For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రచ్చ రేపిన భూమిక.. ఫ్రెండ్స్‌తో కలిసి డ్రింక్ పార్టీ.. సోషల్ మీడియాలో పిక్స్ వైరల్!

  |

  తెలుగు వారికి భూమిక చావ్లా అంటే పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగు లో యువకుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె ఖుషి సినిమాతో తెలుగు ప్రేక్షకుల అందరికీ దగ్గర అయింది. అయితే ఈ భామ ముదురు వయసులో డ్రింక్ పార్టీ చేసుకుంటూ సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

  ఢిల్లీలో పుట్టి

  ఢిల్లీలో పుట్టి

  న్యూఢిల్లీలో ఒక పంజాబీ సాంప్రదాయ కుటుంబంలో జన్మించిన భూమిక చావ్లా అక్కడ స్కూలింగ్ మొత్తం పూర్తి చేశారు. ఆమె తండ్రి ఒక రిటైర్డ్ ఆర్మీ మేజర్. భూమికకు ఒక అన్న, ఒక అక్క కూడా ఉన్నారు. అయితే సినిమా రంగం మీద ఆసక్తి పెంచుకున్న భూమిక 97 లోనే ముంబై షిఫ్ట్ అయ్యారు. ముందుగా ముంబై లో కొన్ని హిందీ మ్యూజిక్ వీడియో ఆల్బమ్స్ అలాగే కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ లో కూడా ఆమె భాగమయ్యారు.. మరీ ముఖ్యంగా జీ టీవీ సిరీస్ అయిన హిప్ హిప్ హుర్రేతో ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు.. ఇక తర్వాత 2000 సంవత్సరంలో యువకుడు అనే సినిమాతో ఆమె సినిమా హీరోయిన్ గా మారారు. సుమంత్ సరసన హీరోయిన్ గా నటించగా దానికి గాను ఆమెకు అవార్డు కూడా లభించింది. ఇక పవన్ కళ్యాణ్ సరసన ఖుషి సినిమాలో ఆమె నటించడంతో ఆమెకు సూపర్ క్రేజ్ దక్కింది.

  తెలుగులో సూపర్ క్రేజ్

  తెలుగులో సూపర్ క్రేజ్

  ఇక ఆ తర్వాత వరుస హిట్లు అందు కోవడం మొదలుపెట్టారు. ఒక్కడు, వాసు, సింహాద్రి ఇలా వరుస సినిమాలతో హిట్ అనుకుంటున్న నేపథ్యంలో ఆమెకు బాలీవుడ్ నుంచి అవకాశాలు వచ్చాయి. సల్మాన్ ఖాన్ సరసన తేరేనామ్ సినిమాలో నటించే అవకాశం రావడంతో ఆమె వెనక్కి చూసుకోకుండా వెళ్ళిపోయింది. ఇక ఆ తర్వాత ఇటు తెలుగులో హిందీ లో వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఇక ఆమె నాలుగేళ్ల పాటు ప్రేమించిన యోగా గురువు భరత్ ఠాకూర్ ని నాసిక్లో 2007లో వివాహమాడారు ఇక వీరిద్దరికీ 2014లో ఒక కుమారుడు కూడా జన్మించారు. అన్నట్టు మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ యోగ గురు భరత్ తాకూర్ అనుష్కకి కూడా యోగ గురువు.

  సోషల్ మీడియాలో యాక్టివ్ గా

  సోషల్ మీడియాలో యాక్టివ్ గా


  ఇక పెళ్లి తర్వాత కూడా ఆమె సినిమాలు అయితే ఆపలేదు కానీ గ్లామర్ రోల్స్ కి దూరంగా ఉంటూ నటనకు ఆస్కారమున్న పాత్రలు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా పెళ్ళి తర్వాత కూడా తెలుగులో నాని హీరోగా నటించిన మిడిల్ క్లాస్ అబ్బాయి, సమంత హీరోయిన్ గా నటించిన యూటర్న్ అలాగే సవ్యసాచి లాంటి సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె కీలక పాత్రలలో నటిస్తున్న సిటీ మార్ పాగల్ సినిమాలు రిలీజ్ కి దగ్గర అవుతున్నాయి. అయితే ఈ విషయం పక్కన పెడితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న భూమిక తనకు సంబంధించిన అనేక ఫోటోలను అభిమానులతో పంచుకునే పరిచయం పనిచేస్తున్నారు.. అందులో భాగంగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

  వైన్ పుచ్చుకుంటూ

  వైన్ పుచ్చుకుంటూ


  విషయం ఏమిటంటే తాజాగా భూమిక తన ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేశారు. ఈ ఫోటోలలో ఆమె తన స్నేహితులతో కలిసి వైన్ తీసుకున్నట్లుగా ఉన్నాయి. సాధారణంగా హీరోయిన్లు ఇలా వైన్స్ తీసుకుంటున్న సందర్భాలకు సంబంధించిన ఫోటోలు పెట్టడానికి ఆసక్తి చూపించరు అనే చెప్పాలి.. కానీ భూమిక చావ్లా మరి ఏమైందో ఏమో తెలియదు గానీ ఈ ఫోటోలు షేర్ చేసి తన సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చకు దారి తీసేలా చేశారు. అంతేగాక తాను సిటీకి తిరిగి వచ్చానని అందుకే ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా సమయం గడుపుతున్నాను అంటూ దానికి క్యాప్షన్ కూడా పెట్టారు. అంతేకాక వీళ్లు అందరినీ ఈరోజే కలిశానని కూడా ఆమె కామెంట్ చేశారు.

  ఎన్టీఆర్ సినిమలో

  ఎన్టీఆర్ సినిమలో

  ఇక ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో భూమిక ఒక కీలక పాత్రలో నటిస్తుందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతూ వస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఏదీ లేకపోయినప్పటికీ పెద్ద ఎత్తున ప్రచారం మాత్రం జరుగుతూ వస్తోంది. ఈ సినిమాలో భూమిక పాత్ర కీలకం కాబోతోంది, కథను కీలక మలుపు తిప్పే పాత్రలో నటిస్తోంది అంటూ ప్రచారం జరుగుతోంది. నిజానికి ఎన్టీఆర్ సరసన ఆమె సాంబ సినిమాలో అలాగే సింహాద్రి సినిమాలో హీరోయిన్ గా నటించింది. అలాంటి ఆమె ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ పాత్ర కాకుండా వేరే పాత్ర చేస్తే ఆమె కెరీర్ కు ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. మరి ఆ విషయంలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేదానిమీద ఆమె కెరీర్ ఆధారపడి ఉంటుంది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి చూడాలి ఈ అంశం మీద భూమిక చావ్లా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందని అనేది. మొత్తం మీద ఆమె షేర్ చేసిన డ్రింక్ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

  English summary
  Photos posted on social media of Bhumika Chawla having a drink party have now gone viral on social media. Photos posted on social media of Bhumika Chawla having a drink party have now gone viral on social media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X