For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  #మీటూ: యాక్షన్ స్టార్ అర్జున్ పేరు బయటపెట్టి హీరోయిన్ సంచలనం!

  |

  దేశ వ్యాప్తంగా ఉధృతం అయిన #మీటూ ఉద్యమం లైంగిక వేధింపులకు పాల్పడిన, అసభ్యంగా ప్రవర్తించిన పలువురు స్టార్స్ భాగోతాలు బట్టబయలు చేస్తోంది. తాజాగా మరో అతిపెద్ద స్టార్ పేరు బయటకు వచ్చింది. సౌత్ ఇండియాలో యాక్షన్ హీరోగా పేరు గడించడంతో పాటు తెలుగు, తమిళం, కన్నడలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ సార్జా మీద తాజాగా ఆరోపణలు వచ్చాయి.

  కన్నడ నటి శృతి హరిహరన్ అర్జున్ సార్జా షూటింగ్ సమయంలో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు చేశారు. ఇటీవల విడుదలైన 'కురుక్షేత్రం'లో శృతి హరిహరన్ అర్జున్‌కు జోడీగా నటించిన నటించిన సంగతి తెలిసిందే.

  రిహార్సల్స్ సమయంలో వేధింపులు

  రిహార్సల్స్ సమయంలో వేధింపులు

  ‘కురుక్షేత్రం' సినిమా షూటింగ్ సమయంలో అర్జున్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని శృతి హరిహరన్ ఆరోపించారు. సినిమాలో రొమాంటిక్ సీన్ రిహార్సల్ జరిగే సమయంలో అతడి ప్రవర్తన వల్ల ఇబ్బంది పడ్డట్లు తెలిపారు.

  ఆయన సినిమాలు చూస్తూ పెరిగా, ఇలాంటోడనుకోలేదు

  ఆయన సినిమాలు చూస్తూ పెరిగా, ఇలాంటోడనుకోలేదు

  నేను అర్జున్ సార్జా సినిమాలు చూస్తూ పెరిగాను. అలాంటి వ్యక్తితో నటించే అవకాశం దొరికినపుడు చాలా సంతోష పడ్డాను. సినిమా ప్రారంభమైన తొలినాళ్లలో అంతా బాగానే ఉంది. ఈ చిత్రంలో ఆయన భార్య పాత్ర పోషించాను. ఆ రోజు మా ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్ చిత్రీకరిస్తున్నారు. ఓ డైలాగ్ తర్వాత ఇద్దరం కౌగిలించుకోవాలి. రిహార్సల్ జరుగుతుండగా అతడి ప్రవర్తన భిన్నంగా అనిపించింది అని శృతి హరిహరన్ తెలిపారు.

  నా అనుమతి లేకుండానే

  నా అనుమతి లేకుండానే

  రొమాంటిక్ సీన్ రిహార్సల్ జరుగుతుండగా ఇద్దరం డైలాగులు చెప్పుకున్నాం. అర్జున్ ఎలాంటి ముందుస్తు సూచన లేకుండా, నా అనుమతి తీసుకోకుండా హగ్ చేసుకున్నాడు. నా వీపు మీద చేయి వేసి కిందకి మీదకు అదో రకంగా టచ్ చేస్తూ రుద్దాడు. ఆ తర్వాత నన్ను దగ్గరగా లాక్కున్నాడు.... అని శృతి హరిహరన్ తెలిపారు.

  అలా కవర్ చేసే ప్రయత్నం చేశారు

  అలా కవర్ చేసే ప్రయత్నం చేశారు

  తాను చేయాల్సిందంతా చేసేసి తర్వాత దర్శకుడితో దీన్ని ఫోర్‌ప్లే సీన్లో వాడితే ఎలా ఉంటుంది అని అడిగాడు. అతడు అలా చేయడంతో ఆశ్చర్య పోయాను. రియాల్టీ కోసం ఇలా చేశాననే విధంగా కవర్ చేశాడు. కానీ అలా చేయడం పూర్తిగా తప్పు. అతడి ఉద్దేశ్యం ఏదైనా సరే అది ప్రొఫెషనల్‌గా చేస్తే బావుండేది.... అని శృతి హరిహరన్ తెలిపారు.

  అసహ్యం వేసింది

  అసహ్యం వేసింది

  అర్జున్ చేసిన ఆ పని చూసి అసహ్యం వేసింది. చాలా కోపం వచ్చింది. కానీ ఆ సమయంలో ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. కెమెరా రోల్ అయ్యే ముందు రిహార్సల్ చేయడం అవసరమే. అలా చేయడం వల్లే సీన్ పర్ఫెక్టుగా వస్తుంది. కానీ ఇద్దరి మధ్య ఈ విషయంలో ఒక అండస్టాండింగ్ అనేది ఉండాలి. ఇలా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం సరి కాదన్నారు.

  ఇదే సరైన సమయం

  ఇదే సరైన సమయం

  #మీటూ ఉద్యమం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని తాను బయట పెట్టానని, ఆ సమయంలో తాను పడ్డ ఇబ్బంది గురించి ఎవరికీ చెప్పుకోలేక పోయానని, మీటూ మూమెంట్ ద్వారా తన బాధ చెప్పుకునే అవకాశం దక్కిందని శృతి హరిహరన్ తెలిపారు.

  English summary
  BREAKING : Actress Sruthi hariharan accuses Arjun Sarja of sexual harassment during Kurukshetram shooting. Sruthi said everything was normal during the initial days, but during a rehearsal for a romantic scene, Arjun Sarja hugged her without permission, ran his hands intimately up and down her back and pulled her closer.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more