టాలీవుడ్ రీ ఎంట్రీకి సిద్దమైన జెనీలియా.. దిమ్మతిరిగే రెమ్యునరేషన్.. ఎందుకో తెలుసా ?

ఒకప్పుడు సౌత్ లో టాప్ హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన జెనీలియా పెళ్లి తరువాత సినిమాలకు దూరమైంది. ఆమె సౌత్ లో నటించి దాదాపు పదేళ్లు దాటేసిన క్రమంలో ఎవరూ ఊహించని విధంగా రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. పైగా రీఎంట్రీతోనే భారీ రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే...

Recommended Video

Genelia D'Souza Grand Comeback లక్కీ ఛాన్స్ దక్కించుకున్న Sreeleela | Filmibeat Telugu
తుజే మేరీ కసం

తుజే మేరీ కసం

తుజే మేరీ కసం అనే సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమైన జెనీలియా ఆ తర్వాత బాయ్స్ సినిమాతో ప్రేక్షకుల మదిని కొల్లగొట్టింది. ఆ తర్వాత తెలుగులో సత్యం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత సాంబ సినిమా కూడా పెద్దగా కలిసి రాలేదు. రాజమౌళి సై సినిమాలో హీరోయిన్ గా నటించిన ఆమెకు ఆ సినిమా కాస్త కలిసి వచ్చింది. కానీ ఆ తర్వాత మళ్ళీ వరుస అపజయాలు మొదలయ్యాయి.

ప్రేక్షకుల ముందుకు

ప్రేక్షకుల ముందుకు


ఆ తర్వాత హ్యాపీ, రామ్, బొమ్మరిల్లు, ఢీ వంటి సూపర్ హిట్ సినిమాల్లో భాగమైన ఆమె తెలుగులో నా ఇష్టం అనే సినిమా తరువాత తెలుగు పరిశ్రమకు దూరం అయింది. రానా దగ్గుబాటి సరసన ఓ సినిమాలో నటించింది తరువాత పూర్తిగా నటనకు దూరమైంది. హిందీ సినిమాలలో అతిథి పాత్ర చేసింది కానీ పూర్తిస్థాయి నటిగా దూరమై దాదాపు పదేళ్ల అవుతోంది. ఇప్పుడు ఆమె మళ్లీ నటిగా ప్రేక్షకుల ముందుకు రాబోతుడడం కాస్త ఆసక్తికరంగా మారింది.

కిరీటి హీరోగా

కిరీటి హీరోగా


టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం కర్ణాటక మాజీ మంత్రి , ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటిని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్ సినిమాను రూపొందించనుంది. కన్నడ దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను తెలుగు-కన్నడ భాషలలో తెరకెక్కిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం అత్యంత వైభవంగా శుక్ర‌వారం నాడు ప్రారంభమైంది.

 పదేళ్ల తరువాత

పదేళ్ల తరువాత


ఈ వేడుకకు ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేసి ముహూర్తం షాట్‌కు క్లాప్ కొట్ట‌గా , కన్నడ లెజెండ్ క్రేజీ స్టార్ డాక్టర్ రవిచంద్ర వి కెమెరా స్విచాన్ చేశారు. ఈ సినిమాలో రవిచంద్ర, జెనీలియా కీలక పాత్రలలో నటిస్తుండగా శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలో షూట్ ప్రారంభం కానుంది. సినిమా గురించి ఈ సందర్భంగా జెనీలియా మాట్లాడుతూ- ''నేను నటనకు దూరమై పదేళ్లయింది. కిరీటి సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నా'' అన్నారు.

ఏకంగా మూడు కోట్లు

ఏకంగా మూడు కోట్లు


అయితే నిజానికి జెనీలియా హీరోయిన్ గా చేసినప్పుడు అంటే సుమారు పదేళ్ల క్రితం రూ.70 లక్షల రెమ్యునరేషన్ తీసుకునేది. కానీ ఇప్పుడు సపోర్టింగ్ రోల్ కోసం కోట్ల రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్టు టాక్. అయితే ఈ సినిమాలో హీరోకి అక్క పాత్రలో ఆమె నటిస్తోందని అంటున్నారు. ఆ పాత్ర కీలకం కావడంతో జెనీలియాను సంప్రదించగా.. ఆమె రూ.3 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసింది అని అంటున్నారు. అయితే భారీ బడ్జెట్ సినిమా కావడంతో నిర్మాతలు ఆమె అడిగినంత ఇవ్వడానికి రెడీ అయ్యారని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X