Don't Miss!
- News
ఢీ అంటే ఢీ అంటున్న రెండు పవర్ సెంటర్లు?
- Finance
Home Loan: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త టాక్స్ సిష్టం బెటరా..? పాతదే మేలా..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Sports
INDvsAUS : ఈ మూడు విషయాలే సిరీస్ విజేతను నిర్ణయిస్తాయి..!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Amy jackson తో బ్రేకప్.. లవ్ ఫెయిల్యూర్‌ను తట్టుకోలేకపోయా.. మాజీ ప్రియుడి ఆవేదన
మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది బ్రిటీష్ భామ అమీ జాక్సన్. హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. ఏక్ దివానా థా సినిమాలో తనతో కలిసి నటించిన బాలీవుడ్ హీరో ప్రతీక్ బబ్బర్‌తో కొంత కాలం డేటింగ్ చేసింది. ఆ తర్వాత అతడికి బ్రేకప్ చెప్పేసింది. అమీతో విడిపోయిన తర్వాత తన కెరీర్ నాశనమైందని తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ప్రతీక్ ఆవేదన వ్యక్తం చేశాడు.

అమీతో బ్రేకప్ తర్వాత కెరీర్ డౌన్
2011లో `ఏక్ దివానా థా` సినిమా షూటింగ్ సమయంలోనే ప్రతీక్, అమీ ప్రేమలో పడ్డారు. కొంతకాలం సహజీవనం కూడా చేశారు. అయితే వారి ప్రేమ ఎంతో కాలం సాగలేదు. ఒక్క ఏడాదిలోనే వారిద్దరూ విడిపోయారు. 2012లో వారిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ ఆ బ్రేకప్ అనంతరం కెరీర్‌లో బ్యాడ్ టైమ్ స్టార్టయిందని ప్రతీక్ పేర్కొన్నాడు. డిప్రెషన్‌లోకి కూడా వెళ్లినట్టు తాజాగా ఓ కార్యక్రమంలో ప్రతీక్ చెప్పాడు. అమీతో బ్రేకప్ తర్వాత తనకు ఏదీ కలిసి రాలేదని, కెరీర్లో డౌన్ ఫాల్ మొదలైందని చెప్పుకొచ్చాడు.

వెంటనే బ్రేకప్
బ్రేకప్ తర్వాత అమీతో మాటల్లేవు..`తొలి సినిమా సమయంలోనే ప్రేమలో పడడంతో గందరగోళం మొదలైంది. వెంటనే బ్రేకప్ జరిగింది. 25 సంవత్సరాల వయస్సులో లవ్ ఫెయిల్యూర్‌ను తట్టుకోలేకపోయా. కెరీర్‌పరంగా, ప్రేమపరంగా చాలా ఇబ్బంది పడ్డాను. చాలా ఫెయిల్యూర్స్‌ని చూశా. బ్రేకప్ తర్వాత మేం టచ్‌లో లేము. ఆమెతో నేను స్నేహంగా ఉండలేనని కాదు. అది అసాధ్యమని కూడా అనుకోను. కానీ ఆ తర్వాత ఎందుకో మేం మాట్లాడుకోలేద`ని ప్రతీక్ చెప్పాడు.

వరుస సినిమాలో బిజీ అయిన అమీ
బ్రేకప్ తర్వాత కెరీర్ విషయంలో ప్రతీక్ ఇబ్బందులు ఎదుర్కొంటే అమీ మాత్రం వరుస అవకాశాలు అందుకుంది. `మదరాసు పట్టణం` సినిమాతో తమిళ చిత్ర సీమకు పరిచయమైంది. ఆ తర్వాత `ఐ`, `2.0`, తెలుగులో `ఎవడు` వంటి సినిమాల్లో నటించింది. కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే బ్రిటన్ వ్యాపారవేత్త జార్జ్ పనాయొటోతో ప్రేమలో పడింది. అతడితో డేటింగ్ చేస్తున్న సమయంలోనే గర్భం దాల్చింది. ఆ తర్వాత అతడితో నిశ్చితార్థం చేసుకుని పెళ్లికి రెడీ అయింది.

తల్లయ్యాక బ్రేకప్.. మరొకరితో ప్రేమ
ఓ మగబిడ్డకు జన్మనిచ్చి `ఆండ్రూ` అని పేరు పెట్టుకున్న అమీ జాక్సన్ తన బాయ్‌ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పేసింది. ఎంగేజ్‌మెంట్ కూడా జరిగి పెళ్లికి సిద్ధమవుతున్న తరుణంలో ఇద్దరూ విడిపోయారు. జార్జ్ నుంచి విడిపోయిన తర్వాత అమీ ఓ బ్రిటీష్ నటుడితో ప్రేమలో పడిందట. ఎడ్ వెస్ట్విక్ అనే నటుడితో అమీ ప్రేమాయణం సాగిస్తోందట. గతేడాది డిసెంబర్‌లో సౌదీ అరేబియాలో జరిగిన ఓ ఫిల్మ్ ఫెస్టివల్‌లో వీరిద్దరూ కలుసుకున్నారని, అప్పట్నుంచి సీక్రెట్ డేటింగ్‌లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.
Recommended Video


సోషల్ మీడియాలో అందాల విందు..
సోషల్ మీడియాలో అమీ జాక్సన్ ఎంత యాక్టివ్‌గా ఉంటోందో తెలిసిందే. రెగ్యులర్‌గా తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో అమీ గ్లామర్ ట్రీట్‌తో రచ్చ చేస్తుంటుంది. ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత కూడా అమీ తన హాట్ ఫొటోలను షేర్ చేయడం మానలేదు. రెగ్యులర్‌గా హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.