Don't Miss!
- Finance
Jio laptop: మార్కెట్లోకి Jio ల్యాప్ ట్యాప్.. ఫీచర్లు, ధర చూస్తే వావ్ అనాల్సిందే !!
- Sports
INDvsNZ : మూడో టీ20లో ఈ రికార్డులు బద్దలవడం ఖాయం.. సూర్య సాధిస్తాడా?
- News
UNION BUDGET 2023-2024: కేంద్ర బడ్జెట్ పై ఆంధ్రప్రదేశ్ గంపెడాశలు; ఈసారైనా కేంద్రం కరుణిస్తుందా?
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
మరో సీనియర్ నటి బయోపిక్.. కీర్తి సురేష్ ఒప్పుకుంటుందా?
తెలుగులో తెరకెక్కిన మొట్టమొదటి హీరోయిన్ బయోపిక్ మహానటి. తమిళ్ లో కూడా విడుదలైన మహానటి ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ సినిమా ఇచ్చిన నమ్మకం మరెన్నో బయోపిక్ లకు ప్రాణం పోసింది. అయితే కథలో కాంట్రవర్సీ ఉంటేనే బయోపిక్ లను రూపొందించేందుకు దర్శకనిర్మాతలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
Recommended Video

మహానటి కీర్తి సురేష్..
అలనాటి అందాల తార సావిత్రి జీవిత ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాలో కీర్తి సురేష్ నటించిన విధానం అందరిని ఆకట్టుకుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ వెండి తెర వెనక ఎంతగా కష్తపడ్డాడో అదే విధంగా సావిత్రి జీవితంలోకి ఆడియెన్స్ ని తీసుకెళ్లడానికి కీర్తి సురేష్ కూడా చాలానే శ్రమించినట్లు చెప్పవచ్చు. సావిత్రి మహానటిగా క్రేజ్ తెచ్చుకున్నట్లుగానే నేటితరం మహనటిగా కీర్తి సురేష్ కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది.

మరో బయోపిక్..
మహానటి అనంతరం బయోపిక్స్ చాలానే వెండితెరపైకి వచ్చాయి. ఇక మరొక సీనియర్ నటి జీవితం కూడా తెరపైకి రానుంది. కథానాయికగా, దర్శకురాలిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న విజయ నిర్మల జీవితంపై సినిమాను రూపొందించేందుకు టాలీవుడ్ లో చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆమె పాత్రలో ఎవరు నటిస్తారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కీర్తి సురేష్ ఒప్పుకుంటుందా?
ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో కీర్తి సురేష్.. విజయ నిర్మల బయోపిక్ లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని కీర్తి గతంలో అయితే మరొక బయోపిక్ లో నటించనని చెప్పింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు మహానటి సినిమా చూసి తనను సావిత్రి అంటున్నారని మళ్ళీ మరొకరి బయోపిక్ లో నటిస్తే అంతగా రిసీవ్ చెసుకోకపోవచ్చని తెలిపింది.

నరేష్ ఆధ్వర్యంలో..
విజయ నిర్మల కుమారుడు నరేష్ తన తల్లి బయోపిక్ ని వీలైనంత త్వరగా సెట్స్ పైకి తేవాలని కొంతమంది సినీ రైటర్స్ తో చర్చలు జరుపుతున్నారట. ఫుల్స్ స్క్రిప్ట్ సిద్ధమైన తరువాత అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ కృష్ణను రెండవ వివాహం చేసుకున్న విజయ నిర్మల లెజెండరీ యాక్టర్ గానే కాకుండా కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. మరి అలాంటి మల్టీ టాలెంటెడ్ యాక్టర్ పాత్రలో ఎవరు నటిస్తారో చూడలి.