సోషల్ మీడియాలో ఐశ్వర్యరాయ్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క లక్కీ పర్సన్.. ఎవరంటే?
సినిమా వరల్డ్ లోకి ఎంత అందమైన హీరోయిన్స్ వచ్చినా కూడా ఎప్పటికి మరచిపోని వారు కొంతమంది మాత్రమే ఉంటారు. ఇక అలాంటి బ్యూటీఫుల్ హీరోయిన్స్ లలో ఐశ్వర్యారాయ్ ఒకరు. ఆమె ఎలాంటి సినిమా చేసినా కూడా గ్లామర్ కోసం వచ్చే జనాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక ప్రస్తుతం ఐశ్వర్యారాయ్ కు సంబంధించిన ఒక టాపిక్ ఇంటర్నెట్ వరల్డ్ లో వైరల్ అవుతోంది. ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఒక ఒక్క వ్యక్తిని ఫాలో అవుతున్నారు.

అందానికి మరో అర్థం అనేలా
ఐశ్వర్యారాయ్ అంటే తెలియని సినీ లవర్స్ ఉండరేమో. అందంలో అయినా నటనలో అయినా ఆమె ఆల్ రౌండర్ అని చెప్పవచ్చు. అందానికి మరో అర్థం అని కూడా చెప్పవచ్చు. మిస్ వరల్డ్ గా కూడా కిరీటాన్ని అందుకున్న ఐశ్వర్య అనంతరం అతి తక్కువ కాలంలోనే అగ్ర హీరోయిన్ గా గుర్తింపు అందుకుంది.

నాలుగు పదుల వయసులో కూడా
దాదాపు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్స్ అందరూ కూడా ఆమెతో నటించారు. నాలుగు పదుల వయసులో కూడా ఐశ్వర్యారాయ్ పాతికేళ్ల అమ్మాయిలానే దర్శనమిస్తోంది. ఇక ఆమె అదృష్టం ఏమిటో గాని ఎక్కడ కనిపించినా కూడా కెమెరాలన్ని కూడా ఆమె వైపే తిరుగుతుంటాయి. అందంతో ఆమెకి ఎవరు పోటీ రారని అనిపిస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తుంటారు.

ఇన్స్టాగ్రామ్ లో భారీగా ఫాలోవర్స్
ఇక సోషల్ మీడియాలో ఆమె చాలా బ్యాలెన్స్ తో పోస్టులు చేస్తుంటారు. ఎక్కువగా ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలను మాత్రమే పోస్ట్ చేస్తుంటారు. ఆమె ఇన్స్టాగ్రామ్ లో కూతురు ఆరాధ్య, భర్త అభిషేక్ బచ్చన్, మామ అమితాబ్ బచ్చన్ ఫొటోలు చాలానే ఉంటాయి. ఐశ్వర్యారాయ్ ఇన్స్టాగ్రామ్ లో కు 9.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

ఐశ్వర్యారాయ్ ఫాలో అయ్యే ఒకే ఒక్క వ్యక్తి
ఇక అంతమంది ఫాలోవర్స్ ఉన్నప్పటికీ ఐశ్వర్యారాయ్ మాత్రం ఒకే ఒక్క వ్యక్తిని ఫాలో అవుతుండడం విశేషం. స్టార్ సెలబ్రెటీలను ఎవరిని కూడా ఫాలో అవ్వడం లేదు. ఇక ఆ లక్కీ పర్సన్ ఎవరంటే.. ఆమె భర్త అబిషేక్ బచ్చన్. 2007లో వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక 2011లో వీరికి కూతురు ఆరాధ్య జన్మించింది.


Click it and Unblock the Notifications











