‘టాప్ హీరోయిన్‌తో నా అఫైర్ తెలిసి.. ఆమెను టాప్ డైరెక్టర్ దారుణంగా కొట్టి హింసించాడు’
సినిమా పరిశ్రమలో డేటింగ్స్, రిలేషన్‌షిప్స్ సర్వసాధారణం. అయితే క్రాస్ రిలేషన్స్ వల్ల చాలా గొడవలు జరగడం ప్రేక్షకుల దృష్టికి ఎన్నోసార్లు వచ్చాయి. గతంలో స్టార్ హీరో, హీరోయిన్ల మధ్య జరిగే ప్రేమ వ్యవహారాలు, వారి కెరీర్‌కు, వారి వ్యక్తిగత జీవితాలపై ప్రభావం చూపేలా మారుతుంటాయి. అయితే ప్రముఖ నటితో అఫైర్ వ్యవహారం తనను చాలా ఇబ్బందులకు గురి చేసిందని తాజా ఇంటర్వ్యూలో ఓ నటుడు వెల్లడించారు. ఎవరా టాప్ హీరోయిన్, ఆ హీరోయిన్‌తో హీరోకు ఉన్న సంబంధమేమిటి అనే వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్‌ను జీనత్ ఆమన్ టాప్ హీరోయిన్‌గా ఏలుతున్న సమయంలో ఇన్సాఫ్ కా తారాజు అనే సినిమాలో ఆమె నటించింది. ఈ చిత్రం ద్వారా దీపక్ పరాషార్ అనే నటుడు హీరోగా పరిచయం అయ్యారు. అయితే సినిమా షూటింగులో జీనత్‌తో ఏర్పడిన పరిచయం చాలా దగ్గరగా చేసింది. ఆ తర్వాత ఆమెతో పరిచయం మరింత సన్నిహితమైన రిలేషన్స్‌కు దారి తీసింది. వారిద్దరూ సన్నిహితంగా ఉండటం చూసి దర్శకుడు సంజయ్ ఖాన్ ఓర్చుకోలేకపోయాడట. ఆ విషయం గురించి దీపక్ పరాషార్ తాజా ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.

ఇన్సాఫ్ కా తరాజు సినిమా షూటింగులో నేను జీనత్‌ను కలిశాను. ఆ సమయంలో ఆమె తన రిలేషన్‌షిప్ బ్రేకప్‌కు చివరగా ఉంది. తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైన సమయంలో నేను ఆమెను కలిశాను. మా ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది. ఆమెకు నేను మంచి సన్నిహితుడిగా మారాను. నా భుజంపై తలపెట్టి బాధను పంచుకొనేంతగా ఆమెకు దగ్గరయ్యాను. ఈ విషయం ఖాన్‌కు నచ్చలేదు అని ఆయన తెలిపారు.
ఓ రోజు జీనత్‌కు ముంబై నుంచి కాల్ వచ్చింది. వెంటనే ఆమె సంజయ్‌ను కలువడానికి వెళ్లారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య ఘర్షణ ఏర్పడింది. వారి మధ్య గొడవ సందర్భంగా ఆమెను కొట్టారో లేదా తోశారో తెలియదు. కానీ ఆమెకు బలమైన గాయాలు అయ్యాయి. ఆ విషయాన్ని చోప్రా గారికి చెప్పుకొని బాధపడ్డారు. తనను వేధిస్తున్నాడు. తన గాయమయ్యేలా బిహేవ్ చేశాడని కన్నీరు పెట్టుకొన్నారని తెలిపారు. అయితే తనను ఎలా వేధించాడనే విషయాన్ని ఎవరికి చెప్పకుండా తన హుందాతనాన్ని చాటుకొన్నారు అని తెలిపారు.
సంజయ్ ఖాన్‌కు జీనత్ ఆమన్‌కు మరోసారి ముంబైలోని తాజ్ హోటల్‌లో గొడవ జరిగింది. ఆ సమయంలో ఆమెను దారుణంగా కొట్టాడు. దాంతో ఆమె కుడి కంటికి గాయమైంది. ఈ ఘటన డిసెంబర్ 1979లో జరిగింది. ఈ విషయాన్ని, బాధను, వేధింపులను తనలోనే దాచుకొన్నది. అయితే ఆమె దాడిని సంజయ్ ఖాన్ ఖండించారు. మీడియాను ఉపయోగించుకొని దాని నుంచి తప్పించుకొన్నాడు అని ఆయన తెలిపాడు.


Click it and Unblock the Notifications











