For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సమంతను లైట్ తీసుకున్న టాలీవుడ్ హీరోలు.. ఆ ఒక్క హీరో మాత్రమే చెప్పడంతో, హగ్స్ అంటూ సామ్ కామెంట్స్!

  |

  నాగచైతన్యతో విడాకుల అనంతరం కెరీర్‌లో వేగాన్ని పెంచిన సమంత వరుసపెట్టి సినిమాలు అనౌన్స్ చేస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత తాజాగా ఓ హాలీవుడ్ సినిమాకు కూడా గ్రీన్ సింగల్ ఇచ్చింది. అయితే ఈ సినిమా ప్రకటించిన విషయంలో ఆమెకు టాలీవుడ్ నుంచి కేవలం ఒకే హీరో విష్ చేయడం సంచలనంగా మారింది.

  హాలీవుడ్‌ చిత్రంలో

  హాలీవుడ్‌ చిత్రంలో


  గత కొద్దిరోజులుగా సమంత ఓ హాలీవుడ్ చిత్రంలో నటించబోతోంది అంటూ సోషల్ మీడియా వేదికగా పలు వార్తలు హల్ చల్ చేశాయి. ఇక వాటిని నిజం చేస్తూ సమంత ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ వేదికగా ఆ వివరాలను తెలియజేసింది. 'ఓ బేబీ' సినిమా నిర్మించిన సునీత తాటి నిర్మాతగా, హాలీవుడ్ డైరెక్టర్ ఫిలిప్ జాన్ దర్శకత్వం వహించనున్న 'అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్' అనే హాలీవుడ్‌ చిత్రంలో సమంత నటించనుంది.

  అదే భయాన్ని ఫీల్ అయ్యా

  అదే భయాన్ని ఫీల్ అయ్యా

  'Arrangements Of Love' అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో 27 ఏళ్ల బైసెక్సువల్ తమిళ అమ్మాయి‌గా సామ్ కనిపించనుంది. సమంత తన మొదటి గ్లోబల్ సినిమా గురించి చెబుతూ.. "సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నా.. నేను చివరిగా 2009లో 'ఏ మాయ చేశావే' సినిమా కోసం ఆడిషన్ చేశాను. 12 సంవత్సరాల తర్వాత, మళ్లీ ఆడిషన్‌కి వెళ్లినప్పుడు, నేను అదే భయాన్ని ఫీల్ అయ్యాను. నన్ను ఎంపిక చేసినందుకు థాంక్యూ సర్" అని పేర్కొంది.

  సత్తా చాటేందుకు

  సత్తా చాటేందుకు


  లోకల్ గా, నేషనల్ గా సత్తా చాటిన సమంత అంతర్జాతీయ ప్రేక్షకులకు తన సత్తా చాటేందుకు సమంతకు ఈ 'Arrangements Of Love' నిజంగా ఒక పెద్ద అవకాశం. దీంతో ఈ సినిమా గురించి ఆమె చాలా ఉత్సాహంగా ఉంది. అయితే ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నితిన్ సమంతకు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె చేస్తున్న సినిమా పట్ల తాను సంతోషంగా ఉన్నానని చెప్పాడు. దానికి సమంత కూడా బోలెడు హగ్స్ ఇస్తానని కామెంట్ చేసింది.

  ఒక్కరు కూడా

  ఒక్కరు కూడా


  అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇతర మెయిన్ స్ట్రీమ్ హీరోలు ఎవరూ ఈ సందర్భంగా సమంతకు శుభాకాంక్షలు చెప్పకూడదని నిర్ణయించుకున్నారనిపిస్తోంది. ఎందుకంటే నితిన్ మినహా ఒక్కరు కూడా విష్ చేయకపోవడమే. సమంత దాదాపు ప్రతి టాప్ హీరోతో మరియు కొంతమంది మధ్య స్థాయి హీరోలతో కలిసి పనిచేసింది, అయితే ఆమె తన తొలి అంతర్జాతీయ చిత్రాన్ని ప్రకటించినప్పుడు నితిన్ మినహా ఎవరూ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేయలేదు.

  ఎవరూ మాట్లాడలేదు

  ఎవరూ మాట్లాడలేదు

  కొత్త ప్రాజెక్ట్‌ల ప్రకటనలు చేసినప్పుడు ఇలా ఒకరికి మరొకరు శుభాకాంక్షలు చెప్పడం మనం తరచుగా చూస్తూనే ఉంటాం , కానీ సమంతా పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఆమె విడాకుల తర్వాత జీవితంలో ఒక రకంగా దశను ప్రారంభిస్తోంది. మరీ ముఖ్యంగా, అంతర్జాతీయ చలనచిత్రంలో ప్రవేశించిన మొదటి మెయిన్ స్ట్రీమ్ సౌత్ ఇండియన్ నటీమణుల్లో ఆమె ఒకరు. అంతటి ఘనత సాధిస్తే ఎవరూ విష్ చేయకపోవడం సంచలనంగా మారింది. మన టాప్ స్టార్స్ ఆమెకు విష్ చేసి ఉంటే బాగుండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. .

  English summary
  All Heroes Except nithin Ignored Samantha on her Hollywood debut.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X