అతడితో బ్రేకప్.. లాంగ్ జర్నీ ముగిసింది.. అనసూయ ఎమోషనల్

Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తొలుత టీవీ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుని, తర్వాత సినీ రంగంలోనూ నటిగా పేరు తెచ్చుకున్నది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటుంది. సినిమాలు, టీవీ షోలు, ఈవెంట్‌లు, షాపింగ్ మాల్‌ ఓపెనింగ్‌లు ఏదైనా అనసూయ పేరు ఉంటే చాలు, అక్కడ ప్రేక్షకులు భారీగా తరలివస్తారు. ఇంత బిజీగా ఉండే అనసూయ తాజాగా తన ఓ ఎమోషన్ పోస్ట్‌తో వార్తల్లో నిలిచింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

బుల్లితెర నుంచి స్టార్ యాంకర్‌గా తన గుర్తింపును సంపాదించుకున్న వారిలో అనసూయ భరద్వాజ్ ఒకరు. జబర్దస్త్ కామెడీ షోలో యాంకర్‌గా ఆమె సత్తా చాటుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. యాంకరింగ్ తో పాటు సినిమాల్లోనూ తన టాలెంట్ ను నిరూపించుకోవడానికి అనసూయ చిన్న పాత్రల నుంచి కీలక పాత్రల్లోకి అడుగుపెట్టింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. ఈ సినిమా తర్వాత ఆమెకు సినిమాల్లో కీలక పాత్రలు అవకాశాలు దక్కించుకున్నాయి. పుష్ప, పుష్ప 2లో కూడా అనసూయ కీలక పాత్రల్లో నటించి మంచి గుర్తింపు పొందింది.

Anasuya Bharadwaj Says Mr Mahendra Has Been Relieved From His Position As Her Manager

ఇలా బుల్లి తెర నుంచి సినీ రంగంలోకి అడుగు పెట్టి అన‌సూయ భ‌రద్వాజ్‌ కు ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది. ఆమె పోషించిన విలక్షణ పాత్రలు మంచి గుర్తింపు తెచ్చాయి. ఇటీవల విడుదలైన 'అరి' చిత్రంలో ఆమె నటన విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇంత బిజీబిజీగా ఉన్న ఈ అమ్మడు సోష‌ల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరుచు తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోల‌ను షేర్ చేసే ఆమె గ్లామ‌ర‌స్ ఫీస్ట్ కూడా ఇస్తుంటుంది.

కొన్నిసార్లు ఆమె చేసే పోస్టులు నెట్టింట వైర‌ల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి పోస్ట్‌తో మ‌రోసారి అనసూయ వార్తల్లో నిలిచారు. సోష‌ల్ మీడియాలో వైర‌లవుతున్నారు. అదేంటంటే.. ఆమె త‌న మేనేజ‌ర్‌ను తొల‌గిస్తున్న‌ట్లు త‌న ప్ర‌క‌ట‌న‌లో వెల్లడించింది. ఇన్నాళ్లు త‌న‌కు మేనేజ‌ర్‌గా వ‌ర్క్ చేసిన మ‌హేంద్ర‌ను రిలీవ్ చేస్తున్నానంటూ ఆమె పేర్కొంది. ఈ సమయంలో ఇది ఇంపార్టెంట్ అంటూ ఎమోషనల్ నోట్ పెట్టింది.

"నాకు మేనేజర్‌గా సుదీర్ఘ కాలం పనిచేసిన మిస్టర్ మహేంద్ర ఇప్పుడు రిలీవ్ అవుతున్నారు. ఈ వృత్తిపరమైన ప్రయాణం నాకు ఎంతో నేర్పింది. ఇన్నాళ్ల మా అనుబంధంలో ఎన్నో విష‌యాలు నేర్చుకున్నాం. ఆయన చూపిన సమయం, కృషి, నిబద్ధతకు హృదయపూర్వక కృతజ్ఞతలు" అంటూ రాసింది. అలాగే ఇకపై ఏవైనా అధికారిక విషయాల కోసం [email protected] ద్వారా సంప్రదించాలని కూడా పేర్కొంది. పోస్ట్ చివర్లో "ఇంపార్టెంట్" అంటూ హార్ట్‌ ఎమోజీలను జోడించింది.

ఈ పోస్ట్‌తో అనసూయ తన మేనేజర్‌తో ఉన్న అనుబంధాన్ని బహిర్గతం చేసింది. ఎన్నేళ్లుగా ఆమెతో కలిసి సినిమాలు, ఈవెంట్‌లు, షూటింగ్‌లను సమన్వయం చేసిన మహేంద్ర ఇప్పుడు కొత్త దిశగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే అనసూయ ఏదైనా సోషల్ మీడియాలో పోస్టు చేస్తే.. అది ఎప్పటిలాగే వివాదానికి దారి తీసింది. కొందరు నెటిజన్లు ఆమె పోస్ట్‌పై నెగటివ్ కామెంట్లు చేశారు.

"రిలీవ్ అని అంటారెందుకు మేడమ్? రిలీవ్ చేశానని అనసూయ అనుకుంటుంది కానీ, రిజైన్ చేసి ఈ గోల నుంచి తప్పించుకున్నానని మహేంద్ర అనుకుంటాడు" అంటూ కొందరు సెటైర్లు వేశారు. "చదువు, సంస్కారం ఉన్నవాడు ఈమె దగ్గర మేనేజర్‌గా పనిచేయడు" అంటూ మరికొందరు విమర్శించారు. ఇలా మరోసారి అనసూయ సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X