twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లక్ష ఇస్తాం పడక గదిలోకి వస్తావా.. బిల్డింగ్‌పై దూకి అంటూ డైరెక్టర్‌ నిర్వాకంపై శ్వేతా వర్మ

    |

    యాక్టర్ శ్వేతా వర్మ అంటే ఎవరో పెద్దగా తెలిసేది కాదు. కానీ బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్‌లోకి వచ్చిన తర్వాత ఫైర్ బ్రాండ్ ఉమెన్‌గా శ్వేతా వర్మ అందర్నీ ఆకట్టుకొన్నారు. ముక్కుసూటి తనం, కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటం లాంటి అంశాలను ఆమెకు భారీగా అభిమానులను, ఫాలోవర్స్‌ను తెచ్చిపెట్టాయి. అయితే బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ..

    బిగ్‌బాస్ తెలుగు 5తో ఫుల్ క్రేజ్

    బిగ్‌బాస్ తెలుగు 5తో ఫుల్ క్రేజ్

    బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్‌లో శ్వేతా వర్మది ప్రత్యేక శైలి. ఆమె ఆడిన టాస్కులు, ఇంటి సభ్యుల ప్రవర్తనను ఎండగట్టడంలోను తనదైన శైలిలో స్పందించారు. అంతేకాకుండా ఇంటిలో తన అందం, అభినయంతో ఆకట్టుకొన్నారు. దాంతో శ్వేతా వర్మ అంటే ప్రతీ ఇంటికి తెలిసేలా క్రేజ్‌ను సంపాదించుకొన్నారు.

    క్యాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీలో ఉందంటూ

    క్యాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీలో ఉందంటూ

    ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ (అవకాశం కోసం పడకగదికి వెళ్లడం) అనేది ఉంది. కాకపోతే గతంలో 100 శాతం ఉంటే.. ప్రస్తుతం 30 శాతానికి వచ్చింది. ఇలాంటి అనుభవాలు మగవాళ్లకు కూడా ఎదురవుతున్నాయి. ఇలాంటి సంఘటనలపై అందరికీ అవగాహన ఏర్పడుతుంది. గతంలో ఇలాంటి విషయాలు చెప్పడానికి భయపడేవాళ్లు. మీ టూ ఉద్యమం తర్వాత మారిపోయిందనే అభిప్రాయాన్ని శ్వేతా వర్మ వ్యక్తం చేశారు.

    కమిట్‌మెంట్ ఇస్తారా అంటూ

    కమిట్‌మెంట్ ఇస్తారా అంటూ

    గత కొద్దికాలంగా నేను సినిమాలు, వెబ్ సిరీస్, వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నాను. అయితే మాకు కమిట్‌మెంట్ ఇస్తారా అని అడిగే వారు. తొలుత నేను వేరే విధంగా అర్ధం చేసుకొనే దానిని. కమిట్‌మెంట్ అంటే కష్టపడి, అంకితభావంతో పనిచేయాలని అనుకొనే దానిని. అవకాశం కోసం ఇలా అమ్మాయిలను వాడుకొంటారని తెలియదు అని అన్నారు.

    బిల్డింగ్ మీద నుంచి దూకి చచ్చిపో అంటూ

    బిల్డింగ్ మీద నుంచి దూకి చచ్చిపో అంటూ

    అయితే వ్యాపార ప్రకటనల్లో నటించే సమయంలో వాట్సప్‌లో కొందరు నాతో అదో రకంగా ఛాట్ చేసేవాళ్లు. 2015లో యాడ్స్‌లో నటించేటప్పుడు మీకు లక్ష రూపాయలు ఇస్తాం. మీరు అలా మాకు సహకరించాలి అంటూ గొంతెమ్మ కోరికలు కోరేవారు. అయితే నేను మీరు ఒకపని చేస్తారా అని నేను అడిగాను ఏం చేయాలి వాళ్లు ఏం చేయాలి అని అడిగితే.. బిల్డింగ్ మీద నుంచి దూకి చచ్చిపోండి అంటూ కామెంట్ చేశాను.

    Recommended Video

    Naga Shaurya Making Fun | Varudu Kavalenu Team Interview
    ప్రత్యక్షంగా ఎదురు కాలేదు అంటూ

    ప్రత్యక్షంగా ఎదురు కాలేదు అంటూ

    నేను నటించిన ప్రాజెక్టుల్లో యంగ్‌ ఫిల్మ్ మేకర్స్ ఉండటం వల్ల నాకు ప్రత్యక్షంగా ఇలాంటి అనుభవాలు ఎదురు కాలేదు. కాకపోతే ఆన్‌లైన్, వాట్సాప్ ఛాటింగ్‌లో ఇలాంటి సంఘటనలు ఎదురపడ్డాయి. కొన్ని చాటింగ్స్ నేను ఫేస్‌బుక్‌లో కూడా పోస్టు చేశాను. ఇప్పటికి ఉన్నాయి అంటూ శ్వేతా వర్మ తన అనుభవాలను పంచుకొన్నారు.

    English summary
    Bigg Boss Telugu 5 Fame Shweta Varma reveals about Casting couch in film Industry. She pointed out the director's behaviour.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X