నాగార్జునను చిన్న కోడలు ఏమని పిలుస్తుందో తెలుసా? ఇదేం వరుస!

టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున పుట్టిన రోజు వేడుకలు తాజాగా ఘనంగా జరిగాయి. నాగార్జున ఆగస్టు 29తో 66వ ఏట అడుగు పెట్టారు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జునకు అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, స్టార్స్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అక్కినేని అఖిల్ భార్య జైనాబ్ రావ్జీ కూడా కింగ్, అక్కినేని నాగార్జునకు శుభాకాంక్షలు తెలిపింది. తన మామ అక్కినేని నాగార్జునతో స్టిల్ ఇచ్చిన ఫొటోను పంచుకుంటూ బర్త్ డే విషెస్ తెలియజేసింది. అయితే ఆమె నాగార్జనను ఏమని పిలిచిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అక్కినేని యంగ్ హీరో అఖిల్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నాగార్జున చిన్న కోడలిగా ఆ ఇంట వెలుగులు పంచుతోంది. ఇక ఈమె వృత్తిరీత్యా ఆర్టిస్ట్. అబ్‌స్ట్రాక్ట్, ఇంప్రెషనిస్టిక్ పెయింటింగ్‌లు, పెయింటింగ్ ప్రదర్శనలకు జైనాబ్ ప్రసిద్ధి చెందింది. ఆమె 2012లో తన తొలి సేకరణ, రిఫ్లెక్షన్స్‌ను హైదరాబాద్ లోనే ప్రదర్శించింది. అప్పటి నుండి ఆమె హైదరాబాద్‌లో ప్రసిద్ధ ఇంప్రెషనిస్టిక్ కళాకారిణిగా గుర్తింపు దక్కించుకుంది. ఆర్టిస్ట్ వరల్డ్ లో తనదైన శైలిలో ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో అక్కినేని అఖిల్ తో పరిచయం ఏర్పడి పెళ్లి కూడా చేసుకుంది.

Akkineni Nagarjuna Daughter In Law Zainab Ravdjee Interesting post

ఇక అక్కినేని నాగార్జునకు జైనాబ్ రావ్జీ చిన్న కోడలు అనే సంగతి తెలిసిందే. అక్కినేని నాగచైతన్య భార్య శోభితా ధూళిపాళ్ల మొదటి కోడలు. అయితే తాజాగా అక్కినేని నాగార్జున 66వ పుట్టిన రోజు సందర్భంగా జైనాబ్ రావ్జీ ఆసక్తికరంగా విష్ చేసింది. 'మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు నాగార్జున, మీరు ప్రతిరోజూ నాకు స్ఫూర్తినిస్తూనే ఉంటారు. మాకు నిజమైన రాజు మీరే. మీరు నా తండ్రి పాత్రలో ఉన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు' అని తన పోస్ట్ లో చెప్పుకొచ్చింది. అయితే ఈతరం మామలను కూడా తండ్రులుగానే చూస్తున్నారని ఆ పోస్ట్ చూసిన నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

అక్కినేని నాగార్జునను జైనాబ్ రావ్జీ తండ్రిగా భావిస్తున్నట్టు చెప్పడంతో అక్కినేని అభిమానులు ఖుషి అవుతున్నారు. తమ అభిమాన హీరో వారి ఇంటి ఆడపడచుల పట్ల ఎంత ప్రేమ, మర్యాదగా, బాధ్యతగా ఉంటారో దీంతో అర్థం అవుతోందని చెబుతున్నారు. ఇక జైనాబ్ రావ్జీ అక్కినేని అఖిల్ పెళ్లి 2025 జూన్ 6న హైదరాబాద్ లోనే జరిగింది. వీరి పెళ్లి వేడుకకు సన్నిహితులు, అతికొద్ది మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. అంతకు ముందే అక్కినేని నాగ చైతన్య శోభితా ధూళిపాళ్లను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇక అక్కినేని నాగార్జున చివరిగా కూలి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రంలో మొదటి సారిగా విలన్ గా నటించారు. ఇక నెక్ట్స్ 100వ చిత్రంపై అప్డేట్ రావాల్సి ఉంది. ఇప్పటికే అఖిల్ ఏజెంట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నెక్ట్స్ లెనిన్ అనే చిత్రంతో అలరించేందుకు రెడీ అవుతున్నారు. నాగచైతన్య తండేల్ తో భారీ సక్సెస్ అందుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X