Don't Miss!
- News
త్రిపురలో ముక్కోణపు పోరు- బీజేపీ ప్రత్యర్ధులుగా లెఫ్ట్-కాంగ్రెస్, తిప్రామోథా !
- Sports
Asia Cup 2023 : ఆసియా కప్ విషయంలో వాడి వేడి చర్చ.. బీసీసీఐకి పాక్ స్ట్రాంగ్ వార్నింగ్?
- Finance
SBI Q3 Result: రికార్డు లాభాలను నమోదు చేసిన స్టేట్ బ్యాంక్.. అంచనాలను తలదన్నేలా..
- Travel
ప్రపంచ స్థాయి పర్యాటక గ్రామం.. పోచంపల్లి విశేషాలు!
- Technology
బెట్టింగులు, లోన్లు అంటూ ప్రజలను వేధిస్తున్న 230 యాప్ లు బ్యాన్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఆ చేదు అనుభవాలతో.. ఆఫర్లు చేజారాయి.. ఎక్కడైనా అదే.. అనసూయ షాకింగ్ కామెంట్లు
బాలీవుడ్‌లో బంధుప్రీతి (నెపొటిజం), తమ వర్గం వారికే అవకాశాలు (ఫేవరిటిజం) లాంటి అంశాలు అత్యంత వివాదాస్పదంగా మారుతున్నాయి. హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఈ రచ్చ స్థాయి మరింత తీవ్రమైంది. అయితే టాలీవుడ్‌లో కూడా అలాంటి వివాదం ఉందనే మాట వినిపిస్తున్నప్పటికీ.. అప్పుడు ఏదో మూల నుంచి అలాంటి ఆరోపణలు వెలుగు చూస్తుంటాయి. తాజాగా ఆ వివాదాస్పద అంశాలు యాంకర్, యాక్టర్ అనసూయ నోటి నుంచి రావడం ఆసక్తిని రేపింది. వివారాల్లోకి వెళితే..

స్టార్ హీరోల కుటుంబాలకే ప్రాధాన్యం
సినిమా పరిశ్రమ ఏదైనా సినిమా నేపథ్యం ఉన్న కుటుంబాల పిల్లలకే అవకాశాలు లభిస్తాయి. స్టార్ కొడుకులు, కూతుళ్లకే దర్శకులు, నిర్మాతలు ఆఫర్లు ఇస్తుంటారనే వివాదం ఎప్పటి నుంచో కొనసాగుతున్నది. ఆ వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా అనసూయ తెలుగు చిత్ర పరిశ్రమలోని కొందరిపై పరోక్షంగా కామెంట్లు చేశారు.

బయటి వ్యక్తులకు నిరాదరణ
ఆ కారణంగా తాము అవకాశాలు కోల్పోతున్నామని సినిమా కుటుంబ నేపథ్యం లేని ప్రతిభావంతులైన నటులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తనకు కూడా అలాంటి అనుభవాలు సిని ఇండస్ట్రీలో ఎదురయ్యాయని అనసూయ వెల్లడించారు. సినీ పరిశ్రమలో కష్టించి పనిచేసే వారికి, అంకిత భావంతో కెరీర్‌పైనే ఆశలు పెట్టుకొన్న వారికి ఎన్నో చేదు అనుభవాలు ఎదురవ్వడం సహజంగానే ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

ఆ రెండింటితో అవకాశాలు కోల్పోయా
తెలుగు సినిమా పరిశ్రమలో కూడా ఫేవరిటిజం, నెపోటిజం ఉంది. ఆ కారణాల వల్ల నేను బ్రహ్మండమైన అవకాశాలు కోల్పోయాను. నాకు ఇలాంటి విషయాలు బయటకు చెప్పాలని ప్రయత్నం చేశాను. కానీ వ్యక్తిగత, సామాజిక పరిస్థితులు నన్ను అభద్రతాభావంలోకి నెట్టాయి అంటూ ఓ టెలివిజన్ షో సందర్భంగా అనసూయ వెల్లడించారు.

ఆఫర్లు చేజారడంతో
నా కెరీర్ ఆరంభంలో చేతిలోకి వచ్చినట్టే వచ్చి ఆఫర్లు చేజారిపోయాయి. అప్పట్లో నాకు ఎందుకు అలా అవుతున్నాయనే విషయం అర్ధం కాలేదు. తర్వాత నాకు వాటి వెనుక కారణాలు తెలిసాయి. కానీ ప్రతికూల పరిస్థితులు కారణంగా మౌనం వహించాల్సి వచ్చింది. కేవలం టాలీవుడ్‌లోనే కాదు అన్ని చోట్ల ఇలాంటి పరిస్థితులు కొందరికి చేదు అనుభవాలను మిగులస్తుంటాయి అని అనసూయ చెప్పారు.
Recommended Video

రంగమ్మతగా అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్
అనసూయ
కెరీర్‌ను
పరిశీలిస్తే
ఆశ్చర్యకరమైన
రీతిలో
వినోదరంగ
పరిశ్రమలోకి
ప్రవేశించారు.
మేనేజ్‌మెంట్
స్టూడెంట్‌గా
హెచ్ఆర్
కన్సల్టెంట్‌గా
చేరి..
ఆ
తర్వాత
సాక్షిలో
న్యూస్
రీడర్‌గా,
ఆ
తర్వాత
యాంకర్‌గా
పనిచేశారు.
నటిగా
సినీ
రంగంలోకి
ప్రవేశించి..
గతేడాది
రంగస్థలంలో
రంగమ్మత్త
పాత్రకు
ఫిలింఫేర్
అవార్డు
కూడా
అందుకొన్న
విషయం
తెలిసిందే.