరిస్థితులపై రియా చక్రవర్తి కూడా స్పందించారు.

  Bigg boss 5 Telugu: కంటెస్టెంట్ గా రానున్న TV9 యాంకర్ ప్రత్యూష.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్

   పురుషాధిక్యతపై రియా చక్రవర్తి

  పురుషాధిక్యతపై రియా చక్రవర్తి

  పితృస్వామ్యం, పురుషుల ఆధిపత్య పోరాటంపై మొదటి నుంచి రియా చక్రవర్తి తన గొంతును బలంగా వినిపిస్తున్నది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో పోలీసులు ముందు విచారణకు హాజరైన సమయంలో కూడా patriarchy అంటూ ముద్రించిన టీషర్ట్‌ను ధరించి కనిపించారు. పురుషాధిక్యత అంతరించాలంటూ నినాదాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. సుశాంత్ కేసులో ఆమె ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి అత్యంత వివాదంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా అఫ్ఘనిస్తాన్‌లో మహిళలపై జరుగుతున్న దాడిని సోషల్ మీడియా ద్వారా ఖండించారు.

  బోల్డు షోలో బౌండరీలు దాటిన మాళవిక శర్మ: ఒంటి మీద బట్టలు నిలవనంటున్నాయా ఏంటి!

  అఫ్ఘన్‌లో అమ్మకానికి మహిళలు

  అఫ్ఘన్‌లో అమ్మకానికి మహిళలు

  ప్రపంచవ్యాప్తంగా సమాన హక్కులు, పని విషయంలో పురుషులకు సమానం వేతనాలు, పారితోషికాలు చెల్లించాలని ఓ వైపు మహిళలు పోరాటం చేస్తుంటే.. అఫ్గనిస్తాన్‌లో మహిళల పరిస్థితి మరీ దారుణంగా మారిపోయింది. ఆఫ్ఘనిస్థాన్‌లో అమ్మాయిలు, మహిళలు ఆటబొమ్మలుగా అమ్ముడుపోతున్నారు. అఫ్ఘనిస్తాన్‌లో మహిళలు, మైనారిటీల పరిస్థితి చూస్తే గుండె పగిలిపోతున్నది అంటూ రియా చక్రవర్తి తన ఇన్స్‌టాగ్రామ్ పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారు.

  Evaru Meelo Koteeswarulu సెట్స్‌లో తారక్, చరణ్ ఇలా: ఇద్దరు స్టార్లూ ఒకేలా.. వాళ్ల ముఖాల్లో అది గమనించారా!

  దేశాధినేతలు.. మానవత్వంపై దాడి

  దేశాధినేతలు.. మానవత్వంపై దాడి

  అఫ్ఘనిస్థాన్‌లో జరుగుతున్న మారణహోమాన్ని, మానవ హక్కుల ఉల్లంఘన, దాడులపై వివిధ దేశాల్లోని నేతలు మానవత్వంతో స్పందించాలి. #smashthepatriarchy (మగవాళ్ల ఆధిపత్యం లేదా పితృస్వామ్యం అంతరించాలి) హ్యాష్ ట్యాగ్‌ను షేర్ చేస్తూ.. మహిళలకు కూడా మనుషులే. ఈ విషయంపై ప్రపంచ దేశాధినేతలు దృష్టి పెట్టి.. ఈ సంక్షోభాన్ని తొందరగా పరిష్కరించాలి. మహిళలపై జరుగుతున్న దాడులను కట్టడి చేయాలి అంటూ తన పోస్టులో రియా చక్రవర్తి పేర్కొన్నారు.

  అమితాబ్ బచ్చన్‌తో కలిసి రియా చక్రవర్తి

  అమితాబ్ బచ్చన్‌తో కలిసి రియా చక్రవర్తి

  రియా చక్రవర్తి వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలకు వస్తే.. సుశాంత్ కేసులో ఇరుక్కుపోయిన బాలీవుడ్ హీరోయిన్ ఇప్పుడిప్పుడే కోలుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియాలో అప్పడప్పుడు ఎమోషనల్‌గా స్పందిస్తున్నారు. ఇక కెరీర్ పరంగా చూస్తే.. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్, ఇమ్రాన్ హష్మీతో కలిసి చెహ్రే అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇంకా పలు సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.

  English summary
  Bollywood actor Rhea Chakraborty Emotional note on Women in Afghanistan situation. She wrote in her instagram that, While women around the globe fight for pay parity, women in Afghanistan being sold...They have become the pay. Heartbroken to see the condition of women and minorities in Afghanistan.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X