twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    NTR 30: చర్చల్లోకి మరో సినియర్ హీరోయిన్ కూతురు.. ఈసారైనా ఒప్పుకుంటుందా?

    |

    జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి పాన్ ఇండియా సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. RRR సినిమా తో పాన్ ఇండియా మార్కెట్లో మంచి గుర్తింపును అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మరొక బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఇదివరకే జనతాగ్యారేజ్ అనే ఒక మంచి సినిమా చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తన 30వ సినిమాను అదే దర్శకుడితో చేస్తూ ఉండడంతో ఓ వర్గం ప్రేక్షకులలో అంచనాలను భారీస్థాయిలో క్రియేట్ చేసింది.

    ఇక ఈ సినిమా కథ ద్వారా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది అని ఇటీవల కొరటాల శివ తెలియజేశారు. అతి పెద్ద క్యాన్వాస్ తో వస్తున్న స్టోరీ అంటూ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే కాకుండా తన కెరీర్లో కూడా ఇది అతి పెద్ద సినిమా అవుతుంది అని కొరటాల శివ తెలియజేశారు.

    Another bollywood heroine name discussion in ntr 30 project

    అయితే ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో గత కొంత కాలంగా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. అయితే ముందుగా అలియా భట్ ను సెలెక్ట్ చేసుకోవాలని అనుకున్నారు కానీ ఆమె వివిధ కారణాల వలన రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు మరో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను ఫిక్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇది వరకే శ్రీదేవి కూతురికి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి చాలా ఆఫర్లు వచ్చాయి.

    కానీ ఏ సినిమా కూడా చేయడానికి జాన్వి ఒప్పుకోలేదు. కథ విషయంలో అయితే కాంప్రమైజ్ కానని భాష ఏదైనా సరే కథ నచ్చితేనే సినిమా చేస్తాను అని అంటోంది. ఇక ఎన్టీఆర్ 30వ సినిమా కు సంబంధించిన కథపై ఈ బ్యూటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అలాగే మరొక బ్యూటిఫుల్ హీరోయిన్ పేరు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. లైగర్ సినిమాలో నటించిన అనన్య పాండేను కూడా సంప్రదించినట్లు సమాచారం. మరి ఈ ఇద్దరిలో ఎవరు సెలెక్ట్ అవుతారో చూడాలి

    English summary
    Another bollywood heroine name discussion in ntr 30 project
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X