Amy Jackson కాబోయే భర్తకు బ్రేకప్.. పెళ్లికాకుండానే తల్లిగా.. వివాదాస్పద నటుడితో సహజీవనం!

అందం, అభినయంతోపాటు వివాదాలతో ఎప్పుడూ మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షించే బ్రిటీష్ భామ అమీ జాక్సన్ మరోసారి ప్రేమలో పడింది. అయితే పెళ్లి కాకుండానే పిల్లాడిని కన్న ఈ బ్యూటీ ఇప్పుడు కాబోయే భర్తకు షాకిచ్చింది. ప్రస్తుతం అమీ జాక్సన్ సరికొత్త అఫైర్ బ్రిటన్‌తోపాటు ఇండియన్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే అమీ జాక్సన్ బ్రేకప్‌తోపాటు తాజా అఫైర్‌లో ఓ భారీ ట్విస్టు ఉంది. ఆ ట్విస్టు వివరాల్లోకి వెళితే..

నాలుగేళ్లుగా అమీ జాక్సన్ సహజీవనం

నాలుగేళ్లుగా అమీ జాక్సన్ సహజీవనం

అమీ జాక్సన్ గత నాలుగేళ్లుగా బ్రిటన్ వ్యాపారవేత్త జార్జ్ పానాయిటోతో డేటింగ్ చేస్తున్నది. పెళ్లి కాకుండానే గర్భవతి కావడంతో హడావిడిగా 2019లో నిశ్చితార్థం చేసుకొన్నారు. అయితే 2021లో వారిద్దరికి కుమారుడు జన్మిస్తే.. ఆ అబ్బాయికి అండ్రియా జాక్స్ పానాయిటూ అని నామకరణం చేశారు. అయితే వారి సహజీవనం హ్యాపీగా సాగుతుందని అనుకొంటున్న సమయంలో వారిద్దరు బ్రేకప్ చెప్పుకొన్నారనే వార్త మీడియాలో హల్‌చల్ చేసింది.

కాబోయే భర్తతో తెగ తెంపులు

కాబోయే భర్తతో తెగ తెంపులు


అమీ జాక్సన్ బ్రేకప్ వెనుక అనేక కారణాలు వినిపించాయి. అయితే అమీ జాక్సన్ పెద్దగా స్పందించలేదు. అయితే జార్జ్‌తో కలిసి ఉన్న ఫోటోలను తన ఇన్స్‌టాగ్రామ్‌ ఖాతా నుంచి తొలగించడంతో ఒక్కసారిగా బ్రేకప్‌కు బలం చేకూరింది. కానీ జార్జ్‌తో బ్రేకప్ వెనుక అసలు కారణం సౌతాఫ్రికాకు చెందిన నటుడు, గాసిప్ గర్ల్ ఫేమ్ ఎడ్ వెస్ట్‌విక్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిందని మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

నటుడు ఎడ్ వెస్ట్‌విక్‌తో అఫైర్

నటుడు ఎడ్ వెస్ట్‌విక్‌తో అఫైర్

అమీ జాక్సన్, ఎడ్ వెస్ట్‌విక్ మధ్య ప్రేమాయణం ఫిల్మ్ ఫెస్టివల్‌లో చిగురించింది. గత డిసెంబర్‌లో సౌదీ అరేబీయాలో జరిగిన రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇద్దరు కలుసుకొన్నారు. ఆ తర్వాత వారిద్దరూ అఫైర్‌లో మునిగిపోయారు. అప్పటి నుంచి జార్జ్‌తో సహజీవనానికి ముగింపు పలికింది అని బ్రిటన్ మీడియా వెల్లడించింది.

అమీ జాక్సన్ ప్రియుడిపై రేప్ ఆరోపణలు

అమీ జాక్సన్ ప్రియుడిపై రేప్ ఆరోపణలు


అయితే అమీ జాక్సన్ తాజా ప్రియుడు ఎడ్ వెస్ట్‌విక్ గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత రెండేళ్లుగా సౌతాఫ్రికా మోడల్ తమారా ఫ్రాన్స్‌స్కోనితో ఎడ్ ఉన్నాడు. కానీ ఇటీవల వారిద్దరూ బ్రేకప్ చెప్పుకొన్నారు. అయితే 2018లో తమపై రేప్‌కు పాల్పడ్డారని ముగ్గురు మహిళలు ఆరోపించారు. అయితే తనపై వచ్చిన వార్తలను ఎడ్ వెస్ట్‌విక్ ఖండించారు. ఈ క్రమంలోనే తమారా అతడికి బ్రేకప్ చెప్పింది. తమారాతో బ్రేకప్ తర్వాత అమీ జాక్సన్‌తో ఎడ్ డేటింగ్ చేయడం తెలిసిందే.

అమీ జాక్సన్ సినీ కెరీర్ ఇలా..

అమీ జాక్సన్ సినీ కెరీర్ ఇలా..

అమీ జాక్సన్‌ కెరీర్ విషయానికి వస్తే.. తమిళంలో విజయ్‌తో కలిసి మద్రాస్‌పట్నం సినిాలో నటించడం ద్వారా తమిళ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత రాంచరణ్ నటించిన ఎవడు చిత్రంలో నటించడం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయింది. అనంతరం విజయ్‌తో థెరీ, రజనీకాంత్‌, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన 2.0 చిత్రంలో నటించింది. తాజాగా కన్నడలో ది విలన్ సినిమాలో కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X