For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హార్ట్‌తో కలిసి ఎగిరిపోతున్నా అంటూ అనుపమ పోస్ట్: ప్రియుడిని కలవడానికే.. అతడు కూడా అక్కడే!

  |

  ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటనతో కొంత కాలంగా దక్షిణాది ఇండస్ట్రీల్లో వరుస సినిమాలు దక్కించుకుంటూ సత్తా చాటుతోంది అనుపమ పరమేశ్వరన్. 'ప్రేమమ్' అనే తెలుగు సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును అందుకుంది. తద్వారా వరుసగా ఆఫర్లను ఒడిసి పట్టుకుంది. కెరీర్ పరంగా ఎలా ఉన్నా.. వ్యక్తిగతంగా మాత్రం ఈమె తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. దీనికి కారణం భారత క్రికెటర్ జస్ప్రీత్ బూమ్రాతో లవ్ ట్రాక్ నడుపుతుందన్న వార్తలే. ఈ క్రమంలోనే తాజాగా ఈ భామ మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

  తెలుగులోకి అలా ఎంట్రీ.. వరుస సినిమాలు

  తెలుగులోకి అలా ఎంట్రీ.. వరుస సినిమాలు

  త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన ‘అఆ'తో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అనుపమ పరమేశ్వరన్. ఆ వెంటనే నాగ చైతన్య చేసిన ‘ప్రేమమ్' రీమేక్‌లోనూ నటించింది. ఈ రెండు చిత్రాల్లో మంచి పేరు రావడంతో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. ఆ సమయంలోనే ‘ఉన్నది ఒకటే జిందగీ', ‘హలో గురూ ప్రేమకోసమే', ‘కృష్ణార్జున యుద్ధం' వంటి సినిమాలు చేసింది.

  హిట్ కొట్టినా ఒక్కటి కూడా ప్రకటించలేదుగా

  హిట్ కొట్టినా ఒక్కటి కూడా ప్రకటించలేదుగా

  తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువ పేరును సంపాదించుకుంది అనుపమ పరమేశ్వరన్. అందుకే ఆమెను తమ సినిమాల్లో పెట్టుకునేందుకు దర్శక నిర్మాతలు క్యూ కట్టేవారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె చివరిగా 2019 ‘రాక్షసుడు' అనే సినిమాతో భారీ హిట్ కొట్టింది. కానీ, అప్పటి నుంచి అనూహ్యంగా ఒక్కటంటే ఒక్క సినిమానూ ప్రకటించకపోవడం గమనార్హం.

  అక్కడ మాత్రం బిజీగానే... అందరికీ కావాలి

  అక్కడ మాత్రం బిజీగానే... అందరికీ కావాలి

  తెలుగులో తక్కువ సినిమాలే చేసినా.. అనుపమ పరమేశ్వరన్ దక్షిణాదిలోని మిగిలిన భాషల్లో మాత్రం వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను అందుకుని సత్తా చాటుతోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒక్క సినిమా కూడా చేయని అనుపమ.. మలయాళంలో ‘కురుప్పు', తమిళంలో ‘తల్లి పొగతే' అనే చిత్రాల్లో నటిస్తోంది. ఇవి త్వరలోనే రిలీజ్ కానున్నాయి.

  అందులో యమ యాక్టివ్.. అన్నీ చెబుతోంది

  అందులో యమ యాక్టివ్.. అన్నీ చెబుతోంది

  వరుస ఆఫర్లతో బిజీ బిజీగా గడుపుతోంది గ్లామరస్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. అయినప్పటికీ ఆమె సోషల్ మీడియాలో మాత్రం కొంత కాలంగా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన సినీ కెరీర్‌కు సంబంధించిన విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. దీంతో అనుపమను ఫాలో అయ్యే వారి సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతోంది.

  అదే ఆమె కొంప ముంచింది.. క్రికెటర్‌తో లవ్

  అదే ఆమె కొంప ముంచింది.. క్రికెటర్‌తో లవ్

  సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న కారణంగానే అనుపమ పరమేశ్వరన్ చిక్కుల్లో పడింది. దీనికి కారణం ఆమె టీమిండియా క్రికెటర్ జస్ప్రీత్ బూమ్రాతో ప్రేమాయణం సాగిస్తోందన్న వార్తలు రావడమే. సోషల్ మీడియాలో వీళ్లిద్దరూ ఒకరినొకరు ఫాలో అవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ పుకార్లపై స్పందిస్తూ.. అతడు తనకు కేవలం ఫ్రెండ్ మాత్రమే అని చెప్పిందామె.

  హార్ట్‌తో కలిసి ఎగిరిపోతున్నానంటూ పోస్టింగ్

  హార్ట్‌తో కలిసి ఎగిరిపోతున్నానంటూ పోస్టింగ్

  తాజాగా అనుపమ పరమేశ్వరన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫ్లైట్‌లో ఉన్న ఫొటోను స్టోరీగా పెట్టుకుంది. అంతేకాదు, దీనికి ‘మొక్క, హృదయంతో కలిసి రాజ్‌కోట్‌కు ఎగిరిపోతున్నా' అనే క్యాప్షన్ కూడా పెట్టింది. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోయింది. ఇక, ఆమె బూమ్రాను ఉద్దేశించే ఈ పోస్టు పెట్టిందని సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

  ప్రియుడిని కలవడానికే.. అతడు కూడా అక్కడే

  ప్రియుడిని కలవడానికే.. అతడు కూడా అక్కడే

  ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతోన్న టెస్ట్ సిరీస్‌ కోసం బూమ్రా గుజరాత్‌లోనే ఉన్నాడు. అయితే, అతడు నాలుగో టెస్టు ఆడకుండా విశ్రాంతి తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో అనుపమ పరమేశ్వరన్ కూడా అదే రాష్ట్రానికి వెళ్లింది. దీంతో తన ప్రియుడిని కలిసేందుకే ఆమె అక్కడికి వెళ్లిందని ప్రచారం జరుగుతోంది. ఫలితంగా వీళ్లిద్దరి వ్యవహారం మరోసారి దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతోంది.

  English summary
  Anupama Parameshwaran is one of those actresses who enjoy good craze among the audiences. But, she did not get the chance to romance with top stars on the screen. Now, Anupama Parameswaran send Love message In her Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X