For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  తలకు పొగరెక్కలేదు.. నేల మీదే ఉన్నాను.. RRR సీత షాకింగ్ కామెంట్స్

  |

  బాలీవుడ్‌లో అద్భుతమైన పాత్రలతో అలియాభట్ దూసుకెళ్తున్నారు. రాజీ, గల్లీబాయ్ తదితర చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొన్న ఈ బ్యూటీ ప్రస్తుతం RRRలో నటిస్తున్నది. ఈ సినిమా తాజా షెడ్యూల్‌లో భాగమైంది. వరుస సక్సెస్‌లతో ప్రయాణిస్తున్న అలియా ఇటీవల బాలీవుడ్ మీడియాతో సంభాషించారు. తన కెరీర్, వ్యక్తిగత విషయాల గురించి మీడియాతో పంచుకొన్నారు. ఆమె ఏమన్నారంటే..

  విజయాలతో మరింత బాధ్యత పెరిగింది

  విజయాలతో మరింత బాధ్యత పెరిగింది

  నా సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడంతో నాకు బాధ్యత పెరిగింది. ఆడియెన్స్ నా గురించి ఎక్కువగా ఆశిస్తున్నారనే విషయం అర్ధమైంది. విజయాల తర్వాత ఎక్కువగా ఆశించి థియేటర్‌కు వస్తారని విషయం నన్ను మరింత అలర్ట్‌ చేసింది. నా భుజాలపై ఇంత బరువైన బాధ్యత ఉండటం చాలా సంతోషంగా ఉంది అని అలియా భట్ అన్నారు.

  రెండేళ్లలో నా ఆలోచన మారింది

  రెండేళ్లలో నా ఆలోచన మారింది

  నేను నటించిన సినిమాలు విజయం సాధించడం వల్ల కలిగిన ఉత్సాహంతో ముందుకెళ్తున్నాను. అందుకే చాలా సెలెక్టివ్‌గా, నాకు మరింత పేరు తెచ్చే పాత్రలనే ఎంచుకొంటున్నాను. ఇప్పుడు నా కెరీర్‌పై నాకు పూర్తి అవగాహన ఏర్పడింది. గతంతో పోల్చుకుంటే నా యాటిట్యూడ్ మారింది. గత రెండేళ్లతో పోల్చితే, ప్రేక్షకుల అంచనాలను దృష్టిలో పెట్టుకొని మరింత శ్రమిస్తున్నాను అని అలియాభట్ పేర్కొన్నారు.

  ఫెయిల్యూర్‌తో జీవిత పాఠాలు నేర్చుకొన్నా

  ఫెయిల్యూర్‌తో జీవిత పాఠాలు నేర్చుకొన్నా

  నా ఫెయిల్యూర్ నాకు మంచి గుణపాఠం నేర్పాయి. ప్రతీ వైఫల్యం నాకు జీవితంలో పాఠాలుగా మారాయి. విజయాల కంటే ఫెయిల్యూర్ వల్లనే బాగా నేర్చుకొన్నాను. నా విజయానికి కారణం నా ఫ్రెండ్స్, స్నేహితులు మాత్రమే. విజయాలతో పొంగిపోకుండా నేల మీద ఉండేలా ఆ పాఠాలు ఉపయోగపడ్డాయి అని అలియా చెప్పారు.

  సక్సెస్ తలకు ఎక్కించుకోవద్దు

  సక్సెస్ తలకు ఎక్కించుకోవద్దు

  నాకు వరుస విజయాలు లభించిన నేపథ్యంలో సక్సెస్‌ను తలకు ఎక్కించుకోకు అని దర్శకుడు ఆయన్ ముఖర్జి ఆటపట్టిస్తుంటాడు. కాళ్లకు ఏదైనా కట్టుకో.. విజయ గర్వంతో ఎగిరిపోకుండా ఉంటావు. నా సినిమాల రిలీజ్ రోజున చాలా ఆందోళన పడేదాన్ని. ఇప్పుడు ఆ భయం ఉండటం లేదు. కష్టపడి పనిచేశాం. ఫలితం దానంతట అదే వస్తుందని ధైర్యంగా ఉంటాను.

  సోలో హీరోయిన్ పాత్రల్లో

  సోలో హీరోయిన్ పాత్రల్లో

  చమేలి, గుప్త్, మృత్యుదండ్ లాంటి సోలో హీరోయిన్ కథా చిత్రాల్లో నటించాలని ఉంది. మృత్యుదండ్ సినిమాలో మాధురి దీక్షిత్ నటన చూస్తే మతిపోతుంది. ఇప్పటికీ నటించాలనే తపన ఆమెలో చూస్తే స్ఫూర్తిగా ఉంటుంది. చాలా మంది తారలకు ఆ తరం హీరోయిన్లు స్ఫూర్తిగా నిలుస్తున్నారు అని అలియాభట్ అన్నారు.

  RRR మూవీలో సీతగా

  RRR మూవీలో సీతగా

  కళంక్, బ్రహ్మస్త్ర, తఖ్త్ లాంటి చిత్రాలతో బిజీగా ఉన్న అలియాభట్ టాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. రాజమౌళి రూపొందించే RRR చిత్రంలో రాంచరణ్ జోడిగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రాంచరణ్ నటిస్తుండగా, ఆయన ప్రేయసిగా సీత పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. కొద్ది రోజుల క్రితమే RRR చిత్ర షూటింగ్‌లో భాగమయ్యారు.

  English summary
  Bollywood actress Alia Bhatt on big success race. She said, nothing teaches you more than failure. But for me, I have had one failure and that did teach me a lot. My successes have taught me a lot more. I also give a lot of credit to my family and friends.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more