గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన అర్జున్ రెడ్డి హీరోయిన్.. మరీ ఇంత సన్నగానా?
కొంతమంది సినీ తారలు మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంటారు. ఒక్క హిట్టు పడితే రాత్రికి రాత్రే ఎన్నో ఆఫర్స్ వస్తుంటాయి. అప్పుడే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏ మాత్రం మిస్టేక్ చేసినా కూడా ఉన్న క్రేజ్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అయితే అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే కూడా దాదాపు అదే తరహాలో చేదు అనుభవాను ఎదుర్కొంటోంది. అయినప్పటికీ తన ప్రయత్నాలు కొనసాగిస్తున్న ఈ బ్యూటీ ఇటీవల ఊహించని విధంగా న్యూ లుక్ తో షాక్ ఇచ్చింది.

మొదటి సినిమాతోనే భారీ క్రేజ్
అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన షాలిని పాండే ఆ సినిమాతో ఏ స్థాయిలో హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రీతి పాత్రతో యువకుల మనసును దోచేసుకుంది. ఫస్ట్ ఫ్రేమ్ లో ట్రెడిషినల్ లుక్ తో కనిపించిన ఈ బ్యూటీ ఆ తరువాత రొమాన్స్ తో బోల్డ్ గా కనిపించి షాక్ ఇచ్చింది.

విజయ్ దేవరకొండ తరహాలోనే
పాత్ర డిమాండ్ ను బట్టి నటించడానికి సాహసం చేసే షాలిని అర్జున్ రెడ్డి అనంతరం సౌత్ లో మంచి క్రేజ్ అందుకుంది. ఇక బడా దర్శకుల నుంచి నిర్మాతల నుంచి ప్రశంసలు అందడమే కాకుండా కొన్ని ఆఫర్స్ కూడా వచ్చాయి. అయితే ఈ బ్యూటీ విజయ్ దేవరకొండ తరహాలోనే తొందరపడకుండా మంచి ఆఫర్స్ అందుకోవాలని అనుకుంది.

మళ్ళీ ఆ రేంజ్ లో హిట్టు పడలేదు
కానీ అర్జున్ రెడ్డి అనంతరం షాలినికి మళ్ళీ ఆ రేంజ్ లో హిట్టు పడలేదు. చిన్న సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చినప్పటికీ పెద్ద సినిమాల్లో ఆఫర్స్ రాలేదు. మహానటి సావిత్రి సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించిన అనంతరం ఎన్టీఆర్ బయోపిక్ లో షావుకారు జానకిగా కనిపించింది. మధ్యలో 118, ఇద్దరి లోకం ఒకటే సినిమాలు పరవలేదనిపించే విధంగా రిజల్ట్ ను అందుకుంది.
Recommended Video

న్యూ లుక్ తో షాక్ ఇచ్చిన షాలిని
ఇక ఇటీవల అమ్మడు ఒక ఫొటో షూట్ నిర్వహించగా అందులో చాలా సన్నగా కనిపించింది. ఇంతకుముందు కాస్త బబ్లీగా కనిపించిన ప్రీతి ఇలా అయ్యిందేంటని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక చివరగా నిశ్శబ్దం సినిమాలో కనిపించిన షాలిని నెక్స్ట్ మరో రెండు హిందీ సినిమాలతో రాబోతోంది. ఇక తెలుగులో పెద్దగా ఆఫర్స్ అయితే లేవు. మరి ఈ ఫొటో షూట్స్ తో అమ్మడు ఏవైనా ఆఫర్స్ అందుకుంటుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











