For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Allu Arjun చేతిలో రూ.100 పెట్టిన దర్శకుడు.. రెమ్యునరేషన్ అదే అనగానే అంతా షాక్.. ఒప్పుకోక తప్పలేదు!

  |

  టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అనే ట్యాగ్స్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న అల్లు అర్జున్ రానున్న రోజుల్లో తన బ్రాండ్ ను మరింత పెంచుకోబోతున్నట్లు స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎలాంటి సినిమా చేసినా కూడా విభిన్నంగా ఉండాలని ట్రై చేస్తూ ఈ స్థాయికి వచ్చాడు. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో రెడీ అవుతున్న బన్నీకి ఒక దర్శకుడు రెమ్యునరేషన్ లాగా 100 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడు. బన్నీ కూడా ఒక ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని నిజమని చెప్పాడు. ఆ వివరాల్లోకి వెళితే..

  ఎక్కువ సమయమే పట్టింది

  ఎక్కువ సమయమే పట్టింది

  స్టైలిష్ స్టార్ గా బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి బన్నీకి కొంచెం ఎక్కువ సమయమే పట్టింది. కమర్షియల్ గా ట్రై చేసినా కూడా విభిన్నంగా ఉండాలని చూసుకుంటాడు. అల్లు అర్జున్ కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ రావడానికి కూడా చాలా సమయం పట్టింది. అల.. వైకుంఠపురములో సినిమా ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

   ఎంత మంది రిజెక్ట్ చేసినా కూడా

  ఎంత మంది రిజెక్ట్ చేసినా కూడా

  బన్నీ కెరీర్ మొదటి నుంచి కూడా కథలపై పట్టు సాదించడాన్ని అలవాటుగా చేసుకున్నాడు. ఆర్య కథను నితిన్, ప్రభాస్, రవితేజ లాంటి హీరోలు రిజెక్ట్ చేసినా కూడా బన్నీ దైర్యంగా చేశాడు. ఎలాంటి సినిమా చేసినా అందులో తన స్టైల్ ను పూర్తిగా మార్చేసేవాడు. సినిమాకు తన నుంచి ఏం కావాలో అది పర్ఫెక్ట్ గా ఇవ్వడానికి ట్రై చేస్తాడని చాలామంది దర్శకులు చెబుతుంటారు. ఇక ఫిట్నెస్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

  బన్నీ కోసం 100 రూపాయలు

  బన్నీ కోసం 100 రూపాయలు

  ఇక బన్నీ 100 రూపాయల రెమ్యునరేషన్ స్టోరీలోకి వెళితే చిన్నప్పుడు మెగా ఫ్యామిలీ పార్టీలో అందరూ డ్యాన్స్ చేస్తుండగా అందరికంటే స్టైలిష్ గా బన్నీ మాత్రమే చేయడాన్ని అందరూ గమనించేశారు. తప్పకుండా అతనికి మంచి ఫ్యూచర్ ఉందని అక్కడికి వచ్చిన అగ్ర దర్శకులు కూడా చెప్పేశారట. ఒక దర్శకుడు అయితే ఏకంగా జేబులో నుంచి 100రూపాయలు తీసి అల్లు అర్జున్ తల్లి నిర్మల చేతిలో పెట్టారట. అదే అతని ఫస్ట్ రెమ్యునరేషన్ అడ్వాన్స్ అని కూడా అన్నారట.

   సినిమా కథ చెప్పగానే

  సినిమా కథ చెప్పగానే

  ఆ దర్శకుడు మరెవరో కాదు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు రావు. అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రికి ఆయన దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఆ సినిమా కథ చెప్పగానే అప్పట్లో బన్నీ వెంటనే ఒప్పేసుకున్నాడట. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయాన్ని అందుకుంది. దిల్ , గంగోత్రి దాదాపు ఒకే సమయంలో వారం అటు ఇటుగా విడుదల అయ్యాయి. ఆ రెండు సినిమాలు అప్పట్లో మంచి వసూళ్లను అందుకున్నాయి.

  Recommended Video

  Blockbuster Mechanic Alludu చిత్ర విశేషాలు.. ఫస్ట్ వీక్ లోనే సాలిడ్ కలెక్షన్స్ || Filmibeat Telugu
  ఆ వంద ఇంకా ఉంది..

  ఆ వంద ఇంకా ఉంది..

  ఈ విషయాన్ని ఒకసారి రాఘవేంద్రరావు సౌందర్యలహరి ప్రోగ్రామ్ లో గుర్తు చేసుకున్నారు. ఇక అల్లు అర్హున్ కి 100రూపాయలు ఇవ్వగా గంగోత్రి తన 100వ సినిమా కావడం విశేషమని రాఘవేంద్రరావు వివరణ ఇచ్చారు. ఇక బన్నీ దానికి కామెడీగా ఇంకా నయం 200 రూపాయలు ఇవ్వలేదు.. ఎప్పుడు చేసేవాన్నో? అంటూ పంచ్ వేశాడు. ఆ 100రూపాయల నోటును మా అమ్మ ఇంకా అలానే దాచుకుందని కూడా బన్నీ వివరణ ఇచ్చారు. ఇక గంగోత్రి సినిమా అనంతరం బన్నీకి వెంటనే ఆర్య ఆఫర్ రావడంతో అక్కడి నుంచి అతను తిరిగి చూడలేదు.

  English summary
  A director has given an advance of Rs 100 as remuneration to Bunny, who is currently getting ready with the Pan India project. Bunny also said that in an interview. Going into those details
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X