For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అతడు ఇంకా నా హృదయంలోనే.. మరిచిపోలేకపోతున్నా.. అనుష్క ఎమోషనల్

  |

  పక్కవాడిని పట్టించుకొనే రోజులు పోయాయనే మాటల వినిపిస్తున్న రోజుల్లో.. తనకు దూరమైన ఓ వ్యక్తి గురించి అందాల తార అనుష్క శెట్టి తలచుకోవడం మీడియా దృష్టిని ఆకర్షించింది. తనకు సహాయకుడిగా వ్యవహరించిన రవి అనే యువకుడిని తలచుకొని విషాదంలో మునిగిపోయింది. తన ఇన్స్‌టాగ్రామ్‌లో హృదయానికి హత్తుకొనే పోస్టుతో పెట్టిన అనుష్కను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. రవి గురించి అనుష్క పెట్టిన మెసేజ్ గురించి. .

  అసిస్టెంట్ రవిని తలచుకొని

  అసిస్టెంట్ రవిని తలచుకొని

  రవి అనే యువకుడు నాకు సహాయకుడిగా పనిచేశారు. చాలా యుక్త వయసులోనే అతడు మృత్యువు ఒడిలోకి చేరిపోయాడు. ఇప్పటికీ రవి ఎప్పడూ నాకు గుర్తొస్తుంటాడు. ఎలాంటి కపటం ఎరుగని రవి మా మధ్య లేరనే విషయం, బాధ నన్ను వెంటాడుతున్నది. రవి నాకు దూరం కావడం జీవితంలో ఏదో కోల్పోయిన బాధగా అనిపిస్తుంది అని అనుష్క శెట్టి అన్నారు.

  నాకు దూరమై 7 ఏళ్లు దాటినా

  నాకు దూరమై 7 ఏళ్లు దాటినా

  మనల్ని బాగా ఇష్టపడిన వాళ్లు దూరమైన వారి ఆత్మ మనతోనే ఉంటుంది. మరణం మనకు ఇష్టమైన వారిని దూరం చేయలేదు. రవితో నా అనుబంధం14 ఏళ్లు. నీవు దూరమై 7 ఏళ్లు అయిపోయింది. ఇంకా నా గుండెల్లోనే ఉన్నావు. నిన్ను అమితంగా ఇష్టపడే వాళ్లు నీ గురించి ఆలోచిస్తూనే ఉంటారు. కారణం నాకు తెలియదు గానీ.. నా హృదయంలో రవి గూడుకొట్టుకొన్నాడా అనిపిస్తుంది అని అనుష్క ఉద్వేగభరితమైన లేఖను రాశారు.

   వరుస చిత్రాలతో అనుష్కశెట్టి

  వరుస చిత్రాలతో అనుష్కశెట్టి

  బాహుబలి, భాగమతి చిత్రాలతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకొన్నది. భాగమతి తర్వాత కొంత గ్యాప్ తీసుకొన్నారు. శారీరకంగా, మానసికంగా సంసిద్ధమైన ఈ జేజమ్మ మళ్లీ ఇప్పుడు కెరీర్‌పై దృష్టిపెట్టారు. పెళ్లి, అఫైర్ రూమర్లను ఎదురించిన ఈ బ్యూటీ మళ్లీ వరుస సినిమాలతో బిజీగా మారుతున్నారు. కొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నట్టు తెలుస్తున్నది.

  సెలెన్స్, సైరా నర్సింహరెడ్డి మూవీస్‌లో

  సెలెన్స్, సైరా నర్సింహరెడ్డి మూవీస్‌లో

  ప్రస్తుతం సైరా నర్సింహారెడ్డి, సైలెన్స్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. సైరాలో చిరంజీవితో మరోసారి ఓ కీలకపాత్రతో జతకడుతున్నారు. అలాగే కోన వెంకట్ రూపొందించే సైలెన్స్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఎక్కువ భాగం అమెరికాలో జరుగుతుంది. థ్రిల్లర్‌గా రూపొందే ఈ చిత్రంలో అంజలి, ఆర్ మాధవన్, హాలీవుడ్ నటుడు, కిల్ బిల్ స్టార్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.

  English summary
  Actor Anushka Shetty gets emotional in her Instagram. He remembered his assistant Ravi on his death day. She posted a letter about Ravi. Anushka Shetty says Those who love never truly leave us ,Harry.There are things that death cannot touch”........The Past 14years has been quite a journey ... when u realise the people closest to u are no more a part of ur life all I can say is they take a part of u with them ...it’s been 7 years and it still keeps me wondering a beautiful soul (Ravi) I have no clue of the afterlife but he always live in my heart ....
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X